Pakistan vs Afghanistan : ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా జరిగిన తొలి వన్డేలో బాబర్ ఆజం నేతృత్వంలోని పాకిస్తాన్ టీం ఆఫ్ఘనిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది. జరగబోయే ఆసియా కప్ నేపథ్యంలో ప్రస్తుతం జరిగే ప్రతి మ్యాచ్ ఎంతో ప్రాముఖ్యత కూడుకున్నదే. పైగా ఇప్పుడు జరిగే ప్రతి మ్యాచ్ రాబోయే ఆసియా కప్ మ్యాచ్ కి ప్రాక్టీస్ మ్యాచ్ కిందకి పరిగణిస్తున్నారు. ఇందులో మెరుగుగా రాణించే జట్లు ఆసియా కప్ లో కూడా మంచిగా పెర్ఫార్మ్ చేస్తాయి అని అందరూ భావిస్తున్నారు.
అయితే ప్రస్తుతం బాబర్ అజామ్ నేతృత్వంలో ఆఫ్ఘనిస్తాన్ తో తలపడిన పాకిస్తాన్ జట్టు జరగబోయే ఆసియా కప్ సిరీస్ ను మరింత ఆసక్తికరంగా మారుస్తోంది.హంబన్‌తోటలో జరిగినటువంటి ఈ సిరీస్ లో తొలుత బ్యాటింగ్ కి దిగిన బాబర్ టీం…47 1 ఓవర్లలో 200 పరుగులు సాధించి ఆల్ అవుట్ అయ్యింది. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ కి దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు పాక్ బౌలర్ల ధాటి తట్టుకోలేక చేతులెత్తేసింది.
ఈ సిరీస్లో పాక్ తరఫున రెచ్చిపోయి ఆడిన ఇమామ్-ఉల్-హక్ 94 బంతుల్లో 61 పరుగులు సాధించి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే షాదాబ్ ఖాన్ 50 బంతుల్లో 39 పరుగులు,ఇఫ్తికార్ అహ్మద్ 30 పరుగులు సాధించి పాక్ స్కోర్ ని పరిగెట్టించారు. మరోపక్క ఆఫ్గనిస్తాన్ బౌలర్ల ధాటికి కేవలం 19.2 ఓవర్లలో 59 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. 50 ఓవర్ల ఫార్మాట్ చరిత్రను బాబర్.. అతని బృందం కలిసి తిరిగి రాశారు.
50 ఓవర్ల ఈ మ్యాచ్లో ఒకటి రెండు పరుగుల తేడాతో కాదు ఏకంగా 142 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది. ఈ గెలుపుతో పాక్ మూడు మ్యాచ్ల సిరీస్ లో ఆఫ్ఘనిస్తాన్ పై 1-0 ఆదిక్యంతో నిలిచింది. పాకిస్తాన్ ఆడే విధానం చూస్తే జరగబోయే ఆసియా కప్ మ్యాచ్ లో గణాంకాలు మారే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో టీం ఇండియా తగు జాగ్రత్తలు తీసుకోకపోతే తన చిరకాల ప్రత్యర్థి చేతిలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
కొత్త బాల్ తో హారిస్ రవూఫ్ బౌలింగ్ చేసిన విధానం.. ఒక గేమ్ చేంజెస్ అనొచ్చు. ఆట మొదట్లో పాక్ ప్లేయర్లు కాస్త తడబడిన ఆ తరువాత బ్యాటింగ్ కి వచ్చిన ఇమామ్,ఇఫ్తికార్ స్కోర్ బోర్డును పరిగెట్టించారు. మరోపక్క పాకిస్తాన్ బౌలర్ ఆఫ్గాన్ ప్లేయర్స్ ను కట్టడి చేయడంలో మెరుగైన ప్రదర్శన కనబరిచారు. దీంతో ప్రస్తుతం జరుగుతున్న టి20 మ్యాచ్ కంటే కూడా జరగబోయే ఆసియా కప్ లో పాక్ పెర్ఫార్మెన్స్ ఇంకా ఏ రేంజ్ లో ఉంటుంది అన్న డిస్కషన్ ఎక్కువగా ఉంది. దాంతోపాటుగా పాకిస్తాన్ భయంకరమైన పర్ఫామెన్స్ టీమ్ ఇండియాకు డేంజర్ బెల్స్ అని కూడా అంటున్నారు.