IND Vs PAK (18)
IND Vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా భారత్ పాకిస్తాన్ (IND vs PAK) తలపడ్డాయి. ఈ మ్యాచ్లో భారత్ ఆరు వికెట్ల తేడాతో అనితర సాధ్యమైన విక్టరీ అందుకుంది. సెమీఫైనల్ అవకాశాలను మరింత పటిష్టం చేసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్ లో భారత్ బంగ్లాదేశ్ పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది.
అటు బంగ్లాదేశ్, ఇటు పాకిస్తాన్ జట్లపై భారత్ వరుస విజయాలు సాధించడంతో సెమీ ఫైనల్ అవకాశాలను మరింత బలోపేతం చేసుకుంది. దీంతో భారత్ గ్రూప్ – ఏ లో పాయింట్లు పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది. అయితే పాకిస్తాన్ జట్టుపై భారత్ విజయం సాధించిన నేపథ్యంలో.. భారత జట్టు పై ప్రశంసల జల్లు కురుస్తోంది.. “దాయాది జట్టుపై భారత్ అద్భుతంగా ఆడింది.. 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది. విరాట్ కోహ్లీ సెంచరీ చేయడంతో భారత్ ఘనవిజయం సాధించిందని” నెటిజన్లు పేర్కొంటున్నారు.
ఢిల్లీ పోలీస్ శాఖ కీలక ట్వీట్
భారత్ చేతిలో పాకిస్థాన్ ఓడిపోయిన నేపథ్యంలో ఢిల్లీ పోలీస్ శాఖ కీలక ట్వీట్ చేసింది.. ” పక్క దేశం నుంచి భారీగా శబ్దాలు వినిపిస్తున్నాయి. అదృష్టవషత్తు కేవలం టీవీలు పగలగొట్టిన శబ్దాలనే మేము ఆశిస్తున్నామని” వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. మరోవైపు భారత జట్టు చేతిలో ఓడిపోయిన నేపథ్యంలో పాకిస్తాన్ అభిమానులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. పాకిస్తాన్ ఆటగాళ్లపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు..” మా ఆటగాళ్లకు ఏమైందో అర్థం కావడం లేదు. బ్యాటింగ్లో విఫలమయ్యారు. బౌలింగ్లో చేతులెత్తేశారు. ఫీల్డింగ్లో తడబడ్డారు. ఇటువంటి ఆటగాళ్లు మరోసారి మా దేశానికి ఛాంపియన్స్ ట్రోఫీ తీసుకువస్తారని ఆశించడం మా అత్యాశ. మా కలలు మొత్తం కల్లలు చేశారని” పాకిస్తాన్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు, ఫోటోలు సంచలనంగా మారాయి. పాకిస్తాన్ అభిమానులు టీవీలను పగలగొట్టిన దృశ్యాలు.. విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తే తట్టుకోలేక వస్తువులను ధ్వంసం చేసిన వీడియోలు తెగ దర్శనమిస్తున్నాయి. ఢిల్లీ పోలీస్ శాఖ చేసిన ట్వీట్ పై దృశ్యాలకు బలం చేకూర్చుతోంది. గతంలో టి20 వరల్డ్ కప్ లో టీమిండియా చేతిలో పాకిస్థాన్ ఓడిపోయినప్పుడు కూడా ఢిల్లీ పోలీస్ శాఖ ఇలాగే ట్వీట్ చేసింది. ఢిల్లీ పోలీస్ శాఖ చేసిన ట్వీట్ కు సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన వస్తోంది. 1.4 వేలమంది ఈ ట్వీట్ పై స్పందించారు. 6.9 వేలమంది రీ – ట్వీట్ చేశారు. 47.2 వేలమంది లైక్ చేశారు.
Just heard some weird noises from the neighbouring Country.
Hope those were just TVs Breaking. #INDvsPAK #ViratKohli #TeamIndia #BleedBlue #51stODI #CongratulationsTeamIndia
— Delhi Police (@DelhiPolice) February 23, 2025