Shreyas Iyer : ఐపీఎల్ లో మూడు విభిన్న జట్లకు నాయకత్వం వహించి టాప్ -2 లో నిలిపిన మొదటి నాయకుడిగా శ్రేయస్ అయ్యర్ రికార్డ్ సృష్టించాడు. గతంలో ఢిల్లీ జట్టుకు నాయకుడిగా ఉన్నప్పుడు అయ్యర్ ఆ జట్టును టాప్ -2 లో నిలిపాడు.. ఇక గత సీజన్లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టును టాప్ -2 లో నిలిపాడు.. ఇక కోల్ కతా నైట్ రైడర్స్ జట్టును విజేతగా నిలిపాడు. అయ్యర్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ.. జట్టును ఆనితర సాధ్యమైన మార్గంలో నడుపుతూ.. సిసలైన నాయకత్వానికి నిదర్శనంగా నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో గొప్ప గొప్ప ఆటగాళ్లకు కూడా సాధ్యం కానీ రికార్డును అయ్యర్ తన పేరు మీద సృష్టించుకున్నాడు. ముంబై జట్టును ఐదుసార్లు.. చెన్నై జట్టును ఐదుసార్లు విజేతలుగా నిలిపిన రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీ వల్ల కూడా కానీ ఘనతను శ్రేయస్ అయ్యర్ సొంతం చేసుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ను టాప్ -2, కోల్ కతా నైట్ రైడర్స్ టాప్ -2, పంజాబ్ కింగ్స్ టాప్ -2 లో నిలిచిన చరిత్ర అయ్యర్ తన పేరు మీద సృష్టించుకున్నాడు.
బలమైన ముంబై జట్టుపై..
ప్రస్తుత సీజన్లో టాప్ -2 లోకి వెళ్లాలంటే కచ్చితంగా గెలవలసిన పరిస్థితి పంజాబ్ జట్టుది. ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు అయిన తర్వాత పంజాబ్ జట్టు అనూహ్యంగా ఢిల్లీ చేతిలో ఓటమిపాలైంది.. దీంతో పంజాబ్ జట్టు టాప్ -2 లోకి వెళ్తుందన్న నమ్మకం ఎవరికీ లేకుండా పోయింది.. ఈ దశలో పట్టువదలకుండా పంజాబ్ జట్టు సారధి.. తిరుగులేని స్థాయిలో ఆట తీరు ప్రదర్శించాడు. ముఖ్యంగా ఆటగాళ్లలో స్ఫూర్తినింపాడు. జట్టు కూర్పు విషయంలోనూ తన మార్కు చూపించాడు.. తద్వారా బలమైన ముంబై జట్టును మట్టి కరిపించే విధంగా చేశాడు. వాస్తవానికి బౌలింగ్, బ్యాటింగ్ విభాగాలలో పంజాబ్ జట్టు కంటే ముంబైదే పై చేయి. కానీ అయ్యర్ దీనిని తిరగ రాశాడు. ముందుగా బౌలింగ్ చేసి.. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబై జట్టును 184 రన్స్ వరకే పరిమితం చేశాడు. ఆ తర్వాత ఈ టార్గెట్ ను అత్యంత ఈజీగా చేదించేలాగా చేశారు. ప్రభ్ సిమ్రాన్ సింగ్ త్వరగానే వెనక్కి వచ్చినప్పటికీ, ప్రియాన్ష్ ఆర్య, జోస్ ఇంగ్లిస్ వంటి వారితోనే ముంబై భరతం పట్టేలా చేశాడు. కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి.. బలమైన ముంబై జట్టు చేతిలో గెలిచేలా చేశాడు.. మొత్తంగా హార్దిక్ సేన పై ఏడు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేయించాడు.
Also Read : చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. ఐపీఎల్‌లో ఆ రికార్డు ఆయన సొంతం
ఐపీఎల్ లో మూడు విభిన్న జట్లకు నాయకత్వం వహించి.. టాప్ -2 లో ఉంచిన సారధిగా అయ్యర్ నిలిస్తే.. ఇందులో కోల్ కతా ను ఒకసారి విజేతగా నిలిపాడు. ఇక పంజాబ్ జట్టును ఈసారి ఛాంపియన్ గా అవతరించేలా చేస్తే సరికొత్త రికార్డు అయ్యర్ సొంతమవుతుంది. ఎందుకంటే క్రితం సిరీస్ లో అయ్యర్ ఆధ్వర్యంలో కోల్ కతా ఛాంపియన్ గా నిలిచింది.