Shoaib Akhtar: సింధు జలాల ఒప్పందాన్ని భారత్ వెనక్కి తీసుకుంది. అట్టారి – వాఘా సరిహద్దు మీదుగా వాణిజ్యాన్ని కూడా నిలిపివేసింది. ఇక ఇందులో భారత ప్రభుత్వం పాకిస్తాన్ దేశానికి చెందిన 16 యూట్యూబ్ ఛానల్స్ ను బ్లాక్ లిస్టులో పెట్టింది. . ఒకరకంగా చెప్పాలంటే నిషేధం విధించింది. ఈ జాబితాలో పాకిస్తాన్ జర్నలిస్టు అర్జూ కాజ్మీ, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ అక్తర్ కూడా ఉన్నారు. వీరందరి ఖాతాలు బ్లాక్ అయ్యాయి. పాకిస్తాన్ దేశంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కాబట్టి.. వీరందరికీ సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా ఆదాయం లభిస్తుంది. ఇందులో షోయబ్ అక్తర్ తరచుగా మన దేశంపై ఏదో ఒక రూపంలో వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాడు. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించినప్పుడు..
Also Read: పహల్గాంకు నటుడు.. ఇతడి గుండెధైర్యం, స్ఫూర్తికి అంతా సలాం!
అందులో పోటీపడేందుకు భారత్ దుబాయ్ కాకుండా పాకిస్తాన్ కు విచ్చేయాలని షోయబ్ అక్తర్ వివిధ మాధ్యమాల ద్వారా విజ్ఞప్తి చేశాడు. ఇక క్రికెట్ ద్వారా షోయబ్ అక్తర్ భారీగానే సంపాదించాడు. అతని ఆస్తి దాదాపు 190 కోట్ల భారత రూపాయిలుగా ఉంటుందని ఒక అంచనా. అమెరికా కరెన్సీ చూసుకుంటే 15 మిలియన్ డాలర్లు. 1997 లో షోయబ్ అక్తర్ క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. 2011 లో అతడు తన కెరీర్ కు ముగింపు పలికాడు..టెస్ట్, వన్డేలలో తనదైన ముద్ర వేశాడు.. ఈ రెండు ఫార్మాట్లు కలిపి 400 కు మించి వికెట్లను నేల కూల్చాడు.. ఏకంగా గంటకు 161.3 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరి.. నయా స్పీడ్ స్టర్ గా గుర్తింపు పొందాడు… క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన తర్వాత షోయబ్ అక్తర్ కొత్త దారిని ఎంచుకున్నాడు.. వ్యాఖ్యానం ద్వారా విభిన్నమైన అవతారాన్ని ఎత్తాడు… టెలివిజన్ కార్యక్రమాల ద్వారా ఇన్కమ్ సొంతం చేసుకోవడం ప్రారంభించాడు… వివిధ కంపెనీలకు ప్రచారం చేయడం ద్వారా షోయబ్ అక్తర్ భారీగానే ఆర్జించాడు.. యూట్యూబ్లో అతడు ఛానల్ కూడా బాగా ఫేమస్ అయ్యింది.. దీని ద్వారా అతడికి విపరీతమైన ఆదాయం వస్తుంది. స్థిరాస్తి, రెస్టారెంట్లలో కూడా షోయబ్ అక్తర్ భారీగా పెట్టుబడులు పెట్టాడు.. ఇక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి అతనికి ప్రతినెల 48,154 భారత రూపాయల పెన్షన్ వస్తుంది. పాకిస్తాన్ కరెన్సీ ప్రకారం చూసుకుంటే అది ఒక లక్ష యాభై నాలుగు వేలు.
యూట్యూబ్ ఛానల్లో
షోయబ్ అక్తర్ యూట్యూబ్ ఛానల్లో విపరీతమైన యాక్టివ్ గా ఉంటాడు. ఇతడి యూట్యూబ్ ఛానల్ ను 6.12 మిలియన్ యూజర్లు అనుసరిస్తున్నారు. దీని ద్వారా అతడికి ప్రతినెల 3,25,600 డాలర్ల సంపాదన లభిస్తుంది. ఇక అతడి వీడియోలు ఇప్పటివరకు 420 మిలియన్ కంటే ఎక్కువ న్యూస్ సొంతం చేసుకున్నాయి.. అయితే భారత్ నిషేధం విధించడంతో ఇతడి వీడియోలు ఇండియాలో కనిపించవు. అది ఒక రకంగా అతడి ఛానల్ కు తీవ్రమైన దెబ్బ. పాకిస్తాన్ లో ఇంటర్నెట్ వినియోగం అంతంత మాత్రమే. భారత్ లో దాదాపు స్మార్ట్ ఫోన్ ఉన్న వారంతా ఇంటర్నెట్ వాడుతారు. షోయబ్ అక్తర్ వీడియోలు చూస్తారు.. అయితే ఇప్పుడు ఆ అవకాశం లేకపోవడంతో అతడికి ఆ స్థాయిలో వ్యూయర్ షిప్ లభించకపోవచ్చు. యూట్యూబ్లో వ్యూయర్ షిప్ లేకపోతే ఆదాయం ఉండదు. ఆదాయం లేకపోతే షోయబ్ అక్తర్ కు ఇతర కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉండదు. మొత్తంగా చూస్తే భారత్ విధించిన బ్యాన్.. దాయాది దేశం ఆర్థిక మూలాలను దెబ్బకొడుతోంది. ఒక ఆ దేశం కేంద్రంగా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న వారికి శరా ఘాతంగా మారింది. ఇప్పటికైనా దాయాది దేశం వాస్తవానికి గ్రహిస్తే అందరికీ మంచిది.
Also Read: ముగిసిన పాకిస్థానీ గడువు.. దేశం వీడకుంటే జైలుకే..