https://oktelugu.com/

Kavya Maran: ఆ క్రికెటర్ పై మనసు పారేసుకున్న కావ్య మారన్

Kavya Maran: కోట్ల కొద్ది డబ్బు, కార్పొరేట్ కంపెనీలు, ఫ్రాంచైజీలు, యాడ్స్ అండర్స్మెంట్ లు.. ఇలా ఒకటా రెండా.. అందుకే ప్రపంచం లోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్ గా ఐపీఎల్ వినతి కెక్కింది. ఐపీఎల్ పుణ్యమా అని మరికొన్ని దేశాలు తమ ప్రాంతాల్లో ఇలాంటి పొట్టి క్రికెట్ పోటీలను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సౌత్ ఆఫ్రికా కూడా “సౌత్ ఆఫ్రికా టీ 20 లీగ్ ” పేరుతో ఒక టోర్నీని నిర్వహించేందుకు ఏర్పాట్లు […]

Written By:
  • Rocky
  • , Updated On : September 24, 2022 1:10 pm
    Follow us on

    Kavya Maran: కోట్ల కొద్ది డబ్బు, కార్పొరేట్ కంపెనీలు, ఫ్రాంచైజీలు, యాడ్స్ అండర్స్మెంట్ లు.. ఇలా ఒకటా రెండా.. అందుకే ప్రపంచం లోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్ గా ఐపీఎల్ వినతి కెక్కింది. ఐపీఎల్ పుణ్యమా అని మరికొన్ని దేశాలు తమ ప్రాంతాల్లో ఇలాంటి పొట్టి క్రికెట్ పోటీలను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సౌత్ ఆఫ్రికా కూడా “సౌత్ ఆఫ్రికా టీ 20 లీగ్ ” పేరుతో ఒక టోర్నీని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన వేలం పాటలను కూడా ప్రారంభించారు.

    Kavya Maran

    Kavya Maran

    కావ్య మారన్ పేరు వినిపిస్తోంది

    తాజాగా ఈవేలం పాటలో వినిపిస్తున్న పేరు కావ్య మారన్.. ఈమె ఎవరో కాదు సన్ గ్రూప్ ల సంస్థల చైర్మన్ కళానిధి మారన్ కుమార్తె. అందం, అభినయం, చలాకితనం తో వేలంపాటలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సన్రైజర్స్ యజమానిగా కావ్య మారన్ సుపరిచితురాలు. తాజాగా జరిగిన వేలంలో భారీ ధరకు ఒక ఆటగాడిని కొనుగోలు చేసింది. అందరి దృష్టిని ఆకర్షించింది. తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలను ఆర్జించడం వ్యాపారవేత్తల వ్యూహం. కావ్య మారన్ కూడా ఇదే కోవలోకి వస్తుంది. ఎందుకంటే సన్రైజర్స్ జట్టులో ఉన్న ఆటగాళ్లు వేలంలో దక్కించుకున్న తీరును చూస్తేనే ఆమెకు ఎటువంటి ప్రణాళిక ఉందో అర్థమవుతుంది. తక్కువ ధరకే నాణ్యమైన ఆటగాళ్ళను కొనుగోలు చేయడం ఆమె లక్ష్యం. అందుకే నెటిజన్లు ఆమెను పిసినారి అంటారు.

    ఆ ఆతగాడిని భారీ ధరకు..

    ఈ క్రమంలోనే కావ్య మారన్ 22 ఏళ్ల దక్షిణాఫ్రికా యువ సంచలనం అయిన ట్రిస్టన్ స్ట్రబ్స్ ను 4.1 కోట్లకు కొనుగోలు చేసి అందర్నీ ఆశ్చర్యాన్ని గుర్తిస్తుంది. ఎంఐ కేఫ్టౌన్(ముంబాయి ఇండియన్స్) తో పోటీపడి మరి సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టును దక్కించుకుంది. ఇప్పటివరకు జరిగిన వేలంలో స్టబ్స్ దే అత్యధిక ధర కావడం విశేషం.

    Kavya Maran

    Kavya Maran

    .భారత్ పైనే తొలి టీ -20 ఆడాడు

    స్టబ్స్ అరంగేట్రం ఇండియా పైనే. భారీ హిట్టర్ గా ఇతడికి మంచి పేరుంది. సిక్స్ లు బాదడంలో ఇతడికి ఇతడే సాటి. ఈ క్రమంలోనే 6 టీ_20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ల్లో 39.66 యావరేజ్ తో 119 పరుగులు మాత్రమే చేశాడు. కానీ అతని స్ట్రైక్ రేట్ మాత్రం 216 ఉంది. అతడు ఇన్నింగ్స్ ల్లో ఫోర్ల కంటే సిక్స్ లే ఎక్కువగా ఉన్నాయి. 34 జాతీయ టి20 మ్యాచ్ల్లో 784 పరుగులు చేశాడు. ఇక్కడ అతడి స్ట్రైక్ రేట్ 164 ఉంది. ఫార్మాట్ లో 39 ఫోర్లు కొట్టగా, 53 సిక్సులు బాదాడు. దీంతోనే అతడికి డాషింగ్ బ్యాటర్ గా గుర్తింపు లభించింది. వికెట్ కీపర్ గా కూడా అతడు మెరుగ్గానే ఆడతాడు. ఇక స్టబ్స్ గతంలో ముంబాయి ఇండియన్స్ జట్టులో ఆడాడు. మరీ భారీ ధరకు కొన్న కావ్య మారన్ ఆశలను ఎలా నిలబెడతాడో చూడాలి.

    Tags