INDvsENG : టీమిండియాలో బౌలర్లు దారుణమైన ప్రదర్శన చేశారు. ముఖ్యంగా కొంతమంది బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చారు. ఆడుతోంది టెస్ట్ సిరీస్ అనే విషయాన్ని కూడా మర్చిపోయి.. చెత్త బంతులు వేశారు. దీంతో ఇంగ్లాండ్ ప్లేయర్లు పండగ చేసుకున్నారు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేసి అదరగొట్టారు. పరుగుల మీద పరుగులు చేసి భారీ లక్ష్యాన్ని సైతం సులువుగా కరిగించారు. తద్వారా మరో సెషన్ మిగిలి ఉండగానే విజయాన్ని అందుకున్నారు. ఒకరకంగా టీమ్ ఇండియా గర్వాన్ని నేలకు దించారు. వాస్తవానికి ఇంగ్లాండ్ గెలిచింది అనే దానికంటే.. భారత్ చేతులారా ఓడిపోయింది అనడం సబబు. ముఖ్యంగా టీమ్ ఇండియా ఫీల్డింగ్లో అత్యంత నాసిరకమైన ప్రదర్శన చేసింది. బి గ్రేడ్ స్థాయి జట్టులా కూడా ఫీల్డింగ్ చేయలేకపోయింది. ఈ మాట అనడానికి ఏమాత్రం ఇబ్బంది లేదు. ఎందుకంటే చేతిలోకి వచ్చిన క్యాచ్ లను ఫీల్డర్లు నేలపాలు చేశారంటే దాన్ని ఏమనుకోవాలి.. ముఖ్యంగా జట్టు విజయాన్ని నిర్దేశించే పరిస్థితుల్లో క్యాచ్ లు వదిలేస్తే దాన్ని ఏమనుకోవాలి.. పైగా క్యాచులు నేలపాలు చేసి ఓ ఆటగాడు సెలబ్రేషన్లు చేసుకోవడం సోషల్ మీడియాలో విమర్శలకు కారణమవుతోంది.
టీమిండియాలో జైస్వాల్ ఏకంగా నాలుగు క్యాచ్ లు నేలపాలు చేశాడు. కీలకమైన దశలో ఆ క్యాచ్ లు వదిలేయడంతో ఇంగ్లాండు ప్లేయర్లు జీవదానాలు సొంతం చేసుకున్నారు. తద్వారా ఇంగ్లాండ్ భారీ స్కోర్ చేసేందుకు బాటలు వేసుకున్నారు. అంతేకాదు భారీ లక్ష్యాన్ని సైతం చేదించడానికి అనుకూలంగా మార్చుకున్నారు. తొలి ఇన్నింగ్స్ లో జైస్వాల్ 102 పరుగులు చేశాడు. కానీ అతడు వదిలిపెట్టిన క్యాచ్ ల వల్ల ఇంగ్లాండ్ ఓపెనర్ డకెట్ ఏకంగా 149 పరుగులు చేశాడు.. ఇది సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ విజయానికి బలమైన పునాది అయింది. ఆ తర్వాత వచ్చిన ప్లేయర్లు మిగతా లక్ష్యాన్ని పూర్తి చేశారు. తద్వారా టెస్టులలో ఇంగ్లాండ్ జట్టుకు అనితర సాధ్యమైన విజయాన్ని అందించారు. ఇక రెండవ ఇన్నింగ్స్ లో జైస్వాల్ అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు. నిర్లక్ష్యపు షాట్ ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. ఇన్ని క్యాచ్లు వదిలేసినప్పటికీ జైస్వాల్ లో ఏ మాత్రం ప్రాయశ్చిత్తం కనిపించలేదు. పైగా అతడు మైదానంలో ఉండి సెలబ్రేషన్లు చేసుకోవడం విశేషం. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ” క్యాచ్ లన్నీ మిస్ చేశాడు. జట్టు ఓడిపోవడానికి ప్రధాన కారణంగా నిలిచాడు. అటువంటి ఈ ఆటగాడు ఇప్పుడు సెలబ్రేషన్లు జరుపుకుంటున్నాడు. జట్టు ఓడిపోతుంటే సెలబ్రేషన్లు జరుపుకోవడం ఏమిటో జర ఇతడికి ఎవరైనా చెప్పండయ్యా” అంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు.
Bro Jaiswal dancing happily after dropping 7 catches in a single match.
Helped England to win single-handedly.
Goal achieved.#INDvsENG pic.twitter.com/EqjsxuJ5vO— Villager Anuj Tomar (@Da___Engineer) June 24, 2025