ASia Cup 2025 Pakistan Vs India: ఈసారి ఆసియా కప్ క్రికెట్ అభిమానులకు సరికొత్త ఆనందాన్ని అందిస్తోంది. క్రికెట్ మజాను కళ్ళ ముందు ఉంచుతోంది. వాస్తవానికి మిగతా జట్లకు అంతగా అభిమానులు రాకపోయినప్పటికీ.. భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ చూసేందుకు మాత్రం అభిమానులు పోటీ పడుతున్నారు. మైదానాలకు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా సూపర్ ఫోర్ మ్యాచ్ కైతే అభిమానులు భారీగా రావడంతో మైదానం నిండిపోయింది. అయితే ఎక్కువగా భారత జట్టు అభిమానులు రావడంతో స్టేడియం మొత్తం మూడు రంగుల జెండాతో నిండిపోయింది.
లీగ్, సూపర్ 4 మ్యాచ్ లలో టీమిండియా తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. లీడ్ దశలో ఏడు వికెట్లు.. సూపర్ ఫోర్ దశలో 6 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాలను అందుకుంది. ఈ రెండు మ్యాచ్లలో కూడా టీమిండియా ముందుగా బౌలింగ్ చేయడం విశేషం. ఆ తర్వాత ప్రత్యర్థి విధించిన లక్ష్యాన్ని సులువుగా చేదించడం గమనార్హం. బలమైన భారత బ్యాటింగ్ లైన్ అప్ ను కూల్చడానికి పాకిస్తాన్ ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. మరోవైపు పాకిస్తాన్ జట్టుతో ఇప్పటివరకు ఐసీసీ నిర్వహించిన ఏడు మ్యాచ్లలో టీమిండియా వరుసగా విజయాలు సాధించి తిరుగులేని రికార్డును తన పేరు మీద రాసుకుంది. అంతేకాదు ప్రత్యర్థి జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దుమ్మురేపింది. అందువల్లే ఇండియాతో మ్యాచ్ అంటే పాకిస్తాన్ అభిమానులు భయపడుతున్నారు. మీడియా వేదికగా మ్యాచ్ బైకాట్ చేస్తే బాగుంటుందని సలహా ఇస్తున్నారు.
సూపర్ ఫోర్, లీగ్ దశ మాత్రమే కాకుండా ఆసియా కప్ లో టీం ఇండియా, పాకిస్తాన్ మరోసారి పోటీపడే అవకాశం కనిపిస్తోంది. కంటే పాకిస్తాన్ శ్రీలంక, బంగ్లాదేశ్ కంటే మెరుగైన ప్రదర్శన చేస్తే ఫైనల్ చేరుతుంది. అప్పుడు ముచ్చటగా మూడోసారి చిరకాల ప్రత్యర్ధులు ఫైనల్ మ్యాచ్లో పోటీపడే అవకాశం ఉంది. 2022 నుంచి బిగ్ ఈవెంట్లలో పాకిస్తాన్ జట్టు పై భారత డామినేషన్ కొనసాగుతోంది. 2022 t20 వరల్డ్ కప్ నుంచి ప్రస్తుత ఆసియా కప్ సూపర్ ఫోర్ మ్యాచ్ వరకు టీమిండియా ఏకంగా ఏడు మ్యాచ్లలో విజయాలు సాధించింది. తద్వారా పాకిస్తాన్ జట్టుపై తన పై చేయిని స్థిరంగా కొనసాగిస్తోంది. వాస్తవానికి కొన్ని సంవత్సరాల నుంచి పాకిస్తాన్ జట్టు ఆట ఏమాత్రం బాగుండడం లేదు. బ్యాటింగ్లో ఆకట్టుకుంటే బౌలింగ్లో తేలిపోతోంది.. బౌలింగ్లో మెరుగుపడితే బ్యాటింగ్లో విఫలమవుతోంది. ఈ రెండిట్లో పర్వాలేదు అనుకుంటే ఫీల్డింగ్ లో చేతులెత్తేస్తోంది. దీనికి తోడు ఆటగాళ్ల అనైతిక ప్రవర్తన ఆ జట్టు పరువును సింధు నదిలో కలుపుతోంది. జట్టు ఆటగాళ్ల వ్యవహార శైలి నచ్చకపోవడంతో ఇప్పటికే చాలామంది శిక్షకులు పాకిస్తాన్ నుంచి వెళ్ళిపోయారు.