Commonwealth Games 2022: మన తెలుగు బిడ్డ, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు అరుదైన గౌరవం దక్కింది. దేశానికి టార్చ్ బేరర్ లా నిలిచే అవకాశం చిక్కింది. ఈసారి దేశపు టీంను కామన్వెల్త్ క్రీడల్లో ముందుండి నడిపించే అరుదైన అవకాశం లభించింది. ఇంగ్లండ్ లో జరిగే 2022-కామన్వెల్త్ క్రీడల్లో ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొనే భారత బృందానికి ఫ్లాగ్ బేరర్ గా పీవీ సింధు ఎంపికైంది.

రెండు సార్లు ఒలింపిక్ పతకాన్ని సాధించిన పీవీ సింధును ఇండియా టీంకు ఫ్లాగ్ బేరర్ గా ఎంపిక చేశారు. 2018లో గోల్డ్ కోస్ట్ లో జరిగిన కామన్వెల్త్ క్రీడల ప్రారంభోత్సవ వేడుకలో పీవీ సింధు జెండాను ప్రదర్శించారు. ఆ ఎడిషనల్ లో మహిళల సింగిల్స్ లో రజత పతకాన్ని సింధు గెలుచుకుంది. తాజా గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించాలని శ్రమిస్తోంది.
రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత అయిన షట్లర్ పీవీ సింధును భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఓపెనింగ్ కార్యక్రమంలో టీమిండియా ఫ్లాగ్ బేరర్ గా ప్రకటించడం ఆనందంగా ఉందని ఐఓఏ సంచలన ప్రకటన చేశారు. మరో ఇద్దరు అథ్లెట్లు వెయిట్ లిఫ్టర్ ఎంఎస్ మీరాబాయి చాను, బాక్సర్ ఎంఎస్ లోవ్లీనా బోర్గో హైన్ లను కూడా ఫ్లాగ్ బేరర్ గా ఐఓఏ ఎంపిక చేసింది.
పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్ 2020లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. సింగపూర్ ఓపెన్ లో విజేతగా నిలిచింది. ఈ ఏడాది ప్రారంభంలో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్, స్విస్ ఓపెన్ టైటిళ్లను గెలిచింది.ఈ క్రమంలోనే పీవీ సింధుకు భారత ఒలింపిక్ సంఘం అరుదైన గౌరవాన్ని ఇచ్చింది.
కామన్ వెల్త్ గేమ్స్ 2022 ప్రచారాన్ని ఆగస్టు 3న ప్రారంభించనుందని పీవీ సింధు. ఇక ఈ గేమ్స్ ప్రారంభ వేడుక గురువారం బర్మింగ్ హామ్ లోని అలెగ్జాండర్ స్టేడియంలో జరుగుతుంది.
ఇక ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రాకు ఈసారి నిరాశ ఎదురైంది. బర్మింగ్ హామ్ కామన్వెల్త్ క్రీడల ప్రారంభోత్సవంలో ఫ్లాగ్ బేరర్ గా దేశానికి నాయకత్వం వహించే అవకాశాన్ని కోల్పోయారు. ఈ మేరకు ప్రకటన కూడా విడుదలైంది.
నిజానికి నీరజ్ చోప్రానే టీం ఇండియా ఫ్లాగ్ బేరర్ గా ఉండే అవకాశాన్ని కోల్పోయారు. గాయంతో వైదొలగడంతో ఈ అవకాశం పీవీ సింధుకు వచ్చింది.