IPL 2024: ఐపీఎల్ అంటేనే వేగానికి కొలమానం. దూకుడయిన ఆటతీరుకు పర్యాయపదం. ఈ క్రీడాకారులు తమ ఆట తీరుతో ఐపీఎల్ ను అలా మార్చారు మరి. వీరి కొట్టిన కొన్ని బంతులు మైదానం అవతలపడ్డాయి. మరి అలాంటి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి.. వీరలెవల్లో సిక్స్ లు వదిన ఆటగాళ్ల జాబితాను ఒకసారి చూద్దామా..
గేల్, వెస్టిండీస్
ఆరు అడుగులకు మించిన ఎత్తు.. ప్రతి బంతిని బలంగా బాదాలి అనే కసి.. తనదైన రోజు అసాధ్యాన్ని సుసాధ్యం చేసే తీరు.. ఇవన్నీ గేల్ కు అచ్చు గుద్దినట్టు సరిపోతాయి. ఐపీఎల్ లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా ఇతడు తొలి స్థానాన్ని దక్కించుకున్నాడు. ఐపీఎల్ లో మూడు జట్ల తరఫున ఇతడు ఆడాడు. 142 మ్యాచులలో 357 సిక్స్ లు కొట్టాడు.
రోహిత్ శర్మ, ముంబై ఇండియన్స్
అద్భుతమైన ఆట తీరుతో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్న ఈ ముంబై ఆటగాడు.. మైదానంలో అడుగుపెడితే అభిమానులకు పూనకాలే. ప్రత్యర్థి బౌలర్లకు చలి జ్వరాలే. రోహిత్ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఇప్పటివరకు రోహిత్ ఐపీఎల్ లో 257 సిక్స్ లు బాదాడు.
డివిలియర్స్
మిస్టర్ 360 గా ఇతడిని పిలుస్తారు. ఎందుకంటే బంతిని మైదానం నలుమూలల బాదగలడు కాబట్టి. ఐపీఎల్ లో ఇతడు బెంగళూరు జట్టు తరఫున ఆడాడు. ఇతని పేరిట 251 సిక్సర్లు ఉన్నాయి.
ధోని
ధనాధన్ క్రికెట్ కు ధోని పర్యాయపదం. బీభత్సమైన ఆటతీరుతో చెన్నై జట్టును ఎన్నోసార్లు గెలిపించాడు. ఇప్పటివరకు ఇతడు 239 సిక్స్ లు కొట్టాడు.
విరాట్ కోహ్లీ
టీమిండియా పరుగుల యంత్రంగా పేరుపొందిన ఈ ఆటగాడు.. ఐపీఎల్ లో 234 సిక్స్ లు కొట్టాడు. 223 ఐపీఎల్ మ్యాచ్లలో 6,624 పరుగులు సాధించాడు.
డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గా పేరుపొందిన ఇతడు.. ఐపీఎల్ కెరియర్ లో 226 సిక్స్ లు కొట్టాడు. ఈ జాబితాలో నాలుగవ స్థానంలో ఉన్నాడు.
పొలార్డ్
ముంబై జట్టు తరఫున ఆడిన ఈ ఆటగాడు.. 223 సిక్స్ లు కొట్టాడు. ముంబై తరఫున 189 మ్యాచులు ఆడి 16 హాఫ్ సెంచరీలు సాధించాడు.
సురేష్ రైనా
చెన్నై జట్టులో అభిమానులు ఇతడిని చిన్న అన్నగా పిలుస్తారు. ధోనికి అత్యంత నమ్మకస్తుడైన ఆటగాడు ఇతడు. ఇప్పటివరకు ఐపీఎల్లో 203 సిక్స్ లు కొట్టాడు. ఒక సెంచరీ, 39 హాఫ్ సెంచరీలు సాధించాడు.
షేన్ వాట్సన్
చెన్నై జట్టు తరఫున ఆడిన ఈ ఆస్ట్రేలియా ఆటగాడు.. ఇప్పటివరకు 190 సిక్స్ లు కొట్టాడు.
అండ్రూస్ రసెల్
కోల్ కతా జట్టు తరఫున ఆడిన ఈ జమైకా క్రీడాకారుడు.. ఇప్పటివరకు ఐపీఎల్ లో 193 సిక్స్ లు కొట్టాడు.