Homeక్రీడలుక్రికెట్‌Transgender umpire Rithika Sree: అతడుగా పుట్టాడు.. ఆమెగా మారాడు.. చివరికి ట్రాన్స్‌జెండర్ క్రికెట్ అంపైర్...

Transgender umpire Rithika Sree: అతడుగా పుట్టాడు.. ఆమెగా మారాడు.. చివరికి ట్రాన్స్‌జెండర్ క్రికెట్ అంపైర్ గా..

Transgender umpire Rithika Sree: మన సమాజంలో ఇప్పటికీ ఆడవాళ్ళ మీద ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తే చాలు చంపేసే దారుణాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అటువంటిది ఒక వ్యక్తి జీవితం తన శరీరంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల తలకిందులుగా మారింది. అతడుగా పుట్టినప్పటికీ.. ఆమెగా మారాల్సి వచ్చింది. చివరికి అంపైర్ గా స్థిరపడాల్సి వచ్చింది. కానీ ఈ ప్రస్థానంలో ఎన్నో ఆంక్షలు.. మరెన్నో ఇబ్బందులు..

ఆమె పేరు రితిక శ్రీ. పుట్టగానే ఆమె ఆడపిల్ల కాదు. అతడి అసలు పేరు ముత్తు రాజా.. జన్మతహ: పురుషుడు. ముత్తు రాజా మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లమా చదివాడు. అప్పట్లో అతడు మొహాలీ ప్రాంతంలో ఒక కాల్ సెంటర్లో పని చేసేవాడు.. అప్పుడప్పుడు ఖాళీ సమయం దొరికితే ఐపీఎల్ మ్యాచులు చూసేవాడు. కరోనా సమయంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో క్రికెట్ అంపైరింగ్ చేయాలని అతనిలో కోరిక కలిగింది. ఆ దిశగా అనేక ప్రయత్నాలు చేశాడు. చివరికి సమాచారాన్ని సేకరించాడు. ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా అంపైర్ల కమిటీ చైర్మన్ జయ రామన్ ను కలిశాడు. దీంతో అతని కెరియర్ ఒక్కసారిగా టర్న్ తీసుకుంది.

ముత్తరాజకు అనేకమంది డిస్టిక్ ప్యానల్ లో ఉన్న అంపైర్లు పాటలు చెప్పడం మొదలుపెట్టారు. ముత్తు రాజా చూసేందుకు పురుషుడి లాగా కనిపిస్తున్నప్పటికీ.. అతడు స్త్రీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. అందువల్లే ఆ విషయాలను బయట పెట్టడానికి ముత్తరాజ ఇబ్బంది పడేవాడు. అయితే తన ఇబ్బందిని జయరామన్ కు చెప్పాడు ముత్తు రాజా. దీంతో వారు అతని బాధను అర్థం చేసుకొని.. ఒప్పుకున్నారు. ఆర్థికంగా స్థిరపడిన తర్వాత ముత్తు రాజా కాస్త రితిక శ్రీగా మారిపోయింది. చికిత్స చేయించుకొని పూర్తి స్త్రీగా మారిపోయింది. ఆ ఏడాది నుంచి రితిక శ్రీ మైదానంలోకి అడుగు పెట్టింది. తమిళనాడు రాష్ట్రంలోని క్రికెట్ సంఘం స్టేట్ అంపైర్ ప్యానెల్ కు ఆహ్వానం పలికే దరఖాస్తులలో థర్డ్ జండర్ కాలం చేర్చడం తానుపడిన కష్టానికి గుర్తింపు అని రితిక శ్రీ చెబుతోంది.

రితిక శ్రీ మనదేశంలోనే తొలి ట్రాన్స్ జెండర్ అంపైర్. ఈ మధ్య తమిళనాడులోని సేలం జిల్లా. 2021 నుంచి సేలం, కోయంబత్తూరు సర్క్యూట్ ప్రాంతంలో అంపైరింగ్ చేస్తోంది. రితిక శ్రీ ప్రస్తుతం కోయంబత్తూర్ జిల్లాలోని క్రికెట్ సంగం లీగ్ లో మ్యాచ్ అధికారిగా కూడా పనిచేస్తోంది.. “నా శరీరంలో అనేక మార్పులు జరిగేవి. ఏం జరుగుతుందో అర్థం కాకపోయేది. ఎవరికి చెప్పాలో కూడా తెలిసేది కాదు. ఎందుకిలా అవుతోందా కూడా అర్థమయ్యేది కాదు.. జయరామన్ కు నా బాధ చెప్పగానే అర్థం చేసుకున్నారు. చివరికి నన్ను ఇలా మార్చారని” రితిక శ్రీ చెబుతోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version