RCB Victory Belief : ఆయన చేసిన వ్యాఖ్యలకు తగ్గట్టుగానే ఈసారి కన్నడ జట్టు ఆడింది. కొన్ని సందర్భాలలో మినహా.. మిగతా అన్నిసార్లు విజయాన్ని సాధించింది. ముఖ్యంగా తమిళ జట్టుపై తొలిసారి సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. పాండ్యా సేన పై పై చేయి సాధించింది. అయ్యర్ సేన పై రెండు సందర్భాల్లోనూ ఘనవిజయం అందుకుంది. మొత్తంగా పాటి దార్ చెప్పినట్టుగానే కన్నడ జట్టు అదరగొట్టింది. ఉత్కంఠ గా సాగిన మ్యాచ్ లో ఒత్తిడికి గురికాకుండా.. తన వంతు స్ఫూర్తిదాయకమైన ఆట తీరు ప్రదర్శించింది. గతంలో మూడు సందర్భాల్లో కన్నడ జట్టు ఐపిఎల్ చివరి అంచె పోటీలకు వెళ్ళింది. ఆ సమయంలో తీవ్రమైన ఒత్తిడికి గురైంది. చివరికి విజయం సాధించలేక చతికిల పడింది. అయితే ఈసారి అలాంటి తప్పుకు ఆస్కారం ఇవ్వలేదు కన్నడ జట్టు. పైగా ప్రారంభించి చివరి వరకు పక్కా ప్రొఫెషనలిజం ప్రదర్శించింది. బౌలింగ్లో అదరగొట్టింది. బ్యాటింగ్లో సత్తా చూపించింది.ఫీల్డింగ్ లో బెంబేలెత్తించింది.. కొన్ని సందర్భాల్లో వెనక్కి వెళ్ళినట్టు కనిపించినప్పటికీ.. అదిరిపోయే రేంజ్ లో ఆట తీరు ప్రదర్శించి.. అంతకుమించి అన్నట్టుగా సత్తా చూపించింది.
Also Read : చూడు విరాట్.. నువ్వు వాటర్ బాయ్ అని విమర్శించిన ఆటగాడి డెడికేషన్ ఎలా ఉందో; వైరల్ వీడియో
కన్నడ జట్టు ట్రోఫీ గెలుస్తుందని మొదటినుంచి అభిమానులకు నమ్మకం ఉండేది. ఇప్పుడు మాత్రమే కాదు ఐపీఎల్ మొదలైన నాటి నుంచి వారికి ఇదే నమ్మకం ఉంది. కాకపోతే ఆ నమ్మకం 2024 వరకు కూడా వాస్తవ రూపాన్ని దాల్చలేకపోయింది. అయితే ఇన్నాళ్లకు కన్నడ జట్టు విజేతగా నిలిచింది.. అయితే ఈసారి ఐపీఎల్ గెలిచిన కన్నడ జట్టుకు ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఏడాది గ్యాప్ లోనే కన్నడ జట్టు రెండు ట్రోఫీలు అందుకుంది. ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో గత ఏడాది కన్నడ జట్టు కప్ సాధించింది. ఇక ఈ సంవత్సరం పురుషుల జట్టు కూడా ట్రోఫీ అందుకొని అభిమానుల సంతోషాన్ని రెట్టింపు చేసింది.. గత సంవత్సరం ట్రోఫీ గెలిచిన తర్వాత ఉమెన్స్ జట్టు కెప్టెన్ స్మృతి మందాన ” ఈసాలా కప్ నమదే కాదు.. మనది” అని చెప్పేసింది. అంతేకాదు ఆ మాటను రజత్ పాటిదార్ తో కూడా చెప్పించింది. దీంతో అతడు కూడా “ఈ సాలా కప్ నమదు” అంటూ చెప్పాడు. ఆ వీడియోను కన్నడ అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ చేస్తున్నారు..” స్మృతి మందానకు కప్ గెలుస్తామని అంచనా ముందు నుంచీ ఉంది. అందుకే ఆమె ఆ వ్యాఖ్యలు చేసింది. ఆమె ఏ ముహూర్తాన ఆ వ్యాఖ్యలు చేసిన తెలియదు కానీ.. అవి నిజమయ్యాయి. ఆమెకు ఇదంతా ముందే తెలుసు. అందువల్లే అలాంటి మాటలు మాట్లాడింది. ఆమె మాట్లాడిన మాటలు బెంగళూరు జట్టు సారథి లో విపరీతమైన ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. అందువల్లే కర్ణాటక జట్టు ఈసారి ముందు వరసలో నిలిచింది.. సంవత్సరాల నాటి ఆకాంక్షలు నిజం చేసిందని” కన్నడ అభిమానులు పేర్కొంటున్నారు.
Ee sala cup n̶a̶m̶d̶e̶ namdu x 2️⃣ ❤
Smriti Mandhana Rajat Patidar #TATAIPL | #TATAWPL | #RCBvPBKS | #Final | #TheLastMile | @RCBTweets | @mandhana_smriti | @rrjjt_01 pic.twitter.com/p6Fj0nRb78
— IndianPremierLeague (@IPL) June 3, 2025