ODI World cup 2023 – Shreyas Iyer Six Video: 2023 వరల్డ్ కప్ లో భాగంగా శ్రీలంక ఇండియా జట్ల మధ్య ఒక భారీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 302 భారీ పరుగుల తేడాతో ఇండియా శ్రీలంకను చిత్తు చేసి భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇలాంటి క్రమంలో ఇండియన్ టీం లో ఇంతకుముందు పెద్దగా ఫామ్ లో లేనట్టుగా కనిపించిన శ్రేయస్ అయ్యర్ శ్రీలంక మీద మ్యాచ్ లో చెలరేగి ఆడాడు అందులో భాగంగానే ఆయన హాఫ్ సెంచరీ ని పూర్తి చేసుకున్నాడు.ఇక ఇలాంటి క్రమంలో అయ్యర్ కూడా మంచి ఫామ్ లోకి వచ్చి తనదైన రీతిలో ఒక పెద్ద నాక్ ఆడాడు దాంతో ఇండియన్ టీం భారీ పరుగులు చేసింది…
ఇంతకుముందు ఇదే వరల్డ్ కప్ లో 101 మీటర్ల సిక్స్ కొట్టిన శ్రేయస్ అయ్యర్ అదే అతిపెద్ద భారీ సిక్స్ గా నమోదు చేసుకున్నాడు. ఇక దాని తర్వాత ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ ప్లేయర్ అయిన మాక్స్ వెల్ ఆ సిక్స్ ను బ్రేక్ చేస్తూ 104 మీటర్ల పెద్ద సిక్స్ ని నమోదు చేశాడు. ఇక దాంతో అయ్యర్ పేరు మీద ఉన్న రికార్డ్ ని బ్రేక్ చేస్తూ మాక్స్ వెల్ మరో సరికొత్త రికార్డు ను క్రియేట్ చేశాడు. ఇక దాంతో శ్రీలంక మీద మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ తనదైన రీతిలో ఒక భారీ సిక్స్ కొట్టి మాక్స్ వెల్ పేరు మీద నమోదైన రికార్డ్ మళ్ళీ తన పేరు మీద నమోదు చేసుకున్నాడు… ప్రస్తుతం ఈయన కొట్టిన 106 మీటర్ల సిక్స్ అత్యంత పొడవైన సిక్స్ గా ఒక రికార్డ్ ని క్రియేట్ చేసింది.
ఇక దీంతో శ్రేయాస్ అయ్యర్ మంచి ఫామ్ లోకి వచ్చాడు.ఇక ఆ తర్వాత మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ తనదైన రీతిలో చిలరేగి ఆడతాడు అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఇక నెక్స్ట్ జరగబోయే సౌతాఫ్రికా మీద మ్యాచ్ లో టీంలో భారీ మార్పులు చేయబోయే సూచనలైతే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు బెంచ్ కే పరిమితమైన ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్లని టీంలోకి తీసుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇండియన్ టీం సెమీస్ కి క్వాలిఫై అయింది కాబట్టి ఇలాంటి టైం లో బెంచ్ కి పరిమితమైన ప్లేయర్లకు ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంది…
ఇక ఈ మ్యాచ్ లో అయ్యర్ సిక్స్ కొట్టినప్పుడు ఇక్కడ ఒక అరుదైన సంఘటన జరిగింది. అక్కడ టీమ్ ఇండియన్ టీమ్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ వాళ్ళ భార్య అయిన రితికతో సహా మరికొందరు ప్లేయర్ల భార్యలు కూర్చొని ఉన్నారు ఇక దాంతో అయ్యర్ సిక్స్ కొట్టగా వాళ్ల మీద పడుతుందేమో అని ఉద్దేశ్యం తో రోహిత్ శర్మ భార్య రితిక అలాగే చాహల్ భార్య అయిన దన శ్రీ ఇద్దరు కలిసి లేచి అక్కడ నుంచి పరిగెత్తారు కానీ ఆ బాల్ అక్కడి నుంచి వెళ్లి వాళ్ళు కూర్చున్న స్టాండ్ కి తగిలి కింద పడిపోయింది…
ఇక ఇది ఇలా ఉంటే ఇండియా ఈ మ్యాచ్ తో వరుసగా 7 వ విజయాన్ని దక్కించుకుంది…ఇక ఇదే ఊపులో ఇండియన్ టీమ్ ముందుకు వెళ్తే ఈసారి వరల్డ్ కప్పు మనదే …
View this post on Instagram