SA vs IND : ఇండియా సౌతాఫ్రికా మధ్య జరిగిన రెండోవ టెస్ట్ మ్యాచ్ లో ఇండియన్ టీమ్ విజయం సాధించింది. ఇక అందులో భాగంగానే మొదటి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా టీం 55 పరుగులకు అలౌట్ అయింది. ఇక ఆ తర్వాత ఇండియన్ టీం బ్యాటింగ్ చేసి 153 పరుగులకు ఆల్ అవుట్ అయింది.
దాంతో సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించిన సౌతాఫ్రికా టీం కొద్ది వరకు బాగానే ఆడినప్పటికీ బుమ్రా దెబ్బకి 176 పరుగుల వద్ద ఆల్ అవుట్ అయింది. దాంతో సెకండ్ ఇన్నింగ్స్ లో ఇండియా విజయ తీరాలకు చేరాలంటే 79 పరుగులు చేయాల్సి వచ్చింది.ఇక అందులో భాగంగానే బరిలోకి దిగిన ఇండియన్ టీం మూడు వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది. అయితే ప్రపంచంలోనే అత్యంత తక్కువ రోజుల్లో ముగిసిన టెస్ట్ మ్యాచ్ గా ఈ మ్యాచ్ రికార్డును సృష్టించింది. కేవలం ఒకటిన్నర రోజుల్లోనే ఈ మ్యాచును ముగించి ఇండియా సౌతాఫ్రికా టీమ్ లు ఒక చరిత్రను క్రియేట్ చేశాయనే చెప్పాలి… ఈ మ్యాచ్ కేవలం 107 ఓవర్లలో ముగిసింది. ఇక దాంతో 92 సంవత్సరాల నాటి రికార్డు బ్రేక్ అయిందనే చెప్పాలి.
1932లో మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా సౌతాఫ్రికా టీముల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ లో 109 ఓవర్ల 3 బంతులకు అంటే 656 బంతుల్లోనే మ్యాచ్ ని ముగించారు. ఇక ఇప్పటివరకు ఆ రికార్డును ఎవరు బ్రేక్ చేయలేదు కానీ ఇప్పుడు ఇండియా సౌతాఫ్రికా టీమ్ లా మధ్య జరిగిన మ్యాచ్ లో కేవలం 107 ఓవర్లలో అంటే 642 బంతుల్లోనే ఈ మ్యాచ్ ని ముగించి రికార్డుని క్రియేట్ చేశారు…
ఇక ఈ మ్యాచ్ లో ఇండియన్ టీం ఘన విజయం సాధించడంతో ఈ టెస్ట్ సిరీస్ సమమైంది. ఇక రెండు టీమ్ లు చెరొక టెస్ట్ మ్యాచ్ ని గెలుచుకొని సిరీస్ ని సమం చేశాయి.ఇక అద్భుతమైన బౌలింగ్ ని కనబరిచిన మహమ్మద్ సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. రెండు టెస్ట్ మ్యాచ్ ల్లో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన ను కనబరిచిన జస్ప్రిత్ బుమ్రా కి, సౌతాఫ్రికా బౌలర్ అయిన ఎల్గార్ ఇద్దరు కూడా ప్లేయర్స్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచారు.