Homeక్రీడలుక్రికెట్‌SRH Vs CSK: స్టేడియంలో నిమ్మకాయలతో SRH అభిమాని క్షుద్ర పూజలు.. చెన్నై అందుకే ఓడిపోయిందా

SRH Vs CSK: స్టేడియంలో నిమ్మకాయలతో SRH అభిమాని క్షుద్ర పూజలు.. చెన్నై అందుకే ఓడిపోయిందా

SRH Vs CSK: మంత్రాలకు చింతకాయలు రాలవు అంటారు. కానీ అది సాధ్యమవుతుందని ఇతడు నిరూపించాడు. అంతేకాదు తన అభిమాన జట్టును మంత్రాలతో గెలిపించాడు. ప్రొఫెషనల్ బ్లాక్ మ్యాజికర్ లాగా నిమ్మకాయలతో పూజలు చేశాడు. ఫలితంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం లో కలకలం నెలకొంది. అంతేకాదు అతడు చేసిన మంత్రాల ద్వారా చెన్నై జట్టు ఓడిపోయింది. ఇదిగో ఇలానే సాగుతోంది సోషల్ మీడియాలో చర్చ.

నేటి ఆధునిక కాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీని ఎంతమందైతే నమ్ముతున్నారో.. మంత్రాలను, తంత్రాలను కూడా అదే స్థాయిలో జనం నమ్ముతున్నారు. అందువల్లే మంత్రగాళ్ళకు నేటి కాలంలో కూడా విపరీతమైన డిమాండ్ ఉంది. కొన్ని సందర్భాలలో మంత్రగాళ్ల విధానాలను కొంత మంది ఫన్ కోసం పాటిస్తుంటారు. తద్వారా సోషల్ మీడియాలో తమకంటూ ఒక అటెన్షన్ క్రియేట్ చేసుకుంటారు. ఇతడు కూడా అలానే చేశాడు. ఇప్పుడు సోషల్ మీడియాను మొత్తం తన వైపు తిప్పుకున్నాడు.

శనివారం ఉప్పల్ మైదానంలో హైదరాబాద్, చెన్నై జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కు ఓ హైదరాబాద్ అభిమాని హాజరయ్యారు. ఆయన నిమ్మకాయలతో మంత్ర తంత్రాలు చేసినట్టు వీడియో తీశారు. అతడు నిమ్మకాయ చేతిలో పట్టుకొని మంత్రాలు చదివి.. ఒక్కసారిగా బుష్ అని అన్నాడు. దీంతో వెంటనే చెన్నై జట్టు వికెట్ కోల్పోయింది. చెన్నై జట్టు ఆటగాడు శివం దుబే క్లీన్ బౌల్డ్ కావడంతో.. ఆ మంత్రాలు చదివిన హైదరాబాద్ అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అతడు బుష్ అనగానే వికెట్ పడిపోవడం ఇక్కడ విశేషం.

” ఇతడు మంత్రాలు చేశాడు. తంత్రాలు ప్రయోగించాడు. నిమ్మకాయ చేతిలో పట్టుకొని ఒక్కసారిగా బుష్ అని అన్నాడు. వెంటనే శివం దుబే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో చెన్నై జట్టు ఓడిపోయింది. సొంత గడ్డ మీద హైదరాబాద్ విజయం సాధించిందని” నెటిజన్లు అంటున్నారు. అయితే దీనిని ఎడిట్ చేసిన వీడియో అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై చెన్నై జట్టు బీసీసీఐకి ఫిర్యాదు చేయాలని కొంతమంది సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.

ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి అభిమానులు ఏదో ఒక విధంగా ఇలాంటి ఫన్నీ పనులు చేస్తూనే ఉన్నారు. తద్వారా సోషల్ మీడియాలో తమకంటూ అటెన్షన్ క్రియేట్ చేసుకుంటున్నారు. కొందరు రాత్రికి రాత్రే సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. అందువల్లే సోషల్ మీడియాలో అటెన్షన్ పొందడానికి చిత్రచిత్రమైన పనులు చేస్తున్నారు. నేటి కాలంలో బ్లాక్ మ్యాజిక్ లేదు.. మంత్ర తంత్రాలు అంతకంటే లేవు. చదువు ఒకటే అన్ని సమస్యలకు పరిష్కారం. సాంకేతిక పరిజ్ఞానమే మనిషి జీవితానికి సోపానం. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version