Homeక్రీడలుక్రికెట్‌Mukesh Kumar Delhi Capitals Performance: అతణ్ని తీసుకోవడం దండగన్నారు.. సీన్ కట్ చేస్తే ఢిల్లీ...

Mukesh Kumar Delhi Capitals Performance: అతణ్ని తీసుకోవడం దండగన్నారు.. సీన్ కట్ చేస్తే ఢిల్లీ గెలుపు గుర్రమయ్యాడు

Mukesh Kumar Delhi Capitals Performance: క్రికెట్ లో ఏదైనా జరుగుతుంది. అంచనాలు పెంచుకున్న ఆటగాడు ఆడలేకపోవచ్చు. అంచనాలు లేని ఆటగాడు రాణించవచ్చు. కానీ, కొందరు ఆటగాళ్లు అంచనాలకు మించి రాణిస్తారు. అటువంటి వారికి అవకాశాలు అంత ఈజీగా రావు. వచ్చాయంటే వారు ఆగరు. ఆగలేరు. ఈ జాబితాలో ముందువరుసలో ఉంటాడు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ ముఖేష్ కుమార్.

Also Read: ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలు తప్పు.. వైసిపి చేసింది అంతకంటే తప్పు

ఢిల్లీ జట్టు యాజమాన్యం అక్విబ్ నబీని మెగావేలంలో 8.40 కోట్లకు కొనుగోలు చేసింది. వాస్తవానికి అతడు ఢిల్లీ జట్టు పేస్ దళాన్ని ముందుండి నడిపిస్తాడని ప్రచారం జరిగింది. కానీ, అనుకోకుండా ముఖేష్ కుమార్ కు అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని ముఖేష్ కుమార్ సద్వినియోగం చేసుకున్నాడు. వేగానికి వేగం, నియంత్రణకు నియంత్రణతో సంచలన బౌలర్ గా పేరు తెచ్చుకున్నాడు.

2023 నుంచి అతడు ఢిల్లీ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు. అతడిని ఢిల్లీ యాజమాన్యం 5.50 కోట్లకు కొనుగోలు చేసింది. 2023లో టీమిండియా కరేబియన్ పర్యటనకు వెళ్లినప్పుడు జట్టులో కీలక బౌలర్ గా ముఖేష్ కుమార్ ఉన్నాడు. నాడు అతడు మూడు ఫార్మాట్లలో ఆడాడు.

ప్రస్తుత ఐపీఎల్ లో ముఖేష్ రెండు మ్యాచ్ లలో ఆరు ఓవర్లు వేశాడు. ఏకంగా 20 డాట్ బాల్స్ సంధించాడు. లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్ లో మూడు ఓవర్లు వేశాడు. ఇందులో ఏకంగా 11 డాట్ బాల్స్ ఉన్నాయి. రిష్ బ్ పంత్ ను ప్రోబింగ్ లెంగ్త్ బంతులతో ఇబ్బంది పెట్టాడు.

ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్ లో అతడు తన విశ్వరూపాన్ని చూపించాడు. ముంబై జట్టు టాప్ ఆర్డర్ ను నాశనం చేశాడు. ఫుల్ లెంగ్త్ డెలివరీలు వేసి సంచలనం కలిగించాడు. ర్యాన్ రికెల్టన్, తిలక్ వర్మలాంటి ప్రమాదకరమైన ప్లేయర్లను వెనక్కి పంపించి సంచలనం రేకెత్తించాడు. అందువల్లే ముంబై జట్టు తీవ్ర ఒత్తిడిలో పడి వికెట్లు కోల్పోయి.. రాజస్థాన్ ముందు తలవంచింది.

‘గత ఏడాది బెంగళూరు బౌలర్ హేజిల్ వుడ్ ఎలా బౌలింగ్ చేస్తున్నాడో గమనించాను. అతడి స్థిరమైన వేగం నన్ను ఆకట్టుకుంది. బంతిపై నియంత్రణ ఉత్తేజ పరించింది. నాకు మా కోచ్ మునాఫ్ పటేల్ అనేక విషయాలు చెప్పాడు. వాటిని అనుసరించాను. అందువల్లే ఈ ఘన సాధ్యమైందని’ముఖేష్ కుమార్ వ్యాఖ్యానించాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version