
Rahul Gandhi – Virat Kohli: క్రికెట్ లో ఏదైనా సాధ్యమే. విజయం సాధిస్తే ప్రశంసలు. అపజయం పాలైతే విమర్శలు. తాజాగా టీమిండియా పాకిస్తాన్, న్యూజీలాండ్ దేశాలపై పరాజయాన్ని చవిచూసిన నేపథ్యంలో దేశంలో విమర్శలు పెరుగుతున్నాయి. టీమిండియా ఆటగాడు మహ్మద్ షమీపై అభిమానుల విమర్శల జల్లు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో షమీకి అందరు అండగా నిలిచారు. కెప్టెన్ కోహ్లి నుంచి చాలా మంది షమీకి మద్దతు తెలిపారు. దీంతో విరాట్ పై కూడా విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఆయన కూతురు నామికపై కూడా అభ్యంతకర పోస్టులు పెడుతూ తమలోని రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు.
ఎవరు కూడా కావాలని ఓడరు. ఓటమి అనేది సహజం. విజయానికి ఎంత ఆనంద పడతారో ఓటమికి కూడా అంతే బాధ పడతారు. కానీ ఇక్కడ మాత్రం అభిమానుల వెర్రికి అందరు ఆశ్చర్యపోతున్నారు. జట్టు కెప్టెన్ పై విమర్శలకు దిగడం వారికి అంతగా బాగుండకపోయినా వారిలోని క్రూరత్వాన్ని బయటపెడుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. దీంతో ఆటగాళ్లలో ఆగ్రహం తెప్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కెప్టెన్ విరాట్ కోహ్లికి మద్దతు పలికారు. ట్విటర్ వేదికగా కోహ్లికి అండగా నిలిచాడు. జట్టును కాపాడుకోవాలని సూచించాడు. కొందరు అభిమానుల తీరుకు బాధపడొద్దని చెబుతున్నారు. జట్టు ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగాలని హితవు పలికడం విశేషం.
జట్టు విజయం సాధించకపోతే కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో గందరగోళం నెలకొంది. దీనిపై మహిళా కమిషన్ ఢిల్లీ పోలీసులకు నోటీసులు పంపించి కేసు నమోదు చేయాలని సూచించింది. దీంతో త్వరలోనే నిందితులను పట్టుకుని శిక్షించాలని ఆదేశించింది. కోహ్లి కుటుంబానికి వస్తున్న బెదిరింపులపై మీడియాలో వస్తున్న కథనాల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు కావడం తెలిసిందే.
Also Read: హత్రాస్ ఘటనపై టీపీసీసీ నేడు మౌన దీక్ష..