Pickle ball- Padel : క్రీడలు మనిషికి ఉల్లాసంతో పాటు శారీరక వ్యాయామాన్ని కూడా కలిగిస్తాయి. అందుకే చాలామంది ఆటలు ఆడేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. అలాంటి వాటిలో ప్రస్తుతం పికిల్ బాల్, పాడెల్ వంటి క్రీడలు చేరాయి.. ఇప్పటికే పికిల్ బాల్ చాలా దేశాలలో పాపులర్ అయిన క్రీడగా పేరుపొందింది. దీనిని ఇండోర్, ఔట్ డోర్ లో దర్జాగా ఆడొచ్చు. పికిల్ బాల్ తరహా లోనే పాడెల్ అనే క్రీడ తెగ పాపులర్ అయింది. పికిల్ బాల్, పాడెల్ కు వ్యత్యాసం ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
పికిల్ బాల్: తేలికపాటి పదార్థాలతో తయారుచేసిన బంతిని ఈ క్రీడలో ఉపయోగిస్తారు. ప్లాస్టిక్ తో తయారుచేసిన ఆ బంతికి రంధ్రాలు ఉంటాయి.
పాడెల్: దృఢమైన బంతిని ఈ క్రీడలో ఆడతారు.
కోర్టు పరిమాణం
పికిల్ బాల్ : వెడల్పు 20 అడుగులు, పొడవు 44 అడుగులు
పాడెల్: వెడల్పు 20 అడుగులు, పొడవు 60 అడుగులు.
నికరమైన ఎత్తు
పికిల్ బాల్: 36 అంగుళాలు.
పాడెల్: 31.5 అంగుళాలు.
పాయింట్లు ఇలా..
పికిల్ బాల్: నేలపై బౌన్స్ అయితేనే షాట్ కొట్టేందుకు అవకాశం లభిస్తుంది.
పాడెల్: ఓవర్ హ్యాండ్ లో షాట్ కొట్టడానికి అవకాశం ఉంటుంది.
వాలీ, నాన్ వాలీ లు
పికిల్ బాల్: నెట్ కు వైపులా నాన్ వాలీ జోన్ లు.
పాడెల్: నాన్ వాలీ జోన్ లు లేవు. ఆటగాళ్లు ఎక్కడైనా వాలీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
స్కోరింగ్ ఇలా
పికిల్ బాల్: 11 పాయింట్లు పూర్తికాగానే ఒక సెట్ ముగుస్తుంది. రెండు పాయింట్ల వ్యత్యాసంతో విజేతను ప్రకటిస్తారు.
పాడెల్: టెన్నిస్ లాగా వరుస సెట్లలో ఆడుతారు. విజేతను కూడా టెన్నిస్ మాదిరే ప్రకటిస్తారు.
అయితే ఇందులో పికిల్ బాల్ ఆడేందుకు సాధారణంగా ఉంటుంది.. పాడెల్ మాత్రం టెన్నిస్ ను పోలి ఉంటుంది. వేగవంతమైన ఆటగా ఇది గుర్తింపు పొందింది.
ఈ క్రీడలు అమెరికా వంటి దేశాలలో ఎప్పటినుంచో పాపులర్ గా ఉన్నాయి. అక్కడ ఈ క్రీడలకు ప్రత్యేకంగా అసోసియేషన్లు కూడా ఏర్పాటయ్యాయి. పలు ప్రాంతాలలో మైదానాలు కూడా నిర్మించారు. అయితే ఇప్పుడిప్పుడే ఇవి మనదేశంలోకి ఎంట్రీ ఇస్తున్నాయి. పేరుపొందిన వ్యక్తులు ఈ క్రీడల్లో జట్లను కొనుగోలు చేస్తున్నారు.. సినీనటి సమంత పికిల్ బాల్ లో ఒక జట్టును కొనుగోలు చేసి.. క్రీడా వర్గాల్లో సంచలనం సృష్టించింది.