SRH vs PBKS : మోస్ట్ డేంజరస్ ఓపెనర్స్ హెడ్ (23*), అభిషేక్ శర్మ (46*) ఇప్పటికే తొలి వికెట్ కు 4.5 ఓవర్లలో ఈ స్టోరీ రాసే సమయం వరకు 74 రన్స్ పార్ట్ నర్ షిప్ బిల్డ్ చేసేశారు.. ముఖ్యంగా అభిషేక్ శర్మ తాను ఎదుర్కొన్న 15 బంతులలో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు కొట్టాడు. మరో ఓపెనర్ హెడ్ 16 బంతుల్లో ఐదు ఫోర్లు కొట్టి 23 పరుగులు చేశాడు. తొలి వికెట్ కు బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసిన హెడ్, అభిషేక్ శర్మ.. దూకుడుగా ఆడుతున్నారు. అంతేకాదు ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘనతను సాధించారు.. తద్వారా హైదరాబాద్ జట్టు ప్రతిష్టను మరోసారి బలంగా నిలబెట్టారు. అయితే ఈ ఘనతలు సొంతం చేసుకున్న జట్లలో హైదరాబాద్ పేరుమీద ఐదు రికార్డులు ఉండడం విశేషం.
ఐపీఎల్ చరిత్రలో..
ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 50 పరుగులు చేసిన జట్టుగా హైదరాబాద్ నిలిచింది. ప్రతి సీజన్లోనూ హైదరాబాద్ జట్టు వేగంగా పరుగులు చేస్తూ తన రికార్డులను తానే బద్దలు కొట్టుకుంటున్నది. అయితే ఈ జాబితాలో మరే జట్టు కూడా హైదరాబాద్ ముందు లేకపోవడం విశేషం. 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కేవలం 2.4 ఓవర్లలోనే హైదరాబాద్ జట్టు 50 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. ఇక 2024లో లక్నో జట్టుతో తలపడి హైదరాబాద్ జట్టు జస్ట్ 3.1 ఓవర్లలోనే ఫస్ట్ వికెట్ కు 50 రన్స్ చేసేసింది.. 2024లో చెన్నై జట్టుతో ఎదురైన పోటీలో హైదరాబాద్ జట్టు 3.3 ఓవర్లలోనే ఫస్ట్ వికెట్ కు 50 రన్స్ భాగస్వామ్యం నిర్మించింది. ఇక ప్రస్తుతం శనివారం జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ జట్టుపై హైదరాబాద్ జట్టు కేవలం 3.3 ఓవర్లలోనే ఒక వికెట్ కూడా కోల్పోకుండా 50 రన్స్ స్కోర్ చేసి పడేసింది. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో హైదరాబాద్ జట్టు ఫైట్ చేసింది. 2025 లో ఫస్ట్ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి కేవలం 3.4 ఓవర్లలోనే 50 రన్స్ ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ బిల్ట్ చేసేసింది.. హైదరాబాద్ జట్టు ఈ సీజన్లో రాజస్థాన్ జట్టుపై 286 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ తర్వాత ఆ స్థాయిలో ఆడలేకపోతోంది. వరుసగా నాలుగు మ్యాచ్లలో ఓటమిపాలైంది. లక్నో, కోల్ కతా, గుజరాత్, ఢిల్లీ జట్ల చేతిలో వరుసగా హైదరాబాద్ ఓటమిపాలైంది. అందువల్లే శనివారం పంజాబ్ జట్టుతో జరిగే మ్యాచ్ హైదరాబాద్ కు అత్యంత ముఖ్యంగా మారింది. ఎందుకంటే ఈ మ్యాచ్లో హైదరాబాద్ గెలిస్తేనే.. ప్లే ఆఫ్ వెళ్లడానికి అవకాశాలు సజీవంగా ఉంటాయి. లేకపోతే సంక్లిష్ట పరిస్థితులను హైదరాబాద్ జట్టు ఎదుర్కొక తప్పదు. అయితే ఈ మ్యాచ్ అత్యంత ముఖ్యమైనది కావడంతో.. హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు దూకుడుగా ఆడుతున్నారు.