Rohit Sharma Afghanistan match: ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరుగుతున్న చివరి వన్డేలో టీమిండియా మరోసారి దుమ్ము రేపుతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్లు గెలిచి.. సిరీస్ సొంతం చేసుకున్న టీమ్ ఇండియా.. మరో మ్యాచ్ లో కూడా అదే సత్తా చూపిస్తోంది.
చెన్నై వేదికగా చివరి వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆఫ్గనిస్తాన్ జట్టుకు టీమిండియా బౌలర్ ప్రసిద్ కృష్ణ చుక్కలు చూపించాడు. ఓపెనర్లు గురుబాజ్ (5), ఇబ్రహీం జర్దాన్ (11), రహమత్ షా (5), రసూలి (1) వికెట్లను పడగొట్టాడు. వీరిలో గురుబాజ్, జర్దాన్, రహమత్ షా ఒకే తీరుగా అవుట్ అయ్యారు. వీరి ముగ్గురు క్యాచ్లను స్లిప్ లో ఉన్న రోహిత్ శర్మ పట్టుకోవడం విశేషం.
ఒకే తీరైన బంతులు వేసి ముగ్గురు ఆఫ్ఘనిస్తాన్ టాప్ బ్యాటర్లను ప్రసిద్ కృష్ణ ఔట్ చేయడం విశేషం. ఒక దశలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 36 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఆ జట్టును సాహితి (68*), ఓమర్ జాయ్ (50) ఆదుకున్నారు. ఐదో వికెట్ కు వీరు ఏకంగా 114 బంతుల్లో 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తద్వారా ఆఫ్ఘనిస్తాన్ జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. నాలుగు వికెట్లను త్వరగా తీసిన టీమ్ ఇండియా బౌలర్లు.. ఆ తర్వాత లయ కోల్పోయారు. దీంతో ఆఫ్గనిస్తాన్ బ్యాటర్లు దూకుడుగా బ్యాటింగ్ చేశారు.
ఈ మ్యాచ్లో ప్రసిద్ కృష్ణ మొత్తంగా ఆరు ఓవర్లు బౌలింగ్ వేశాడు. ఇందులో రెండు మెయిడ్ ఇన్ ఓవర్లు. కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు.. అందులో రెండు పరుగులు వైడ్, నో బాల్ రూపంలో రావడం విశేషం.. అతడి బౌలింగ్ లో ఆడేందుకు ఆఫ్గనిస్తాన్ బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. స్లిప్ లో క్యాచ్ లు పట్టిన రోహిత్ శర్మ.. ఒకప్పటిలాగా కనిపించాడు. ఇటీవల కాలంలో అతడు గాయాల బారిన పడ్డాడు. జట్టుకు దూరంగా ఉన్నాడు. చివరికి పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని సాధించి అదరగొట్టాడు. స్లిప్ లో గతంలో మాదిరిగా ఫీల్డింగ్ చేస్తూ సత్తా చూపిస్తున్నాడు. 2027 వన్డే వరల్డ్ కప్ లో జట్టులో చోటు ఉంటుందో, ఉండదోననే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. అతడు మైదానంలో పాదరసం లాగా కదలాడు. ముఖ్యంగా మూడు క్యాచ్లు పట్టి అదరగొట్టాడు.
Identical setups, identical results
Prasidh Krishna Rohit Sharma
Updates ▶️ https://t.co/kHgF4bqTg3#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/Bf2YPIA59l
— BCCI (@BCCI) June 20, 2026
