Sunrisers Hyderabad: ఐపిఎల్ 2024 కోసం నిన్న దుబాయ్ లో నిర్వహించిన మినీ వేలంలో హైదరాబాద్ టీమ్ ముగ్గురు విదేశీ ప్లేయర్లను కొనుగోలు చేసింది. అది కూడా భారీ మొత్తంలో వెచ్చించి ఆ ప్లేయర్లను కొనుగోలు చేయడం పట్ల హైదరాబాద్ టీం అభిమానులు తీవ్రమైన నిరాశని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్లేయింగ్ 11 లో విదేశీ ప్లేయర్లు ఆడేది నలుగురు మాత్రమే…ఇక ఇప్పటికే హైదరాబాద్ టీమ్ లో నలుగురు టాప్ క్లాస్ విదేశి ప్లేయర్లు ఉన్నారు.ఇక వాళ్ళని కాదని మరో ముగ్గురిని ఎక్కువ మనీ పెట్టి తీసుకోవడం ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్నారు…
ఇక ఇప్పటికే టీంలో ఐడెన్ మార్క్‌రమ్, హెన్రీచ్ క్లాసెన్, గ్లేన్ ఫిలిప్స్, మార్కో జాన్సెన్ లాంటి ప్లేయర్లు ఉన్నారు…ఇక ఇలాంటి క్రమంలో ఆస్ట్రేలియాకి చెందిన ట్రవిస్ హెడ్ ని 6 కోట్ల 80 లక్షలు పెట్టి కొనుగోలు చేశారు.అలాగే ఆస్ట్రేలియా కి చెందిన మరో ప్లేయర్ అయిన పాట్ కమ్మిన్స్ ని 20 కోట్ల 50 లక్షల కి కొనుగోలు చేశారు.అలాగే శ్రీలంకకు చెందిన హసరంగా ని ఒక కోటి 50 లక్షల కి కొనుగోలు చేశారు.
ఇక ఇదంతా చూసిన చాలామంది హైదరాబాద్ అభిమానులు ఫైనల్ టీంలో ఆడేది నలుగురు ప్లేయర్లు మాత్రమే ఇంతమంది కాబట్టి దాని కోసం ఇంతమంది విదేశీ ప్లేయర్లని ఎందుకు తీసుకున్నారు అంటూ వాళ్లు హైదరాబాద్ టీమ్ పైన మండిపడుతున్నారు. అలాగే కావ్య పాపకి ఎవరైనా చెప్పండిరా ఫైనల్ టీంలో ఆడేది 4 విదేశీ ప్లేయర్లు మాత్రమే అంటూ పలు రకాల సెటైర్లు వేస్తూ సోషల్ మీడియా లో ట్రోల్ చేస్తున్నారు.
ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ప్లేయర్లను తీసుకున్న విధానం పైన మరికొంత అభిమానులు మండిపడుతున్నారు…ఇక ఇదిలా ఉంటే టీమ్ ఏ ప్లేస్ లో అయితే బలహీనంగా ఉందో అలాంటి ప్లేస్ లో విదేశీ ప్లేయర్లని పెట్టీ ఫుల్ ఫిల్ చేస్తే బాగుంటుంది అని భావించింది.కానీ అలా కాకుండా మన దేశ ప్లేయర్ల తో ఆ మైనస్ పాయింట్స్ ని ప్లస్ లుగా మారిస్తే బాగుండేది అని పలువురు వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు అంటే ఇక్కడ ఫైనల్ టీంలో ఆడేది నలుగురు ప్లేయర్లు మాత్రమే కాబట్టి విదేశీ ప్లేయర్ల మీద భారీ ఎత్తున డబ్బులు పెట్టకుండా తక్కువలో ఇన్వెస్ట్ చేసి ఇండియన్ ప్లేయర్లను తీసుకొని ఉంటే బాగుండేదని పలువురు మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…