Nitish Rana Vs Digvesh Singh: వేదిక మారింది.. ఆడే జట్టు మారింది. యాజమాన్యం మారింది. కానీ అతని ఓవరాక్షన్ మాత్రం మారలేదు. అదే దూకుడు.. అదే దుందుడుకు తీరు.. ఫలితంగా అతడు ఊహించని పనిష్మెంట్ ఎదురయింది. బహుశా ఇప్పట్లో దానిని అతడు మర్చిపోవడం సాధ్యం కాకపోవచ్చు.
ఐపీఎల్ లో లక్నో జట్టు తరుపున దిగ్వేష్ రాటి విపరీతమైన ఓవరాక్షన్ చేశాడు. వికెట్ పడటమే ఆలస్యం మైదానంలో తన అతి తెలివిని ప్రదర్శించాడు. కొన్ని సందర్భాలలో చిత్ర విచిత్రమైన సంకేతాలను.. హావభావాలను వ్యక్తం చేశాడు. ఫలితంగా ఐపీఎల్ నిర్వాహక కమిటీ ఆగ్రహానికి గురయ్యాడు. ఏకంగా మ్యాచ్ ఫీజును కూడా నష్టపోయాడు. ఒక రకంగా ఆది ఇతడికి ఇబ్బందికరమైన పరిణామం. అయినప్పటికీ దాని నుంచి అతడు గుణ పాఠాలు నేర్చుకోలేదు. పైగా అదే దుందుదుడుకు వ్యక్తిత్వాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే అతడి ఓవర్ యాక్షన్ కు నితిష్ రాణా కళ్లెం వేశాడు.
ప్రస్తుతం ఢిల్లీ వేదికగా ఢిల్లీ ప్రీమియర్ లీగ్ నడుస్తోంది. ఇందులో నితీష్, దిగ్వేష్ వేర్వేరు జట్లకు ఆడుతున్నారు. అయితే దిగ్వేష్ వేసిన ఓ ఓవర్లో నితీష్ దుమ్మురేపాడు.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో దిగ్వేష్ సైలెంట్ అయిపోయాడు. అతడు అలా బ్యాటింగ్ చేస్తుంటే మౌన ప్రేక్షకుడి లాగా చూస్తూ ఉండిపోయాడు. ఈ వీడియో చూసిన వారంతా దిగ్వేష్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ” నీకంటే తోపు బౌలర్లు చాలామంది ఉన్నారు. వారంతా తమ కెరియర్లో నీలా ఎక్స్ట్రాలు చేయలేదు. తమ పని తాము చేసుకుంటూ పోయారు. కానీ నువ్వు ఆటకంటే ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తున్నావు. అందువల్లే నువ్వంటే బ్యాటర్లకు కోపం వస్తోంది. ఇప్పటికైనా అతి మానుకో అని” నెటిజన్లు సూచిస్తున్నారు. అన్నట్టు ఈ మ్యాచ్లో 55 బంతులు ఎదుర్కొన్న నితీష్ 134 పరుగులతో అజేయంగా నిలిచాడు.
HEATED MOMENT BETWEEN NITISH RANA vs DIGVESH RATHI…!!!
– Nitish smashed 134*(55) in the Eliminator in DPL as a Captain. pic.twitter.com/RR0Omg1aJ2
— Johns. (@CricCrazyJohns) August 30, 2025