
కరోనా వైరస్ కల్లోలం అడిగిన వారికల్లా సాయం చేసి గొప్ప మానవతావాదిగా.. రియల్ హీరోగా సోనూసూద్ దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాడు. సెకండ్ వేవ్ లోనూ సోనూసూద్ సాయం చేస్తూనే వచ్చాడు. ఆక్సిజన్ కొరతతో అల్లాడుతున్న ప్రజలకు వాటిని ఏర్పాటు చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు.
ఇప్పటికీ కూడా సోషల్ మీడియా ద్వారా అవసరంలో ఉన్న వాళ్ల వివరాలు తెలుసుకొని వాళ్లు సహాయం చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఆక్సిజన్ కొరత తీర్చడంలో సోనూసూద్ సాయం చేస్తున్నారు. స్వయంగా ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు.
ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలను గాను ఎన్నో పురస్కారాలు అందుకున్న సోనూసూద్ తాజాగా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వచ్చే ఏడాది రష్యాలో జరిగే స్పెషల్ వింటర్ ఒలింపిక్స్ కు సోనూసూద్ ను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని సోనూసూద్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
రష్యాలోని కజాన్ వేదికగా వచ్చే ఏడాది జనవరి 22 నుంచి స్పెసల్ వింటర్ ఒలింపిక్స్ జరుగనున్నాయి. ఈ వింటర్ ఒలింపిక్స్ కు హాజరయ్యే భారతదేశం అథ్లెట్ల బృందానికి సోనూ సూద్ నాయకత్వం వహించనున్నారు.
ఇక తనను బ్రాండ్ అంబాసిడర్ ఎంపిక చేయడం తనకు ఎంతో గర్వించే విషయం అని సోనూసూద్ ట్వీట్ చేశాడు. తన చాంపియన్స్ ఖచ్చితంగా దేశాన్ని గర్వించేలా చేస్తారు అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
https://twitter.com/SonuSood/status/1422105788080746497?s=20