Homeక్రీడలుPakistan beat Australia: పస లేని పాకిస్తాన్ ముందు సున్నా.. ఈ ఆస్ట్రేలియన్ క్రికెటర్లకు ఏమైంది?

Pakistan beat Australia: పస లేని పాకిస్తాన్ ముందు సున్నా.. ఈ ఆస్ట్రేలియన్ క్రికెటర్లకు ఏమైంది?

Pakistan beat Australia: ఎలాంటి జట్టైనా సరే.. ఇలాంటి మైదానమైనా సరే ఆస్ట్రేలియా ఆటగాళ్లు అదరగొడతారు. ఓడిపోయే సమయంలో కూడా సమర్థవంతమైన ఆట తీరు ప్రదర్శించి గెలుపును అందుకుంటారు. అందువల్లే ఐసీసీ నిర్వహిస్తున్న మేజర్ టోర్నీలలో సింహభాగం ట్రోఫీలు ఆస్ట్రేలియా ప్లేయర్లే సొంతం చేసుకుంటారు. పోరాట స్ఫూర్తి.. సమిష్టితత్వం.. సమర్థవంతమైన నాయకత్వం.. ఇవన్నీ కూడా ఆస్ట్రేలియా ఆటగాళ్లలో నూటికి నూరు శాతం ఉంటాయి.

ఆస్ట్రేలియా ప్లేయర్లు స్వదేశమే కాదు, విదేశాలలో కూడా అంతకుమించి అనే స్థాయిలో ఆడతారు. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చూసుకుంటారు. అయితే ఆ స్థాయిలో ఆడుతున్న ఆస్ట్రేలియా జట్టు ఇప్పుడు పాకిస్తాన్ ముందు తలవంచింది. పాకిస్తాన్ దేశంతో ముగిసిన మూడు టి20 మ్యాచ్ల సిరీస్లో ఆస్ట్రేలియా వైట్ వాష్ కు గురైంది. ఇది చదువుతుంటే ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ముమ్మాటికి ఇది నిజం.

ఆదివారం జరిగిన మూడవ టి20 మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు 207 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా జట్టు 96 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో మూడు టీ 20 మ్యాచ్ ల సిరీస్ ను పాక్ 3-0 తేడా తో పాకిస్తాన్ సొంతం చేసుకుంది. పాకిస్తాన్ ప్లేయర్ బాబర్ ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసాడు. తద్వారా టి20లలో హాఫ్ సెంచరీలు (39) చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. విరాట్ కోహ్లీ (38) రికార్డును బద్దలు కొట్టాడు

మూడు టి20 మ్యాచ్ల సిరీస్లో పాకిస్తాన్ జట్టు వరుసగా మూడు మ్యాచ్లు గెలిచింది. రెండు, మూడు మ్యాచ్ల్లో అయితే హస్తిమ శకాంతరం తేడాతో విజయం సాధించడం గమనార్హం. పాకిస్తాన్ జట్టు సాధించిన ఈ విజయం పట్ల ఆ దేశంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు ఇలా ఓడిపోవడం పట్ల సోషల్ మీడియాలో రకరకాల విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.

ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఈ సిరీస్ లో తమ స్థాయికి తగ్గట్టుగా ఆడలేదు. పాకిస్తాన్ బౌలర్ల ముందు తలవంచారు. భీకరంగా బ్యాటింగ్ చేసే ఆస్ట్రేలియా ఆటగాళ్లు తేలిపోవడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ స్థాయి విజయాన్ని పాకిస్తాన్ జట్టు సాధించింది అంటే నమ్మే విధంగా లేదని క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆస్ట్రేలియా జట్టు ఈ సిరీస్ ను లైట్ తీసుకుందని.. అందువల్లే ఇలా ఓటమిపాలైందని క్రికెట్ అభిమానులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version