Homeక్రీడలుక్రికెట్‌Rajasthan Royals Batting Dominance IPL 2026: 1,2,3 మొత్తం రాజస్థాన్ రాయల్స్ కే... అబ్బాబ్బా....

Rajasthan Royals Batting Dominance IPL 2026: 1,2,3 మొత్తం రాజస్థాన్ రాయల్స్ కే… అబ్బాబ్బా. ఇలాంటి బ్యాటింగ్ నెవర్ బీ ఫోర్ ఎవర్ ఆఫ్టర్

Rajasthan Royals Batting Dominance IPL 2026: ఒక ఆటగాడికి 15 సంవత్సరాల వయసు. అతడికి భయమంటే తెలియదు. ఇంకొక ఆటగాడికి పాతిక సంవత్సరాల వయసు అతడికి బెదురు అంటే తెలియదు. మరో ఆటగాడికి అటు ఇటుగా అంతే వయసు.. అతనికి కూడా వెన్ను చూపడం తెలియదు. మగధీర సినిమాలో శతధృవ వంశ యోధులుగా బ్యాటింగ్ చేస్తున్నారు. మామూలుగా అయితే బ్యాటర్లు బంతిని బలంగా కొడతారు. ఈ ముగ్గురు మాత్రం బంతిమీద కోపం ఉన్నట్టు.. బౌలర్ల మీద గెట్టు పంచాయితీ ఉన్నట్లు కొడుతున్నారు. అందువల్లే ఐపిఎల్ లోనే సరికొత్త చరిత్ర సృష్టించారు.

Also Read: వైభవ్ సూర్య వంశీ.. వరల్డ్ క్రికెట్ సెన్సేషన్ ఊరికే అవలేదు.. దాని వెనుక కన్నీళ్లు పెట్టించే త్యాగం

ఐపీఎల్ లో రాజస్థాన్ జట్టు ప్రస్తుతం టాప్ స్థానంలో కొనసాగుతోంది. ఒక్క ఓటమి కూడా లేకుండా నాలుగు మ్యాచ్లలో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. బలమైన బెంగుళూరు నుంచి మొదలుపెడితే.. చెన్నై వరకు ఏ జట్టును కూడా వదిలిపెట్టడం లేదు. రాజస్థాన్ రాయల్స్ (Rajasthan royals) జట్టుకు బ్యాటింగ్ వెన్నెముకగా వైభవ్ సూర్య వంశీ(Vaibhav Surya Vamshi), యశస్వి జైస్వాల్(yashasvi Jaiswal), ధృవ్ జురెల్(Dhruv jurel) నిలుస్తున్నారు. వీరు ముగ్గురు మామూలు బ్యాటర్లుగా కాకుండా.. యోధుల మాదిరిగా ఆడుతున్నారు. ఎంత పెద్ద లక్ష్యమైనా వీరు ముగ్గురు జస్ట్ తీసి అవతల పడేస్తున్నారు. గౌహతిలాంటి మైదానం మీద.. 200 కు మించిన పరుగుల లక్ష్యాన్ని ఫినిష్ చేశారంటే వీరు ముగ్గురు ఎలాంటి బ్యాటింగ్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసే ఆటగాళ్లకు ఆరెంజ్ క్యాప్ ఇస్తారు. ప్రస్తుత ఐపీఎల్ లో ఆరెంజ్ క్యాప్ విభాగంలో రాజస్థాన్ జట్టుకు చెందిన సూర్య వంశీ టాప్ స్థానంలో ఉన్నాడు. రెండవ స్థానంలో జైస్వాల్ కొనసాగుతున్నాడు. మూడవ స్థానంలో జూరెల్ ఉన్నాడు. సూర్య వంశీ ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడాడు. అతడు ఏకంగా 200 పరుగులు చేశాడు. 50 యావరేజ్ కొనసాగిస్తున్నాడు. రెండవ స్థానంలో ఉన్న జైస్వాల్ నాలుగు మ్యాచ్లు ఆడాడు. ఇతడు ఏకంగా 183 పరుగులు చేశాడు. ఇతడి యావరేజ్ కూడా 91.50 గా కొనసాగుతోంది. జురెల్ నాలుగు మ్యాచ్లు ఆడాడు. ఇతడు 176 పరుగులు చేశాడు. ఇతడి యావరేజ్ 58.67 గా కొనసాగుతోంది. ఆరెంజ్ క్యాప్ విభాగంలో ముగ్గురు ఆటగాళ్లు.. అది కూడా ఒకే జట్టు చెందిన వారు ఉండడం ఒకరకంగా ఐపీఎల్ చరిత్రలో సంచలనం. గతంతో పోల్చి చూస్తే ఈసారి రాజస్థాన్ జట్టు బ్యాటింగ్ విభాగంలో అత్యంత బలంగా కనిపిస్తోంది. ఇతర జట్లు విదేశీ ప్లేయర్ల మీద ఆధారపడితే.. రాజస్థాన్ మాత్రం లోకల్ ప్లేయర్లనే గట్టిగా నమ్ముకుంది. బెంగళూరు నుంచి మొదలుపెడితే పంజాబ్ వరకు అన్ని జట్లలో సమర్థవంతమైన విదేశీ ప్లేయర్లు ఉన్నారు. రాజస్థాన్ మాత్రం లోకల్ ప్లేయర్లను నమ్ముకుని సంచలనాలు సృష్టిస్తోంది. మిగతా జట్లకు అందనంత ఎత్తులో ఉన్న రాజస్థాన్ జట్టు.. ఇంకా మరిన్ని అద్భుతాలు సృష్టించేందుకు రెడీగా ఉంది..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version