Homeక్రీడలుParis Olympics 2024 : సెన్ నదిలో ప్రారంభం.. వినేశ్ పై అనర్హత.. పారిస్ ఒలింపిక్స్...

Paris Olympics 2024 : సెన్ నదిలో ప్రారంభం.. వినేశ్ పై అనర్హత.. పారిస్ ఒలింపిక్స్ లో ఈ అంశాలే హైలెట్..

Paris Olympics 2024 : పారిస్ వేదికగా.. గత 19 రోజులుగా ఒలింపిక్స్ జరిగాయి. ఆదివారం రాత్రి 12 గంటలకు ముగింపు వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆరంభ వేడుకలు మాదిరిగానే ముగింపు సంబరాలను కూడా ఒలిపి కమిటీ అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఈసారి పోటీలలో భారత్ డబుల్ మార్క్ సాధిస్తుందని అందరూ భావించారు. కానీ ఆరు మెడల్స్ తోనే భారత్ సరిపెట్టుకుంది.

స్పోర్ట్స్ విలేజ్ అవతల

పారిస్ లో ఆరంభ వేడుకలను స్పోర్ట్స్ విలేజ్ వెలుపల నిర్వహించారు. సెన్ నదిపై ఏర్పాటుచేసిన బోట్లలో అథ్లెట్లు ప్రదర్శనగా వచ్చారు. అయితే వర్షం కురవడంతో వేడుకలకు అంతరయం ఏర్పడింది. ఈ క్రమంలో డీజే బార్బరా బట్చ్(లెస్ ***) ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. చివరికి అమెరికా అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ కూడా దీనిపై స్పందించారు. ఈత పోటీలలో కాలుష్యం పెరగడంతో పలువురు క్రీడాకారులు అస్వస్థతకు గురయ్యారు.

బంగారు కొండ

టెన్నిస్ స్టార్ట్ ఆటగాడు నోవాక్ జకోవిచ్ ఈసారి గోల్డెన్ స్లామ్ గా ఆవిర్భవించాడు. టెన్నిస్లో సింగిల్స్ ఫైనల్ విభాగంలో అల్కరాజ్ పై ఘన విజయం సాధించి పసిడి సొంతం చేసుకున్నాడు. 37 సంవత్సరాల జకోవిచ్ ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్, ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ గెలిచాడు. ఈ స్వర్ణ పతకంతో అన్నింటిని కైవసం చేసుకున్న ఐదవ టెన్నిస్ ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు.

ప్రశంసలు కురిపించింది

జిమ్నాస్టిక్స్ పోటీల్లో భాగంగా ప్రముఖ అథ్లెట్ సిమోన్ బైల్స్ తన ప్రత్యర్థి రెబెకా పై ప్రశంసల జల్లు కురిపించింది. ఆమెను రాణిగా పేరుపొంది. రెబెకా పసిడి గెలుచుకోగా.. బైల్స్ రజతం సొంతం చేసుకుంది.

వారేవా నోవా

వంద మీటర్ల పరుగు పందెంలో ఈసారి బోల్టు లేని లోటు తీర్చాడు అమెరికన్ అథ్లెట్ నోవా లైల్స్. సెకండ్లో ఐదో వేల వంతు బేధంతో విజేతగా ఆవిర్భవించాడు. ఫైనల్స్ లో 9.79 సెకండ్లతో పసిడి సొంతం చేసుకున్నాడు. జమైకా అథ్లెట్ థామ్సన్ రజతం సాధించాడు.

ఆమె కాదు అతడు

బాక్సింగ్ పోటీలలో లింగ వివాదం ఈసారి ఒలింపిక్స్ ను షేక్ చేసింది. అల్జీరియా బాక్సర్ ఇమానే ఖేలీఫ్ మహిళ కాదని తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. కేవలం 46 సెకండ్లలో ఆమె తన ప్రత్యర్థిని ఓడించడంతో ఈ వ్యాఖ్యలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆమెపై సోషల్ మీడియాలో వేధింపులు పెరగడంతో ఇమానే ఖేలీఫ్ ఏకంగా కేసు నమోదు చేసే వరకు వెళ్ళింది. ఆ తర్వాత గోల్డ్ మెడల్ సాధించి తన సత్తా ఏమిటో చూపించండి. ఇక తైవాన్ బాక్సర్ లిన్ యూ టింగ్ కు ఇలాంటి పరిస్థితి ఎదురయింది. అయితే ఆమె కూడా గోల్డ్ మెడల్ సాధించింది.

వివాదాన్ని రాజేసిన సెల్ఫీ

టేబుల్ టెన్నిస్ పోటీలలో ఈసారి దక్షిణకొరియా కాంస్యం దక్కించుకుంది. ఉత్తరకొరియా రజతం సొంతం చేసుకుంది. దీంతో ఆ ఇద్దరు క్రీడాకారులు తమ ఫోన్లలో సెల్ఫీ తీసుకున్నారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా క్రీడా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఆ రెండు దేశాలలో మాత్రం వివాదానికి కారణమైంది.

14 సంవత్సరాలకే సరికొత్త రికార్డు

స్కేట్ బోర్డింగ్ విభాగంలో ఆస్ట్రేలియా అథ్లెట్ ఆరిసా సరికొత్త రికార్డు సృష్టించింది. 14 సంవత్సరాల వయసులోనే గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారిణిగా ఆవిర్భవించింది. ఫైనల్ లో పింక్ హెల్మెట్ ధరించి అనితర సాధ్యమైన ప్రదర్శన చేసింది. అయితే ఈ పోటీలో చైనా కు చెందిన 11 సంవత్సరాల జెంగ్ కూడా పాల్గొన్నది. ఆమె ఎలాంటి మెడల్ సాధించలేదు.

వినేశ్ పై అమర్హత

రెజ్లింగ్ విభాగంలో ఫైనల్స్ నిర్వహించ కంటే ముందు తూచిన బరువు కొలతలలో 100 గ్రాములు అధికంగా ఉందనే కారణంతో వినేశ్ ఫొగాట్ అనర్హతకు గురైంది. దీంతో ఆర్బిట్రేషన్ కు వినేశ్ అప్పీల్ చేసింది. ఏకంగా రెజ్లింగ్ కే వీడ్కోలు పలికింది.

51 ఏళ్లకు స్వర్ణం

ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో తుర్కియే ద్వయం సిల్వర్ మెడల్స్ వంటలు చేసుకుంది. కేవలం టీ షర్టు, సాధారణమైన క్లాసెస్ ధరించిన ఈ 51 ఏళ్ల షూటర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. సోషల్ మీడియాలో సంచలనంగా మారాడు. ఇటువంటి పరికరాలు ధరించకుండానే అతడు తన లక్ష్యాన్ని సాధించాడు. అందరూ అతడిని ప్రశంసలతో ముంచెత్తారు.

ఐదు గోల్డ్ మెడల్స్

ఈసారి ఒలింపిక్స్ లో క్యూబా మల్ల యోధుడు మిజైన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వ్యక్తిగత విభాగంలో ఏకంగా ఐదు గోల్డ్ మెడల్స్ సాధించిన అథ్లెట్ గా నిలిచాడు. ఇద్దరికీ 42 సంవత్సరాల వయసు ఉంటుంది. ఐదు స్వర్ణాలు సాధించిన నేపథ్యంలో రెజ్లింగ్ కు వీడ్కోలు పలికేందుకు సిద్ధంగా ఉన్నానని మిజైన్ ప్రకటించాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular