Homeక్రీడలుక్రికెట్‌Suryakumar Yadav Comeback: సూర్య భాయ్.. మేల్కొన్నాడు.. కానీ ఇప్పటికే ఆలస్యమైపోయింది..

Suryakumar Yadav Comeback: సూర్య భాయ్.. మేల్కొన్నాడు.. కానీ ఇప్పటికే ఆలస్యమైపోయింది..

Suryakumar Yadav Comeback: టీమిండియాలో ముఖ్యంగా టి20 ఫార్మాట్ లో విపరీతమైన పోటీ ఉంటుంది. ఆ పోటీని తట్టుకొని ఆటగాళ్లు అవకాశాలు సొంతం చేసుకోవాలి. ఒకసారి స్థానం లభిస్తే వస్తే చాలు.. దానిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. ఆటతీరుతో ఆకట్టుకోవాలి. కానీ సూర్యకుమార్ యాదవ్ కు ఇది చేతకాలేదు. అవకాశం కాదు.. ఏకంగా అతడిని మేనేజ్మెంట్ కెప్టెన్ ను చేసింది. సారధిగా ఓకే అయినప్పటికీ.. టీమిండియా కు టి20 వరల్డ్ కప్ అందించినప్పటికీ.. ఆటగాడిగా మాత్రం విఫలమయ్యాడు.

జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు విఫలమైన షాట్లు ఆడుతూ పరువు తీసుకున్నాడు. మేనేజ్మెంట్ వరుసగా అతడికి జట్టులో స్థానం కల్పించినప్పటికీ.. ఏళ్ల పాటు ఎదురుచూసినప్పటికీ అతడు తన ఆట తీరు మార్చుకోలేదు. మేనేజ్మెంట్ కూడా ఏం చేస్తుంది.. అవకాశాలు ఇచ్చిన తర్వాత ఇచ్చేసింది.. ఆ తర్వాత ఓపిక నశించింది. ఇంకేముంది జట్టు నుంచి పక్కన పెట్టింది. కనీసం ఆటగాడిగా కూడా అతడిని ఎంపిక చేయలేదు. భారత జట్టుకు టి20 వరల్డ్ కప్ అందించిన ఆటగాడికి ఈ స్థాయిలో పనిష్మెంట్ ఉంటుందని ఎవరూ ఊహించలేదు.

సూర్య కుమార్ యాదవ్ నేషనల్ టీమ్ లో చోటు కోల్పోవడంతో.. తనను తాను నిరూపించుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా ముంబై t20 లీగ్ లో అతడు సత్తా చూపిస్తున్నాడు.. మైదానంలో పరుగుల వరద పారిస్తున్నాడు.. ఇటీవల జరిగిన మ్యాచ్లో 24 బంతుల్లో 48 పరుగులు చేశాడు. ఆ తర్వాత రెండో మ్యాచ్లో 36 బంతుల్లో 72 పరుగులు చేశాడు. అతడు ఆడిన ఆటతీరును మెచ్చి నిర్వాహకులు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం అందించారు. అయితే ఈ మ్యాచ్లో ఐదు వికెట్లు తీసిన తన జట్టు బౌలర్ డిసౌజా తో అప్ పురస్కారాన్ని పంచుకున్నాడు. నిర్వాహకులు తనకిచ్చిన అవార్డును అతనికి ఇచ్చేసి.. గొప్ప మనసు చాటుకున్నాడు.

సూర్య కుమార్ యాదవ్ ఇదే స్థాయిలో బ్యాటింగ్ చేస్తే మళ్లీ జాతీయ జట్టులో చోటు లభించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకసారి టీమిండియా లో చోటు కోల్పోతే మళ్ళీ సాధించడం అంత ఈజీ కాదు. అది ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ కు తెలుసు.. జట్టులో చోటు కోల్పోయిన తర్వాత వారు తిరిగి మళ్ళీ జట్టులోకి రావడానికి ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డారు. కొన్ని సందర్భాలలో తమ స్థాయిని మించి ఆడారు. అప్పటికి గాని మేనేజ్మెంట్ కరుణ చూపలేదు. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కూడా అలానే చేయాలి. అంతకుమించి ఆడితేనే అతడికి జట్టులో మళ్ళీ అవకాశం లభిస్తుంది. మిస్టర్ 360 తన పూర్వ వైభవాన్ని చాటుకునే ప్రయత్నం చేయాలని అభిమానులు కోరుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version