Rohit Sharma : ఈ గెలుపు నేపథ్యంలో గ్రూపు ఏ లో పాయింట్లు పరంగా భారత్ రెండో స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్, భారత్ పాయింట్లు సమంగానే ఉన్నప్పటికీ.. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో 60 పరుగుల తేడాతో విజయం సాధించిన నేపథ్యంలో న్యూజిలాండ్ నెట్ రన్ రేట్ +1.200 ఉండడంతో గ్రూపు ఏ లో మొదటి స్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్ పై విజయం సాధించిన నేపథ్యంలో టీమిండియాలో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ఇక ఇదే క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేయలేకపోయినప్పటికీ.. 41 పరుగులతో ఆకట్టుకున్నాడు. ప్రారంభంలో కాస్త తడబడినప్పటికీ.. ఆ తర్వాత తన జోరు చూపించాడు. ఏడు ఫోర్లు కొట్టి తన సత్తా ఏమిటో ప్రదర్శించాడు. రోహిత్ ఉన్నంతసేపు మైదానంలో అభిమానులు తెగ గోల చేశారు. రోహిత్ ప్ల కార్డులతో మైదానంలో తెగ సందడి చేశారు.
చరిత్ర సృష్టించిన రోహిత్
బంగ్లాదేశ్ గెలుపు సాధించడం ద్వారా టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అరుదైన ఘనతను తన సొంతం చేసుకున్నాడు. కెప్టెన్ గా 70% విజయాల రేటుతో.. 100 విక్టరీలు సాధించాడు. ఈ దశలో ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రికీ పాంటింగ్ (Ricky ponting) సరసన చేరాడు. రోహిత్ అని ఫార్మాట్లో 137 మ్యాచులకు నాయకత్వం వహించాడు. అయితే రోహిత్ ఆధ్వర్యంలో కేవలం 33 మ్యాచ్లలో మాత్రమే టీమిండియా ఓటమి పాలైంది. మూడు మ్యాచ్లు డ్రా అయ్యాయి. ఒకటి రద్దయింది. 30 ఏళ్లు దాటిన తర్వాత కెప్టెన్సీలో 100% విజయాలు సాధించిన ఆటగాడు కేవలం రోహిత్ శర్మ మాత్రమే. బహుశా ఇప్పట్లో ఏ ఆటగాడు కూడా రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేయలేకపోవచ్చు. సమకాలీన క్రికెట్లో గాయాలు ప్లేయర్లను ఇబ్బంది పెడుతున్నాయి. అయితే రోహిత్ తన సామర్థ్యాన్ని కాపాడుకుంటూనే.. గాయాలకు దూరంగా ఉంటాడు. అందువల్లే అతడు 30 సంవత్సరాల దాటినప్పటికీ టీమిండియా కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. విజయాలు సాధించేలా తన జట్టును ముందుకు తీసుకెళుతున్నాడు. ఇటీవల న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో భారత్ గనుక సిరీస్ లు దక్కించుకుంటే రోహిత్ రికీ పాంటింగ్ రికార్డును బ్రేక్ చేసేవాడే. ఒకవేళ కనుక టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలో తదుపరి జరిగే మ్యాచ్లో విజయం సాధిస్తే పాంటింగ్ రికార్డును రోహిత్ శర్మ కచ్చితంగా బద్దలు కొడతాడు. అంతేకాదు 30 సంవత్సరాలకు మించిన వయసులో అరుదైన విజయాలు సొంతం చేసుకున్న ఆటగాడిగా టీమిండియా రోహిత్ శర్మ క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డులను నెలకొల్పుతాడు.