IPL 2024 Auction: ఐపీఎల్ 2024 లో భాగంగా నిన్న జరిగిన మినీ ఆక్షన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఇద్దరు కుర్ర ప్లేయర్లను తీసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. ఇక అందులో ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ కి చెందిన శమీర్ రిజ్వి అనే ప్లేయర్ ని ఏకంగా 8 కోట్ల 40 లక్షల రూపాయలను వెచ్చించి మరి అతన్ని టీంలోకి తీసుకుంది. ఒక అన్ క్యప్డ్ ప్లేయర్ కి ఇంత మొత్తం లో చెల్లించి తీసుకోవడం అనేది నిజంగా అందరిని గురిచేస్తుందనే చెప్పాలి.
ఇక ఇలాంటి క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ విదేశీ ప్లేయర్ల మీద ఎక్కువగా ఫోకస్ చేయకుండా ఇండియాలోనే టాలెంట్ ఉన్న యంగ్ స్టార్స్ ని ఎంకరేజ్ చేసే విధంగా ముందుకు సాగుతూ వచ్చింది అందులో భాగంగానే శమీర్ రిజ్వి ని అలాగే తెలంగాణ రాష్ట్రానికి చెందిన అవనీష్ రావుని కొనుగోలు చేసింది. ఇక అవనీష్ రావుని 20 లక్షల రూపాయల బేస్ ప్రైజ్ తో కొనుగోలు చేయగా, శమీర్ రీజ్వి ని మాత్రం భారీ మొత్తంలో పెట్టీ కొనడం వెనక సీఎస్కే ప్లాన్ ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక వీళ్లిద్దరి ని కొనుగోలు చేయడం వెనక ముఖ్య కారణం గురించి మనం తెలుసుకున్నట్లైతే…
శమీర్ రీజ్వీ ఉత్తర ప్రదేశ్ కి చెందిన ప్లేయర్.ఈయన డొమెస్టిక్ మ్యాచ్ ల్లో తనదైన క్లాస్ ఇన్నింగ్స్ ఆడుతూ ఉత్తరప్రదేశ్ టీం కి చాలాసార్లు విజయాలను అందించాడు. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ టీ20 లీగ్ మ్యాచ్ లతో తన సత్తా చాటుకున్నాడు అందులో భాగంగానే ఆయన చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజ్ ని కూడా ఆకర్షించాడు. కాన్పూర్ సూపర్ స్టార్ తరపున ఆడిన శమీర్ రిజ్వి గొరక్ పుర్ లయన్స్ పై పంజా విసిరాడు.కేవలం 49 బంతుల్లో 104 పరుగులు చేసి ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేయడమే కాకుండా కాన్పూర్ టీం కి అదిరిపోయే విజయాన్ని అందించాడు. ఇక అలాగే అండర్ 23 మ్యాచ్ లో ఉత్తరప్రదేశ్ టీమ్ కెప్టెన్ గా వ్యవహరించడమే కాకుండా ఫైనల్ లో ఉత్తరాఖండ్ పైన అనూహ్య విజయాన్ని సాధించడంలో కీలక పాత్ర వహించాడు. ఇక ఉత్తరప్రదేశ్ కి ఈ మ్యాచ్ లో ఓడిపోయింది అనుకునే క్రమంలో 50 బంతుల్లో 84 పరుగులు చేశాడు అందులో 10 ఫోర్లు, 4 సిక్స్ లు ఉండటం విశేషం…ఇక ఉత్తరాఖండ్ పైన ఫైనల్ లో ఉత్తరప్రదేశ్ టీం భారీ విజయాన్ని అందుకుంది.ఆయన డొమెస్టిక్ క్రికెట్ లో కూడా తనదైన రీతిలో సత్తా చాటుతూ వస్తున్నాడు…
ఇక ఈయన్ని భారీ డబ్బులు పెట్టీ కొనడం వెనుక ధోని మాస్టర్ ప్లాన్ ఏంటంటే ఈయన ఇప్పుడు యంగ్ ప్లేయర్ కాబట్టి టీమ్ లో చాలా రోజులపాటు కొనసాగుతాడు. అలాగే కెప్టెన్ గా కూడా చేసిన అనుభవం ఉంది కాబట్టి ముందు భవిష్యత్తులో అతన్ని ట్రైన్ చేస్తే కెప్టెన్ గా కూడా తయారయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి అతన్ని టీం లోకి తీసుకున్నారు…ఇక హార్డ్ హిట్టర్ గా పేరుపొందిన శమీర్ రిజ్వి చెన్నై టీం తరఫున మంచి విజయాలు అందించడానికి రెడీ అవుతున్నాడు…
ఇక తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లా, ముస్తాబాద్ మండలం, పోతుగల్ గ్రామానికి చెందిన అరవల్లి అవనీష్ రావు ని కూడా చెన్నై సూపర్ కింగ్స్ టీం కొనుగోలు చేసింది. ఇక అవనీష్ రావు అండర్ 19 వరల్డ్ కప్ జట్టు లో చోటు సంపాదించుకున్నాడు.ఇక ఇంతకుముందు నవంబర్ నెలలో అండర్ 19 లో నాలుగు జట్ల టోర్నీ లో ఇండియా ఏ తరపున ఆడిన అవనీష్ రావు ఇండియా బి పైన 163 పరుగులు చేసి ఇండియా ఏ టీం కి భారీ విజయాన్ని అందించాడు. ఇక ఆ మ్యాచ్ లో 12 సిక్స్ లు కొట్టి ఒక అద్భుత శతకాన్ని నమోదు చేయడమే కాకుండా ఒంటి చేత్తో టీమ్ ని విజయతీరాలకు చేర్చాడు…ఇక దానితో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక ప్రస్తుతం చెన్నై టీం కూడా అతన్ని తక్కువలోనే కొనుగోలు చేసి చెన్నై టీం కి ఉపయోగపడే విధంగా ట్రైన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది…
ఇక ఈ ఇద్దరి ప్లేయర్లను ధోని తన సారథ్యం లో ట్రైన్ చేయబోతున్నట్టు గా తెలుస్తుంది.ఇక మ్యాచ్ లను గెలిపించడానికి యంగ్ ప్లేయర్స్ కావాలి అనేది ధోని ఎక్కువ గా నమ్ముతాడు. కాబట్టి టాలెంట్ ఉన్న ఇలాంటి యంగ్ ప్లేయర్ల మీదనే ధోని ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటాడు…