Arjun Tendulkar: ఐపీఎల్ వచ్చే సీజన్ కు సంబంధించి మినీ వేలం త్వరలో జరగనుంది. ఈ నేపథ్యంలో ప్లేయర్లకు సంబంధించి రిటైన్.. ట్రేడ్ వ్యవహారాలు సాగుతున్నాయి. ఆయా జట్లు ఆటగాళ్లను మార్పిడి చేసుకుంటున్నాయి. ఇప్పటికే కోల్ కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఒప్పందాలు కుదిరినట్లు తెలుస్తోంది. సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ కు, రవీంద్ర జడేజా రాజస్థాన్ రాయల్స్ జట్లకు వెళ్లిపోవడం ఖాయం అయింది. ఇప్పుడు ఈ జాబితాలోకి ముంబై ఇండియన్స్ కూడా చేరిపోయింది. ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
ముంబై ఇండియన్స్ జట్టులో సచిన్కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఆటగాడిగా ఉన్నాడు. 2024 సీజన్లో ఇక్కడికి ఆడే అవకాశం అంతంతమాత్రంగానే వచ్చింది. వచ్చిన అవకాశాలను కూడా అతడు వినియోగించుకోలేకపోయాడు. ఈ సీజన్లో అతడు మైదానంలోకి దిగనేలేదు. వాస్తవానికి మెగా వేలంలో అతడిని ముంబై జట్టు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించలేదు. చివరికి సచిన్ తన పలుకుబడి ఉపయోగించడంతో అర్జున్ ను ముంబై యాజమాన్యం కొనుగోలు చేసింది.. ముంబై యాజమాన్యం ప్రస్తుతం అర్జున్ ను వదిలేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అతని స్థానంలో శార్దూల్ ఠాకూర్ ను తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఇది ట్రేడ్ లో భాగం కాకపోవచ్చు అని తెలుస్తోంది.. శార్దుల్ ముంబై ఇండియన్స్ జట్టులో ఆడేందుకు ఆసక్తిని చూపిస్తున్నాడు. మరోవైపు తనక పొమ్మన లేక పొగ పెడుతోందని యాజమాన్యంపై అర్జున్ అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్రేడ్ నిబంధనల ప్రకారం ఏదైనా ఆటగాళ్ల మార్పిడికి సంబంధించిన విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించాలి. అయితే ఆటగాళ్ల మార్పిడికి అవకాశం ఉందని ముంబై ఇండియన్స్ యాజమాన్యం “క్రిక్ బజ్” తో ధ్రువీకరించినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నవంబర్ 15న ఆటగాళ్ల రిటైన్, ఆటగాళ్ల విడుదల జాబితాకు సంబంధించిన ప్రకటన రావచ్చని తెలుస్తోంది.
గత ఏడాది జరిగిన మెగా వేలంలో శార్దూల్ అన్ సోల్డ్ గా మిగిలిపోయాడు. తీసుకుంది.. లక్నో జట్టు తరఫున పది మ్యాచ్లు ఆడిన అతడు.. 18 పరుగులు చేశాడు. 13 వికెట్లు పడగొట్టాడు. కొత్త బంతితో అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అర్జున్ టెండూల్కర్ ను ముంబై జట్టు కు 20 లక్షలకు కొనుగోలు చేసింది. 2023, 24 సీజన్లలో అతడు కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. అతడు అయిదు ఐపీఎల్ మ్యాచ్లలో ఆడాడు. 13 పరుగులు చేశాడు. మూడు వికెట్లు పడగొట్టాడు.
అర్జున్ ను లక్నోకు.. శార్దుల్ ను ముంబైకి పంపించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు డొమెస్టిక్ క్రికెట్లో అర్జున్ ముంబై నుంచి గోవా జట్టుకు మారిపోయాడు. అప్పటినుంచి అతడు 21 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడాడు.. సచిన్ కుమారుడైనప్పటికీ ఐపీఎల్లో ముంబై జట్టు తరఫున ప్లేయింగ్ -11 లో చోటు సంపాదించుకోవడం అర్జున్ కు ఒక సవాల్ గా మారింది.