Odi World Cup 2023: వరల్డ్ కప్ కొట్టాలని ప్రతి టీమ్ కూడా చాలా అంచనాలతో బరిలోకి దిగింది.కానీ వరల్డ్ కప్ ట్రోఫీ కొట్టాలంటే సముద్రాన్ని ఈదేంతా శక్తి కావాలి,జలపాతం తో పాటు గా పరిగెత్తే అంతా తెగింపు ఉండాలి,నిప్పులా గుండెల్లో జ్వాలని రగిలిస్తూ ముందుకు దూకేంత మొండితనం కావాలి.ప్రతి ప్లేయర్ లో ఇవన్నీ ఉండి మొండిగా ముందుకు దూసుకెళ్తే వరల్డ్ కప్ కొట్టడం పెద్ద కష్టం ఏమీ కాదు….
ఇక ప్రస్తుతం ఈ టోర్నీ లో జరిగే లీగ్ మ్యాచ్ లు చివరి దశకి చేరుకున్న క్రమంలో సెమీస్ రేస్ లో నిలిచిన ప్రతి టీమ్ పట్ల తీవ్రమైన పోటీ ఎదురవుతుంది.ఇక ప్రతి మ్యాచ్ కూడా చాలా రసవత్తరంగా సాగుతుంది.ప్రతి టీమ్ డూ ఆర్ డై అనే దిశ గా ముందుకు సాగుతూనే ప్రతి ప్లేయర్ కూడా తన టీమ్ ని గెలిపించడానికి ఒంటరి పోరాటం చేస్తున్నారు.ఇక ఆస్ట్రేలియా అఫ్గాన్ మ్యాచ్ లో మాక్స్ వెల్ చేసిన విద్వంసం అంత ఇంత కాదు…ఈ క్రమం లో ఏ టీం పైన ఏ టీమ్ విజయం సాధిస్తుంది అనేది ఇక్కడ చాలా ఉత్కంఠ గా మారుతున్న క్రమంలో ఇప్పటికే సెమీ ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న ఇండియా, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా లాంటి టీమ్ లు సెమీఫైనల్ కి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.
ఇక ఈ క్రమంలోనే ఇండియాతో తలపడే టీం ఏది అనే విషయం మీద ఒక క్లారిటీ అయితే రావడం లేదు.ఇండియా నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతుంది కాబట్టి నెంబర్ ఫోర్ పొజిషన్ లో ఉన్న టీం తో ఇండియా తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది.అందులో భాగంగానే నెంబర్ ఫోర్ లో సెమీస్ లోకి వచ్చే టీం ఏది అనే దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఇప్పటికే నెంబర్ 4 ప్లేస్ కోసం న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి టీములు పోటీ పడుతున్నాయి. ఈ మూడు టీంలు కూడా నాలుగు విజయాలను దక్కించుకొని ఎనిమిది పాయింట్లతో ఉండడం విశేషం…
ఇక రీసెంట్ గా ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా మీద ఓడిపోవడంతో ఈ లెక్కలు ఇలా ఉన్నాయి ఒకవేళ ఆస్ట్రేలియా మీద ఆఫ్గనిస్తాన్ విజయం సాధించి ఉంటే ఆఫ్ఘనిస్తాన్ ఈ రెండు టీం లను డామినేట్ చేసి సెమీ ఫైనల్ రేస్ లో తను ముందు వరుసలోకి వచ్చేది. ఇక ఇవాళ్ల న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ తో సెమి ఫైనల్ కు వెళ్లే టీం ఏది అనేది కన్ఫర్మ్ కాబోతుంది.అయితే ఇవాళ్ల జరగబోయే మ్యాచ్ కి వర్షం అడ్డంకిగా మారనుందనే విషయం అయితే తెలుస్తుంది.ఇక న్యూజిలాండ్ టీం గత మ్యాచ్ లో పాకిస్తాన్ మీద వర్షం కారణంగానే డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఓడిపోవడం జరిగింది. ఇక ఇవాళ్ల కూడా వర్షం పడి మ్యాచ్ రద్దయిన లేదా న్యూజిలాండ్ టీం పైన శ్రీలంక విజయం సాధించిన కూడా న్యూజిలాండ్ టీమ్ సెమీస్ కి వెళ్లడం కష్టమవుతుంది.ఇక ఇది ఇలా ఉంటే పాకిస్తాన్ టీమ్ తన చివరి మ్యాచ్ ఇంగ్లాండ్ తో ఆడుతుంది. కాబట్టి ఇంగ్లాండ్ మీద ఒక భారీ విక్టరీని కొట్టగలిగితే పాకిస్తాన్ సెమీ ఫైనల్ కి వెళుతుంది. న్యూజిలాండ్ శ్రీలంక మీద ఓడిపోయి, పాకిస్తాన్ ఇంగ్లాండ్ మీద గెలిస్తే పాకిస్తాన్ సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ అయిపోతుంది.
ఇక ఇదే క్రమంలో న్యూజిలాండ్ ని దురదృష్టం చుట్టూ ముడుతూ ఉంటే, పాకిస్తాన్ కి మాత్రం అదృష్టం కలిసి వస్తుందనే చెప్పాలి.. ఇక పాకిస్తాన్ కనుక సెమీ ఫైనల్ లోకి వస్తే ఇండియన్ టీం తో పాకిస్తాన్ తల పడబోతుందనే విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది… అయితే ఇప్పటివరకు మొదటి సెమి ఫైనల్ మ్యాచ్ ముంబై వేదికగా నవంబర్ 15వ తేదీన జరగనుందనే విషయంలో అయితే క్లారిటీ ఉంది. కానీ ఒకవేళ పాకిస్తాన్ కనక సెమీఫైనల్ లోకి వస్తే ముంబైలో కాకుండా సెమీ ఫైనల్ మ్యాచ్ వేదికను కలకత్తాకి మర్చుతారు.
ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు ముంబై రావడానికి ఇష్టపడడం లేదు అందువల్లే వాళ్ళు సెమీఫైనల్ కు వస్తే మ్యాచ్ ని కలకత్తాలో నిర్వహించనున్నట్లు గా బీసీసీఐ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది… ఇక ఇండియాతో తలపడే టీం ఏది అనేది మాత్రం ప్రతి అభిమాని లో తీవ్రమైన ఆసక్తిని అయితే నెలకొల్పుతుంది. ఇక పాకిస్తాన్ కనక సెమీఫైనల్ కి వచ్చినట్లయితే ఇక మ్యాచ్ చూసే అభిమానులకి పండగనే చెప్పాలి…