Rishabh Pant: అదృష్టం బాగా లేకపోతే తాడే పామే కరుస్తుంది అంటారు. పాపం ఈ సామెత ఐపీఎల్లో లక్నో జట్టు సారధి రిషబ్ పంత్ కు అచ్చు గుద్దినట్టు సరిపోతుంది.. ఏడాదిగా అతడు టి20కి దూరమయ్యాడు.. గత ఏడాది అంత గొప్పగా ఆడలేదు. వరుసగా సున్నాలు చుట్టడం.. లేదా సింగిల్ డిజిట్ స్కోర్ కు మాత్రమే అవుట్ కావడంతో.. అతడి స్థానం మూడు నుంచి ఆరుకు పడిపోయింది. ఇదే క్రమంలో లక్నో జట్టు యాజమాన్యం నుంచి అతడికి ఒత్తిడి ఎదురైంది. దశలో కొద్దిరోజులుగా అతడు మైదానంలో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈసారి ఎలాగైనా మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తున్నాడు.
తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచినట్టుగా.. రిషబ్ పంత్ పరిస్థితి మారిపోయింది. బుధవారం లక్నో లో జరుగుతున్న మ్యాచ్లో.. తొలుత పంత్ తన శైలికి భిన్నంగా బ్యాటింగ్ చేశాడు. చెత్త బంతులను సావధానంగా శిక్షించిన అతడు.. పదునైన బంతులకు రెస్పెక్ట్ ఇచ్చాడు. దీంతో పంత్ ఆట తీరు చూస్తున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఇదేంటి పంత్ ఇలా మారిపోయాడని విస్మయం వ్యక్తం చేశారు.. కుదురుకుంటున్నాడు అనుకుంటున్న క్రమంలోనే రన్ ఔట్ రూపంలో అతడు పెవిలియన్ చేరుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి ఇందులో అతడి తప్పు ఏమీ లేదు. కొన్నిసార్లు విధి రాసిన రాత వల్ల ఆ ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుంది.
లక్నో ఇన్నింగ్స్ సమయంలో ముఖేష్ బౌలింగ్లో మార్ష్ గట్టిగా కొట్టాడు. బంతి నేరుగా ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లినట్టు కనిపించింది. అయితే ముఖేష్ దానిని అందుకు లేకపోయాడు. అతడి చేతి వేళ్ళు తాకి బంతి నేరుగా వికెట్లను పడగొట్టింది. అయితే నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న రిషబ్ పరుగు తీయడానికి ముందుకు వచ్చాడు. అప్పటికే బంతి వికెట్లను తాకడంతో.. రిషబ్ నిరాశతో మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు.
ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ చాలా సౌకర్యవంతంగా బ్యాటింగ్ చేశాడు. తాను ఎదుర్కొన్న బంతులను ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆడగలిగాడు. ఇందులో ఒక బౌండరీ కూడా ఉంది. అతడు దూకుడు తనంతో కాకుండా.. టెక్నికల్ గా ఆడతాడని అందరూ అనుకున్నారు. కానీ.. అతడు దురదృష్టవశాత్తు ఇలా అవుట్ కావడం లక్నో అభిమానులకు ఏమాత్రం రుచించలేదు. అతడు అవుట్ కావడంతో లక్నో జట్టు డిఫెన్స్ లో పడింది. ఇదే క్రమంలో ఢిల్లీ బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేయడంతో లక్నో ఆటగాళ్లు పెవిలియన్ వెళ్లడానికి క్యూ కట్టారు.
