T20 World Cup 2021: భారత్, పాకిస్తాన్ మ్యాచ్ పై అభిమానుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. ప్రపంచ కప్ టోర్నీల్లో భారత ప్రదర్శన మెరుగ్గా ఉన్నా నిర్లక్ష్యం వద్దని సూచిస్తున్నారు. అయితే ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేయొద్దని చెబుతున్నారు. రెండు దేశాల్లో అప్పుడే ఆశలు పెరిగిపోయాయి. అయితే పాక్ ను తక్కువగా చూడొద్దని అప్పుడే జాగ్రత్తలు సూచిస్తున్నారు. 2017లో చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో చోటుచేసుకున్న పరిణామాలతో ఇండియా అప్రమత్తంగా ఉండాలని అప్పుడే అభిమానుల నుంచి సూచనలు వస్తున్నాయి.

కోహ్లీ సేనపై పెద్ద బాధ్యత ఉందంటున్నారు. సత్తా చాటి సమష్టిగా ఆడి పాక్ పై విజయం సొంతం చేసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి గాను అందరు భేషజాలకు పోకుండా కలికట్టుగా పోరాడాల్సిన విషయం చెబుతున్నారు. మరో వైపు పాక్ ఆటగాళ్లలో ఫామ్ లో ఉన్న బ్యాట్స్ మెన్ ఫకర్ జమాన్ విషయంలో భారత ఆటగాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే. అతడి ఫామ్ ను అడ్డుకోకపోతే కష్టాలే. బాబర్ సైతం తన ఫామ్ ను కొనసాగిస్తున్న క్రమంలో వారిని కట్టడి చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక తీసుకోవాల్సిందే.
దీంతో టీమిండియాపై బాధ్యత పెరిగింది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ కావడంతో ఇండియా ఆటగాళ్లు నిలకడగా రాణించేందుకు ముమ్మర కసరత్తు చేయాల్సిందే. టీ 20 మ్యాచ్ ల్లో మంచి రికార్డు ఉన్నా ఎక్కడ కూడా ఉపేక్షించకుండా క్షణక్షణం సద్వినియోగం చేసుకోవాలని చూస్తోంది. పాక్ విసిరే సవాల్ ను ఇండియా సమర్థంగా తిప్పికొట్టాలి. అందుకు సమర్థంగా జట్టు శ్రమించాలి.
పాక్ ఆటగాళ్లపై ఒత్తిడి పెంచే దిశగా అడుగులు వేయాలి. ప్రతి బంతిని ఒడిసి పట్టుకుని మరీ బౌల్ చేయాల్సి ఉంటుంది. దీని కోసం ఆటగాళ్లు తమ శక్తియుక్తుల్ని ప్రదర్శించాలి. ఎదుటి జట్టు బలహీనతల్ని సొమ్ము చేసుకునే క్రమంలో టీమిండియా ఒత్తిడిని జయించాలి. అందుకు జట్టు కూర్పు మెరుగుపరచుకోవాల్సిందే అని నిపుణులు చెబుతున్నారు.