Pakistan super league: అసలే ఆదాయం లేదు. క్రికెట్ మ్యాచ్లు చూసేందుకు వచ్చే జనాలు కూడా లేరు. అన్నిటికీ మించి ఆ దేశంలో పర్యటించడానికి ఏ దేశం కూడా సాహసం చేయడం లేదు. చేతిలో డబ్బులు లేవు. ఇలాంటప్పుడు ఏం చేయాలి.. ఏముంది పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు.. సూపర్ లీగ్ ప్రకటించింది.. విదేశీ ప్లేయర్లకు ఆడాలని ఆఫర్ ఇచ్చింది. కానీ.. ఇవన్నీ జరగాలంటే డబ్బులు కావాలి. కార్పొరేట్ కంపెనీలు క్యూ కట్టాలి. స్ట్రీమింగ్ కోసం చానల్స్ పోటీపడాలి. అక్కడ అంత సీన్ లేదు. అర్ధాంతరంగా లీగ్ ముగించలేదు. కాబట్టి తప్పనిసరి తద్దినం లాగా జరుపుతోంది.
పై ఉపోద్ఘాతం చదువుతుంటే పాకిస్తాన్ గుర్తుకు వస్తే తప్పు మీది కాదు. ఎందుకంటే పాకిస్తాన్లో ఏం జరిగినా సరే దరిద్రంగానే ఉంటుంది. ముఖ్యంగా క్రికెట్ విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వ్యవహరించే తీరు పరమ చండాలంగా ఉంటుంది. ఏ టోర్నీ కూడా లావిష్ గా నిర్వహించిన చరిత్ర పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు లేదు. ఏదో నిర్వహించాం.. నాలుగు డబ్బులు వెనకేసుకున్నాం అన్నట్టుగానే ఉంటుంది ఆ క్రికెట్ మేనేజ్మెంట్ పరిస్థితి.
ఐపీఎల్ మాదిరిగానే పాకిస్తాన్ సూపర్ లీగ్ అనే పేరుతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కొన్ని సంవత్సరాల క్రితం శ్రీకారం చుట్టింది. ఐపీఎల్ మాదిరిగా లక్షల కోట్ల బ్రాండ్ విలువను సొంతం చేసుకుంటుంది అనుకుంటే.. నానాటికి తీసి కట్టు నామం బొట్టు అన్నట్టుగా పిసిఎల్ పరిస్థితి మారిపోయింది. విదేశీ ప్లేయర్లు ముఖం చాటేస్తున్నారు. స్వదేశీ ప్లేయర్లు దారుణంగా ఆడుతున్నారు. దేశంలో పరిస్థితి బాగో లేకపోవడంతో మైదానంలో కొ వచ్చి అభిమానులు మ్యాచులు చూసే పరిస్థితి లేదు. అందువల్లే అది కష్టం మీద పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పాకిస్తాన్ సూపర్ లీగ్ నిర్వహిస్తోంది.
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 సీజన్ శుక్రవారం మొదలైంది. ప్రారంభ మ్యాచ్ లాహోర్.. హైదరాబాద్ కింగ్స్ మెన్ జట్ల మధ్య జరిగింది. గత సీజన్లో జరిగిన టోర్నీలో లాహోర్ జట్టు విజేతగా నిలిచింది.. అయితే పాకిస్తాన్ సూపర్ లీగ్ చరిత్రలోనే తొలిసారిగా టాస్ కు ముందు రెండు జట్ల కెప్టెన్లు రెండు వేరు వేరు ప్లేయింగ్ 11 జాబితాలను సమర్పించారు. ఆ తర్వాత ఏదో ఒకదానిని ఖరారు చేసి ఆమోదించాలి. ఆమోదించిన జట్టు మాత్రమే రంగంలోకి దిగుతుంది. ప్రత్యర్థి జట్టు కెప్టెన్ అనుమతి లేకుండా తదుపరి మార్పులు చేయడానికి అవకాశం లేదు.. ఇది నామినేషన్లు, ఆటగాళ్ల మార్పులను నియంత్రించే క్లాజ్ 1.2.1 పరిధిలోకి వస్తుంది.
ఇక ప్రారంభ మ్యాచ్లో పాకిస్తాన్ టికెట్ మేనేజ్మెంట్ పరువు పోయే ఘటన జరిగింది. హైదరాబాద్ బౌలింగ్ వేస్తున్న సమయంలో తెలుపు రంగు బంతి గులాబీ రంగులోకి మారిపోయింది. ప్లేయర్లు తమ జెర్సీలతో బంతిని రుద్దినప్పుడు.. ఆ రంగు బంతికి అంటుకుంది. క్రికెట్ చరిత్రలో గతంలో ఏనుడు కూడా ఇటువంటి సంఘటన చోటు చేసుకోలేదు. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డును విమర్శకులు తూర్పార పడుతున్నారు. అసలు జెర్సీలు ఎలా రిపొందించారు.. బంతి బాండితులు ప్రమాణాలు పాటించలేదా.. అని ప్రశ్నిస్తున్నారు. ఇక ప్రారంభ మ్యాచ్ లాహోర్లోని గడాఫీ స్టేడియంలో జరిగింది. లాహోర్ జట్టు హైదరాబాద్ కింగ్స్ మెన్ పై 69 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.