Homeక్రీడలుక్రికెట్‌Champions Trophy -2025 : బ్బాబ్బాబూ.. బీసీసీఐ అభ్యంతరాలు ఏమిటో జర చెప్పమనండయ్యా.. ఐసీసీ ని...

Champions Trophy -2025 : బ్బాబ్బాబూ.. బీసీసీఐ అభ్యంతరాలు ఏమిటో జర చెప్పమనండయ్యా.. ఐసీసీ ని కాళ్లా వెళ్లా పడిన పాక్

Champions Trophy -2025 : పాకిస్తాన్ దేశంతో ఉన్న సంవత్సరాల నాటి వైరాలు, ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ లో ఆడటానికి టీం ఇండియాను పాకిస్తాన్ కు పంపించేది లేదని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి ఐసీసీకి విన్నవించింది.” అక్కడ మా ఆటగాళ్లకు భద్రత ఉండదు. గతంలో ఎన్నో సంఘటనలు జరిగాయి. మా ఆటగాళ్ళు మాకు చాలా ముఖ్యం. మేము ఛాంపియన్స్ ట్రోఫీ లో తలపడాలంటే హైబ్రిడ్ మోడ్ లో టోర్నీ నిర్వహించాలని” బీసీసీఐ ఐసీసీకి స్పష్టం చేసింది. దీంతో పాకిస్తాన్ బోర్డుకు ఒక్కసారిగా షాక్ తగిలింది. ఎందుకంటే ఈ టోర్నీ పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భారీగా ఆశలు పెట్టుకుంది. ఈ టోర్నీని ఘనంగా నిర్వహించాలని భావించి మైదానాలను ఆధునీకరిస్తోంది. ఇందుకోసం భారీగానే ఖర్చు పెడుతుంది. అయితే పాకిస్తాన్ దేశంలో ఎట్టి పరిస్థితుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే విషయంలో అడుగుపెట్టేది లేదని భారత్ ఇప్పటికే తన వైఖరిని స్పష్టం చేసింది. దీంతో దాయాది దేశం ఆశలు అడుగంటి పోయాయి. ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ వేదిక మారే అవకాశం కనిపిస్తోంది. స్పోర్ట్స్ వర్గాల ప్రచారం ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీ ని ఐసీసీ దక్షిణాఫ్రికా వేదికగా నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ తమకు ఇబ్బందిగా మారడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మొహసిన్ నఖ్వీ ఆధ్వర్యంలో ఒక బృందం ఐసీసీని సంప్రదించింది..” మేము ఘనంగా ఛాంపియన్ ట్రోఫీ నిర్వహించాలని అనుకున్నాం. కానీ భారత జట్టు మా దేశంలో ఆడటానికి ఒప్పుకోవడం లేదు. అసలు దీనికి కారణాలు ఏమిటి? భారత జట్టుకు ఉన్న అభ్యంతరాలు ఏమిటి? అవి ఏమిటో మాకు కాస్త చెప్పండని” పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసిసి ని కోరింది..” ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ పాకిస్తాన్ రావడం లేదు. ఇదే విషయాన్ని ఐసీసీకి బీసీసీఐ వెల్లడించింది. దీనిపై స్పందన చెప్పాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు గత వారం ఐసిసి ఒక లేఖ రాసింది. దానిపై ఇటీవల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు స్పందించింది. తాము చాంపియన్ ట్రోఫీ కోసం చేస్తున్న ఏర్పాటులను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు icc కి వెల్లడించింది. టీమ్ ఇండియా ఆటగాళ్ల భద్రతకు మేము భరోసా కల్పిస్తామని ఐసీసీకి పిసిబి వెల్లడించిందని” పాకిస్తాన్లోని ఓ మీడియా ప్రతినిధి స్పష్టం చేశారు..

పాకిస్తాన్ ఏం చెబుతోందంటే..

అయితే ఇటీవల న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా దేశాలు పాకిస్థాన్లో పర్యటించాయి. ఇదే విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లింది. ఒకవేళ బీసీసీఐ ఒత్తిడికి తలవంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని దక్షిణాఫ్రికా వేదికగా నిర్వహించాలని చూస్తే.. తాము టోర్నీ నుంచి వెళ్ళిపోతామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హెచ్చరించింది. ఇక ఐసీసీ లేఖ రాయడం.. బీసీసీఐ అదే వాదన కొనసాగించడంతో.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు న్యాయ సలహా కోసం పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఆశ్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. స్పోర్ట్స్ వర్గాల అభిప్రాయం ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 19 వరకు చాంపియన్ ట్రోఫీ పాకిస్తాన్లో జరగాల్సి ఉంది. దీనికోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కొత్త మైదానాల నిర్మాణాన్ని పెంచింది. పాత వాటిల్లో మరమతులు చేపడుతోంది. అయితే మొదటి నుంచి పాకిస్తాన్ కు తమ జట్టును పంపించడం ఇష్టం లేదని బిసిసిఐ చెబుతూనే ఉంది. ఇదే విషయాన్ని పలు వేదికల వద్ద వెల్లడించింది. ఇప్పుడు అదే విషయాన్ని ఐసీసీకి కూడా వివరించింది. దీంతో టీమ్ ఇండియా ఆడే మ్యాచ్ లను హైబ్రిడ్ విధానంలో జరపాలని పిసిబికి ఇటీవల ఐసీసీ చెప్పింది. ఒకవేళ దానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఒప్పుకోకపోతే టోర్నీ మొత్తాన్ని దక్షిణాఫ్రికాకు తరలిస్తామని ఐసిసి పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు స్పష్టం చేసింది. అంతేకాదు ఈ విషయంలో తాము వెనుకడుగు వేయబోమని.. కొత్తగా షెడ్యూల్ కూడా ఖరారు చేస్తామని ఐసిసి పిసిబికి అల్టిమేటం కూడా ఇచ్చింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular