World Cup : 47 సంవత్సరాల వయసులో వరల్డ్ కప్ ఆడిన ఏకైక ప్లేయర్ ఎవరో తెలుసా..?

కానీ ఒక ప్లేయర్ మాత్రం వరల్డ్ కప్ ఆడాలనే సంకల్పంతో ఏకంగా 47 సంవత్సరాలకి వరల్డ్ కప్ లో తన డెబ్యూ మ్యాచ్ ఆడాడు

Written By: NARESH, Updated On : October 19, 2023 10:51 pm
Follow us on

World Cup : ప్రతి ప్లేయర్ కూడా వాళ్ళ ఎంటైర్ కెరియర్ లో ఒక్కసారైనా వరల్డ్ కప్ టీంలో ఆడాలి అని కోరుకుంటాడు. అందులో భాగంగానే ప్రతి ప్లేయర్ తనకు తాను ప్రూవ్ చేసుకుంటూ సెలెక్టర్లని ఆకర్షిస్తూ టీంలో ప్లేస్ సంపాదించుకోవడం కోసం నానా తంటాలు పడుతూ ఉంటారు.

ఇక ఇలాంటి క్రమంలోనే ప్లేయర్స్ ఒకవైపు వాళ్ల ఏజ్ పెరిగిపోతూ ఉంటుంది మరోవైపు వరల్డ్ కప్ లో ఆడతామా, లేదా అనే ఒక చిన్నపాటి సందేహం అయితే వాళ్లలో ఉంటుంది. ఇక ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎలాగైనా టీమ్ తరుపున ఆడాలి అనే ఒకే ఒక సంకల్పంతో వాళ్లని వాళ్లు ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఒక ప్లేయర్ మాత్రం వరల్డ్ కప్ ఆడాలనే సంకల్పంతో ఏకంగా 47 సంవత్సరాలకి వరల్డ్ కప్ లో తన డెబ్యూ మ్యాచ్ ఆడాడు ఆ ప్లేయర్ ఎవరు అంటే నెదర్లాండ్ టీంకు చెందిన నోలన్ క్లార్క్…

ఈయన 1996 వ సంవత్సరంలో జరిగిన వరల్డ్ కప్ లో నెదర్లాండ్ టీం తరఫున బరిలోకి దిగాడు. అత్యంత ఎక్కువ ఏజ్ లో వరల్డ్ కప్ టీంలో ఆడిన ప్లేయర్ గా ఈయన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ విధంగా అత్యంత ఎక్కువ ఏజ్ లో ఇంటర్నేషనల్ మ్యాచ్ లకు నెదర్లాండ్ టీమ్ తరుపున డెబ్యూ చేసిన ప్లేయర్ గా కూడా నెదర్లాండ్ టీమ్ తరఫున ఈయన రికార్డులకు ఎక్కాడు. ఇక ఈయన పర్ఫామెన్స్ విషయాన్ని పక్కన పెడితే 47 సంవత్సరాల్లో కూడా క్రికెట్ అంటే ఇష్టం ఉండటం వల్ల ఆ సమయంలో కూడా వాళ్ల దేశం తరపున క్రికెట్ ఆడే అవకాశాన్ని పొందాడు అంటే ఆయనకి క్రికెట్ అంటే ఇంత ఇష్టమో మనం అర్థం చేసుకోవచ్చు.

47 సంవత్సరాలు అంటే ఆల్రెడీ రిటైర్ అయిపోయి ప్లేయర్లకు కోచింగ్ ఇచ్చే టైం లో తన టీం తరపున డెబ్యూ చేసి అది కూడా వరల్డ్ కప్ లో మ్యాచ్ లు ఆడడం అంటే మామూలు విషయం కాదు. ఆ క్రెడిట్ ని సాధించిన ఒకే ఒక ప్లేయర్ గా నొలన్ క్లార్క్ చరిత్ర సృష్టించాడు…అలా చాలా మంది ప్లేయర్లు క్రికెట్ అంటే ఒక ఆటలా కాకుండా ఇష్టంగా ప్రాణం పెట్టి ఆడుతుంటారు. అలాంటి వాళ్లకి ప్రస్తుతానికి అవకాశాలు రాకపోయిన ఏదో ఒక టైం లో వాళ్ల కి రావాల్సిన గుర్తింపు వాళ్ళు పొందుతూ క్రికెట్ హిస్టరీలో వాళ్ల కంటూ ఒక గుర్తింపు ను పొందుతూ ఉంటారు…