Mumbai Indians: హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బౌలింగ్లో అదరగొట్టింది. టాస్ గెలిచినప్పటికీ పిచ్ మీద సంపూర్ణ అవగాహన ఉండడంతో బౌలింగ్ ఎంచుకుంది. పైగా వాంఖడే స్టేడియం స్లో పిచ్ కావడంతో ముంబై బౌలర్లు రెచ్చిపోయారు. ముఖ్యంగా విల్ జాక్స్ హైదరాబాద్ జట్టును దారుణంగా దెబ్బ కొట్టాడు. ఒక వికెట్ తీయడమే కాకుండా.. పొదుపుగా బౌలింగ్ వేసి బుమ్రా సంచలనం సృష్టించాడు. వీరిద్దరే హైదరాబాద్ జట్టు పతనాన్ని శాసించారు. దీంతో హైదరాబాద్ జట్టు 162 పరుగులకే ఆగిపోయింది. వాస్తవానికి 200 మించి పరుగులు నమోదవుతాయాన్ని భావించిన ఈ మైదానంలో.. హైదరాబాద్ ప్లేయర్లు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. ఏ ఒక్క ఆటగాడు కూడా హాఫ్ సెంచరీ చేయలేదంటే.. ఎంత దారుణంగా బ్యాటింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు..
Also Read: సన్ రైజర్స్ హైదరాబాద్ గుట్టు పట్టేశాయి.. ఆ ప్రణాళికతో ఓడిస్తున్న ప్రత్యర్థి జట్లు
గేమ్ ప్లాన్ అదిరింది
హైదరాబాద్ జట్టుపై ముంబై ఇండియన్స్ అదిరిపోయే గేమ్ ప్లాన్ అమలు చేసిందని.. ఆ జట్టు అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. పరుగుల వరద పారే వాంఖడే మైదానంలో బౌలర్లు యార్కర్లు వేశారని, స్టంపులను లక్ష్యంగా చేసుకొని బంతులు వేశారని.. కొంతమంది బ్యాటర్ల లోపాలను తెలుసుకొని నెమ్మదిగా బంతులు వేశారని.. ఇవి అద్భుతమైన ఫలితాలు ఇచ్చాయని ముంబై ఇండియన్స్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా బౌలర్లను హార్దిక్ పాండ్యా అద్భుతంగా రొటేట్ చేశాడని.. అందువల్లే హైదరాబాద్ జట్టు 162పరుగులకే పరిమితమైందని వివరిస్తున్నారు.. అయితే దీపక్ చాహర్, హార్దిక్ పాండ్యా మినహా మిగతా బౌలర్లు మొత్తం అదరగొట్టారని.. అందువల్లే ముంబై ఇండియన్స్ మ్యాచ్ మొత్తాన్ని ఏకపక్షంగా మార్చిందని వివరిస్తున్నారు.
రెండు వరుస విజయాలు
ఈ సీజన్లో ఇప్పటివరకు ముంబై ఏడు మ్యాచ్లు ఆడింది. ఇందులో మూడు విజయాలు సాధించింది.. గుజరాత్, బెంగళూరు, లక్నో, చెన్నై జట్ల చేతుల్లో ముంబై ఓటమిపాలైంది. ఢిల్లీ, హైదరాబాద్, కోల్ కతా జట్లపై విజయాలు సాధించింది. ప్రస్తుతం ముంబై ఖాతాలో 6 పాయింట్లు ఉన్నాయి. నెట్ రన్ రేట్ +0.239 గా ఉంది. రెండు వరస విజయాలు సాధించిన నేపథ్యంలో ముంబై జట్టు పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో ఉంది. ఒకవేళ విజయ పరంపర ఇలాగే కొనసాగిస్తే ముంబై జట్టు ప్లే ఆఫ్ వెళ్లే అవకాశం ఉంది. ముంబై జట్టు ఇంకా ఏడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్లలో ముంబై జట్టు “ఎలాంటి గేమ్ ప్లాన్ అమలు చేస్తుంది? ఎలా ఆడుతుంది?” అనే అంశాలపై అభిమానులు ఎవరికి వచ్చిన విధంగా వారు సోషల్ మీడియాలో సలహాలిస్తున్నారు. మొత్తంగా ప్రస్తుత 18వ ఐపిఎల్ సీజన్లో ముంబై జట్టు ఇండియన్స్ జట్టు విజేతగా నిలవాలని కోరుకుంటున్నారు. హార్దిక్ పాండ్యా ముంబై జట్టును అన్ని రంగాలలో ముందు ఉంచాలని పేర్కొంటున్నారు.
Also Read: హెడ్ భయ్యా.. ఆడటం ఇష్టం లేకపోతే కావ్య పాపకు చెప్పి తప్పుకోవచ్చుగా!