Shreyas Iyer T20 Captain: టి20 లో డామినేషన్ కొనసాగుతోంది. వన్డేలలో కూడా అదే జోరు ఉంది. టెస్టుల్లో మాత్రం అలా లేదు. టి20, వన్డేలలో జట్టు బ్రేక్ లు లేని బుల్డోజర్ లాగా దూసుకుపోతుంటే.. టెస్టుల్లో మాత్రం అలా లేదు. ఈ నేపథ్యంలో భవిష్యత్తు కాలాన్ని ముందుగానే ఊహించి.. టీమిండియా మేనేజ్మెంట్ సరికొత్త ప్రణాళికలను రూపొందించింది.
జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం టీమిండియా టి20 కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ దాదాపుగా ఖాయమని వార్తలు వస్తున్నాయి. సూర్య కుమార్ యాదవ్ సరిగా ఆడలేక పోవడం.. ఐపీఎల్లో అతడి ఫామ్ అంత గొప్పగా లేదు. పైగా వ్యక్తిగత కారణాలవల్ల అతడు సెలవు కోరిన నేపథ్యంలో.. వచ్చే సిరీస్లలో అతడిని జట్టుకు దూరంగా ఉంచే అవకాశం కనిపిస్తోంది. సూర్య నాయకత్వంలో టీమిండియా ఒక్క టి20 సిరీస్ కూడా కోల్పోలేదు. పైగా టి20 వరల్డ్ కప్ కూడా గెలిచింది. అయితే అయ్యర్ ప్రస్తుతం దూకుడు మీద ఉన్నాడు. ఐపీఎల్ లో పంజాబ్ జట్టును ముందుకు తీసుకెళ్తున్నాడు. అతడి నాయకత్వంలో పంజాబ్ జట్టు ఇంతవరకు ఒక్క ఓటమి కూడా ఎదుర్కోలేదు. సోషల్ మీడియాలో అయ్యర్ కు విపరీతమైన సపోర్ట్ లభిస్తోంది. ఇప్పటికే దాదాపు మేనేజ్మెంట్ అతడి విషయంలో సానుకూలంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
సూర్య కుమార్ యాదవ్ తో పాటు, తిలక్ వర్మ, రింకూ సింగ్ ను టి20 జట్టు నుంచి మేనేజ్మెంట్ ఆలోచించినట్టు తెలుస్తోంది. త్వరలో జరగబోయే సిరీస్లకు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలుస్తోంది.. బెంగళూరు ఆటగాడు రజత్ పాటిదార్ టి20 జట్టులోకి ప్రవేశించే అవకాశం కనిపిస్తోంది. సాయి సుదర్శన్ టెస్ట్ జట్టులోకి ప్రకటించే అవకాశం ఉంది..రుతు రాజ్ గైక్వాడ్ లేదా దేవదత్ పడికల్ స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగే టెస్ట్ సిరీస్ లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది.
వన్డేలలో జట్టు బలాన్ని మరింత పెంచడం.. టి20 లలో ప్రస్తుతం ఉన్న ప్రథమ స్థానాన్ని మరింత సుస్థిరం చేయడం.. టెస్టులలో ఘనంగా పునరాగమనాన్ని చాటడం వంటి లక్ష్యాలతో టీమ్ ఇండియా మేనేజ్మెంట్ అడుగులు వేస్తోంది. అందువల్లే ఈ స్థాయిలో ప్రణాళికలను రూపొందించింది. అయితే జట్టులో కూర్పు విషయంలో ఇదే ఫైనల్ కాదని.. ఇంకా చాలా వరకు మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.