Suresh Raina: చెన్నై జట్టు ఐపీఎల్లో ఇప్పటివరకు 9 మ్యాచులు ఆడింది. ఇందులో కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించింది. చెన్నై జట్టు ఇంకా ఐదు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ ఐదింటికీ ఐదు గెలిచినప్పటికీ చెన్నై జట్టు ప్లే ఆఫ్ వెళ్లడానికి అవకాశం ఉంటుందంటే? స్పష్టమైన సమాధానం చెప్పలేని పరిస్థితి. అయితే ఇతర జట్లు ఒకవేళ చెత్తగా ఆడితే చెన్నై జట్టుకు ప్లే ఆఫ్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే అది అంత సులభం కాదు.. ఇక చెన్నై జట్టు(Chennai Super kings) శుక్రవారం జరిగిన మ్యాచ్లో హైదరాబాద్(sun Risers Hyderabad) చేతిలో ఓడిపోయిన తర్వాత.. రకరకాల విమర్శలు, విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. అందులో చెన్నై జట్టు మాజీ ఆటగాడు సురేష్ రైనా (Suresh Raina) విశ్లేషణ ఆసక్తికరంగా ఉంది.. ఈ సందర్భంగా తన మనసులో ఉన్న మాటలను సురేష్ రైనా బయటపెట్టాడు. ముఖ్యంగా ధోని ఉన్నప్పటికీ చెన్నై జట్టు ఎందుకు ఓడిపోతుందో.. ఎందుకు ఇంతలా దారుణమైన ప్రదర్శన చేస్తోందో.. స్పష్టత ఇచ్చాడు..
Also Read: CSK ప్లేఆఫ్స్‌కు చేరాలంటే.. ఇవీ అవకాశాలు..
ధోని ఉన్నప్పటికీ
చెన్నై జట్టులో మహేంద్రసింగ్ ధోని ( Mahendra Singh Dhoni) ఉన్నప్పటికీ మిగతా ఆటగాళ్లు కూడా మెరుగ్గా ఆడాలి. జట్టు అవసరాలకు తగ్గట్టుగా ఆడాలి. అప్పుడే విజయం సాధ్యమవుతుంది. చెన్నై జట్టును ఐదుసార్లు విజేతగా నిలిపినప్పటికీ ధోని ఎప్పుడు కూడా వేలంలో పాల్గొనలేదు. చెన్నై జట్టుకు సంబంధించి కాశి సార్ కు పరిపాలన సంబంధించి మంచి అనుభవం ఉంది. రూప మేడం కూడా క్రికెట్ వ్యవహారాలు పకడ్బందీగా పర్యవేక్షిస్తారు. ఆటగాళ్ల కొనుగోలు.. జట్టును నిర్వహించడం వంటి విషయాలలో స్పష్టమైన వైఖరితో ఉంటారు. అయితే ఈసారి ఆటగాళ్ల ఎంపికలు సరైన విధానంలో చేసినట్టు కనిపించడం లేదు. ఇది నా భావన మాత్రమే కాదు.. జట్టులో ఉన్న ప్రతి వ్యక్తి భావన కూడా ఇదే విధంగా ఉంది.. ఒకరకంగా నేను కూడా ఎప్పుడు వేలంలో పాల్గొనలేదు. చర్చల్లో కూడా భాగస్వామిని కాలేదు. రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల గురించి చర్చ వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడేవాడిని. ఆ సమయంలో ధోని కూడా తన ఉద్దేశాన్ని వెల్లడించేవాడు. అంతేతప్ప ఎప్పుడు కూడా జట్టులో అదురు భాగం కాలేదు. కోర్ గ్రూప్ లో ఉన్న సభ్యులు మాత్రమే వేలంలో పాల్గొనేవారు.. ధోని వయసు ప్రస్తుతం 43 సంవత్సరాలు. అతడు అన్ క్యాప్డ్ ఆటగాడిగా జట్టులో ఉన్నాడు. 43 సంవత్సరాల వ్యక్తి బ్యాటింగ్ చేస్తుంటే.. మిగతా ఆటగాళ్లు ఏం చేస్తున్నారు.. ఆటగాళ్లు 18, 17, 12 కోట్ల వరకు తీసుకుంటున్నారు. అలాంటప్పుడు మేనేజ్మెంట్ నమ్మకాన్ని వారు కాపాడాలి కదా.. గత సీజన్లో కూడా ఇలాంటి తప్పే జట్టులో కనిపించింది. ఇప్పుడు కూడా అదే దర్శనమిస్తుంటే ఇంకా ఏం చేయాలని” సురేష్ రైనా వ్యాఖ్యానించాడు.. మరోవైపు జట్టు కోచ్ ఫ్లెమింగ్ కూడా తన దైన వ్యాఖ్యలు చేశాడు..” హైదరాబాద్ జట్టుతో ఓడిపోవడం బాధగా ఉంది.. మా దగ్గర అత్యుత్తమ క్రికెటర్లు ఉన్నారు. మాకు తగ్గట్టుగా క్రికెట్ ఆడడం. అయితే వేలంలో మాకంటే మంచి ఆటగాళ్లను ఇతర జట్లు కొనుగోలు చేశాయి. అదే కాస్త బాధగా ఉందని” ఫ్లెమింగ్ పేర్కొన్నాడు.
Also Read: ఈడెన్ లో శ్రేయస్ “పంజా” విసిరితే.. రహానే కోల్ “కథ” ముగిసినట్టే