Rishabh Pant: 2018లో టీమిండియాకు సెలక్ట్ అయిన రిషభ్ పంత్ అప్పటి వరకు ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించాడు. జాతీయ జట్టులోకి వచ్చిన తర్వాత రంజీలు ఆడలేదు. తాజాగా రంజీ జట్టులో ఆడేందుకు అంగీకరించాడు. అయితే ఢిల్లీ పగ్గాలు అతడికే ఇవ్వాలని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ భావించింది. అయితే పంత్ కెప్టెన్సీని వద్దని నిరాకరించాడు. ఇండియా వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్‌గా పంత్ దేశానికి ఒకసారి నాయకత్వం వహించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే గురుషరన్‌షింగ్ నేతృత్వంలోని ఢిలీ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ బాడోని కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఇదిలా ఉంటే పాయింట్ల పట్టికలో 19 పాయింట్లతో ఎలైట్ గ్రూప్ డి రంజీ టేబుల్‌లో ఢిల్లీ రెండోస్థానంలో ఉంది.
ఐపీఎల్‌లో…
మార్చిలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభమైనప్పుడు పంత్, బాడోని మధ్య రోల్ రివర్సల్ ఉంటుంది. పంత్ లక్నో సూపర్ జెయింట్స్‌కు నాయకత్వం వహిస్తాడు, ఇందులో బాడోని జూనియర్ ప్లేయర్, అయినప్పటికీ నిలుపుకున్నది. రికార్డ్ కోసం, లక్నో ఫ్రాంచైజ్ ఇంకా వారి కెప్టెన్‌ను ప్రకటించలేదు.
కోహ్లి, పంత్లపై విమర్శలు
ఇదిలా ఉంటే రంజీ ట్రోఫీ తాజా సీజన్ కోసం డీడీసీఏ గతంలో 41 మందితో కూడిన ప్రాబబుల్స్ జట్టును ప్రకటించింది. ఇందులో టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, హర్షిత్ రాణా పేర్లు ఉన్నాయి. అయితే జాతీయ జట్టు విధుల దృష్ట్యా పంత్ ఢిల్లీ తరఫున ఆడలేకపోయాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్–గవాస్కర ట్రోఫీలో పంత్, కోహ్లి విఫలమయ్యారు. ఢిల్లీ బ్యాట్స్ మెన్‌ల షాట్ సెలక్షన్, వికెట్ పారేసుకున్న విధానం చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో కోహ్లి, పంత్ రంజీ బరిలో దిగి తిరిగి మునుపటి ఫాం అందుకోవాలని మాజీ క్రికెటర్లు సూచించారు. ఈ క్రమంలోనే రంజీ సెకండ్ లెగ్ మ్యాచ్‌లకు పంత్ అందుబాటులోకి వచ్చాడు. కోహ్లి మాత్రం తన నిర్ణయం ప్రకటించలేదు.
రంజీ ట్రోఫీ సెకండ్ లెగ్ ఢిల్లీ ప్రాబబుల్స్ జట్టు
విరాహ్ కోహ్లి(సమాచారం లేదు), రిషబ్ పంత్, హర్షిత్‌రాణా(అందుబాటులో లేడు), ఆయుష్ బదోనీ, సనత్ సంగ్వాన్, గగన్ వాట్స్, యశ్ ధూల్, అనుజ్ రావత్(వికెట్ కీపర్), జాంతీ సిద్ధూ, సిద్ధాంత్‌శర్మ, హిమ్మత్‌సింగ్, నవదీప్ సైనీ, ప్రణవ్ రాజ్వంశీ(వికెట్ కీపర్), సుమిత్ మాథుర్, మనీ గ్రేవాల్, శివమ్‌శర్మ, మయాంక్ గుస్సేన్, వైభవ్ కండ్పాల్, హిమాన్షు చౌహాన్, హర్ష్ త్యాగి, శివాంక్ వశిష్ట్, ప్రిన్స్ యాదవ్, ఆయుష్ సింగ్ అఖిల్ చౌదరి, హృతిక్ షోకీన్, లక్షయ్ తరేజా(వికెట్ కీపర్), ఆయుష్ దోసేజా, అర్పిత్ రాణా, వికాస్ సోలంకి, సమర్థ్ సేథ్, రౌసక్ వాఘేలా, అనిరు«ద్ చౌదరి, రాహుల్ గహ్లోత్, భగవాన్‌సింగ్, మయాంక్ రావత్, తేజస్వి దహియా(వికెట్ కీపర్), పార్టీక్, రాహుల్ డాగర్, ఆర్యన్ రాణా, సలీల్ మల్హోత్రా, జితేష్ సింగ్.