Retired Out Vs Retired Hurt: చివరి ఓవర్ లో ముంబై జట్టు విజయానికి 22 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో లక్నో జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ అవేష్ ఖాన్ కు బౌలింగ్ ఇచ్చాడు. దీంతో అతడు కేవలం పది పరుగులు మాత్రమే ఇవ్వడంతో.. లక్నో జట్టు 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. లక్నో జట్టు పై విజయం సాధించడానికి ముంబై జట్టు అనేక ప్రయోగాలు చేసింది. తిలక్ వర్మ అనే ఆటగాడిని రిటైర్డ్ హర్ట్ గా వెనక్కి పంపించింది. అతడి స్థానంలో వచ్చిన శాంట్నర్ అంత గొప్పగా ఆడలేక పోయాడు. రెండు బంతులు ఎదుర్కొన్న అతడు.. రెండు పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. ఒక రకంగా ముంబై ఇండియన్స్ జట్టు తీసుకున్న నిర్ణయం విఫలమైంది. ముంబై జట్టు కూడిన తర్వాత మీడియాలో, సోషల్ మీడియాలో రిటైర్డ్ హర్ట్ ( Retired Hurt) అనే పదం విస్తృతంగా వాడుకలోకి వచ్చింది. ఇంతకీ రిటైర్డ్ హర్ట్, రిటైర్డ్ ఔట్ అంటే ఈ కథనంలో తెలుసుకుందాం.
Also Read: అతని వల్లే రిషబ్ పంత్ సరిగా ఆడలేక పోతున్నాడా..
రిటైర్డ్ ఔట్ అంటే ఏంటంటే
క్రికెట్ మ్యాచ్ లో ఒక బ్యాటర్ తనకు తానుగా లేదా కెప్టెన్ ఆదేశాల మేరకు అవుట్ కాకుండానే మైదానాన్ని వదిలి వెళ్ళిపోతే.. దానిని రిటైర్డ్ ఔట్ అంటారు. ఈ స్థితిలో ఎంపైర్ సదరు ఆటగాడిని అవుట్ అని ప్రకటించడు. కానీ ఆటగాడు డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్ళిపోతాడు. ఇలాంటప్పుడు ఆ బ్యాటర్ మళ్లీ బ్యాటింగ్ చేసే అవకాశం ఉండదు. ఇక ఆ బ్యాటర్ చేసిన పరుగుల పక్కన అవుట్ అని రాస్తారు. జట్టు వ్యూహంలో భాగంగా ఒక్కసారి ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు. ఇది గాయం లేదా అత్యవసర పరిస్థితి వల్ల ఆటగాడు మైదానాన్ని విడిచిపెట్టడానికి తీసుకునే నిర్ణయం కాదు.
రిటైర్డ్ హర్ట్ అంటే
క్రికెట్ మ్యాచ్ లో భాగంగా ఒక ఆటగాడు గాయం వల్ల లేదా అనారోగ్యం వల్ల మైదానాన్ని వదిలి వెళ్ళిపోతే దానిని రిటైర్డ్ హార్ట్ అని పిలుస్తారు. ఈ స్థితిలో ఆటగాడు తన సమస్యను అంపైర్ కు చెప్పాల్సి ఉంటుంది. అతని ఆమోదం తీసుకున్న తర్వాత డ్రెస్సింగ్ రూమ్ వెళ్లాల్సి ఉంటుంది. రిటైర్డ్ హర్ట్ తర్వాత సదరు ఆటగాడు మళ్ళీ బ్యాటింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆ జట్టు వికెట్ కోల్పోయినప్పుడు లేదా మరొక ఆటగాడు రిటైర్డ్ అయినప్పుడు మాత్రమే అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది.. ఒకవేళ ఆటగాడు గాయపడితే చికిత్స పొందిన అనంతరం.. మరొక ఆటగాడు అవుటయిన తర్వాత బ్యాటింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది.. అరుదైన సందర్భాల్లో మాత్రమే జట్లు ఇలాంటి నిర్ణయాలను తీసుకుంటాయి.. ఇక లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో ముంబై ఆటగాడు తిలక్ వర్మ రిటైర్డ్ హర్ట్ గా డ్రెస్సింగ్ రూమ్ చేరుకున్నాడు. ముంబై ఇండియన్స్ సమయంలో.. పరుగులు ఎక్కువ సాధించాల్సిన సందర్భంలో తిలక్ వర్మ వేగంగా బ్యాటింగ్ చేయలేకపోయాడు. 23 బంతుల్లో 25 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అతడి ఇన్నింగ్స్ లో రెండు బౌండరీలు మాత్రమే ఉన్నాయి. అయితే అతడు నెమ్మదిగా బ్యాటింగ్ చేయడంతో ముంబై జట్టు 19 ఓవర్లో రిటైర్డ్ ఔట్ చేసింది. తిలక్ వర్మ స్థానంలో మిచెల్ శాంట్నర్ బ్యాటింగ్ కు వచ్చాడు. ఇన్ని చేసినప్పటికీ ముంబై జట్టు ఆ మ్యాచ్ గెలవలేకపోయింది.