RCB Vs DC IPL 2025: అవకాశం లేని చోట గొప్పవాళ్ళం అనకూడదు.. మరీ ముఖ్యంగా బలం ఉన్న వ్యక్తి ఎదుట.. గొప్పలకు పోయి మన బలాన్ని చూపించొద్దు. ఆ తర్వాత అది మనల్ని దెబ్బ కొడుతుంది. ఈ అనుభవం ఇప్పుడు విరాట్ కోహ్లీ(Virat Kohli)కి ఎదురైంది.
Also Read: సొంత మైదానంలో..RCB చెత్త రికార్డు
విరాట్ కోహ్లీ సమర్థవంతమైన ఆటగాడు. బలంగా బ్యాటింగ్ చేస్తాడు. మైదానంలో పరుగుల వరద పారిస్తాడు. తనను గెలికితే.. ఎదుటి ఆటగాళ్లకు దిమ్మతిరిగే సమాధానం చెబుతాడు. అయితే అలాంటి విరాట్ కోహ్లీ ఎదుటి ప్లేయర్లను గెలికితే.. వారు కూడా తనకు తగ్గట్టుగానే సమాధానం చెప్తారని ఊహించలేకపోయాడు. గురువారం ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీకి ఇటువంటి అనుభవమే ఎదురయింది. దీంతో విరాట్ కోహ్లీని గేలి చేస్తూ సోషల్ మీడియాలో అభిమానులు పోస్టులు పెడుతున్నారు. అనవసరంగా గెలుక్కోవడం ఎందుకు.. ఆ తర్వాత బాధపడటం ఎందుకని హితవు పలుకుతున్నారు.
ఇంతకీ ఏం జరిగింది అంటే
బెంగళూరు మైదానంలో గురువారం ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టు ఆరు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకుంది. ఢిల్లీ జట్టు విజయంలో కేఎల్ రాహుల్ ముఖ్యపాత్ర పోషించాడు. సహచర ఆటగాళ్లు వరుసగా విఫలమవుతున్నచోట అతడు గట్టిగా నిలబడ్డాడు. ఏకంగా 93 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.. స్టబ్స్ సహకారం తీసుకుంటూ బెంగళూరు బౌలర్ల బౌలింగ్ ను వారి సొంత మైదానంలోనే ఊచ కోత కోశాడు. ఏమాత్రం భయపడకుండా.. వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. బెంగళూరు జట్టు పై గెలిచిన తర్వాత కేఎల్ రాహుల్ లో ఉగ్రం తారస్థాయికి చేరింది. హెల్మెట్ తీసి.. బ్యాట్ పైకి లేపి.. మైదానంలో గిరి గీసి.. అందులో బ్యాట్ తో ఒక నాక్ ఇచ్చాడు. ఇది నా అడ్డా అని.. వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్ అనే డైలాగ్ లాగా.. తన మేనరిజాన్ని ప్రదర్శించాడు.
విరాట్ కోహ్లీ వల్లే
కేఎల్ రాహుల్ మైదానంలో అలా స్పందించడానికి ప్రధాన కారణం విరాట్ కోహ్లీ అని తెలుస్తోంది. సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియో పై వ్యాఖ్యలకు బలం చేకూర్చుతోంది. ఢిల్లీ ఆటగాడు అక్షర్ పటేల్ అవుట్ కాగానే విరాట్ కోహ్లీ ఒక్కసారిగా పట్టరాని ఉత్సాహంతో పిడికిలి బిగించాడు. కేఎల్ రాహుల్ ముందు బిగించిన పిడికిలితో నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఇది కేఎల్ రాహుల్ లో పట్టుదలను పెంచింది. ఇంకేముంది కేఎల్ రాహుల్ ఒక్కసారిగా జూలు విధిల్చిన సింహం లాగా ఎదురుదాడికి దిగాడు. రజత్ పాటిదర్ ఎంతమంది బౌలర్లను ప్రయోగించినా ఏమాత్రం భయపడకుండా దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ఫోర్ లను, సిక్సర్ లను ఇష్టానుసారంగా కొట్టాడు. ఫలితంగా ఢిల్లీ జట్టు రెండు ఓవర్లు మిగిలి ఉండగానే విజయం సాధించింది. అంతేకాదు కేఎల్ రాహుల్ బ్యాటింగ్ స్టైల్ కు బెంగళూరు సిటీ ఫిదా అయింది. చివరికి బెంగళూరు అభిమానులు కూడా కేఎల్ రాహుల్ ను సోషల్ మీడియాలో అభినందించడం మొదలుపెట్టారు. బెంగళూరులో జట్టు ఓడిపోయినప్పటికీ.. అసలు సిసలైన టి20 క్రికెట్ ఆనందాన్ని ఆస్వాదించామని బెంగళూరు అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు..
Kohli is seen celebrating the wicket, glancing at KL Rahul.
After the win Rahul stared at Kohli and said “This Is My Home Ground”
Look at Kohli’s Reaction pic.twitter.com/uJmO74Jck5
— Radha (@Radha4565) April 11, 2025