MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎందుకంటే ఆయన సాధించిన విజయాలు ఆయన గురించి చాలా గొప్పగా చెప్తాయి. ఇప్పటికి ఆయన చాలా కప్పులను గెలుచుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు ఇక అందులో భాగంగానే ఆయన ఇండియా తరుపున చాలా క కూడా అందించాడు. అలాగే ఐపీఎల్ లో చెన్నై టీమ్ కి ఐదుసార్లు కప్ అందించి ఆ టీమ్ ని టాప్ లెవల్లో నిలబెట్టాడు. ఇక ఇది ఇలా ఉంటే అందులో భాగంగానే ధోని ఒక ఈవెంట్ లో పాల్గొన్నప్పుడు ఒక కుర్రాడు ధోనితో మాట్లాడుతూ నేను 16 సంవత్సరాల నుంచి బెంగళూరు టీం కి అభిమానిగా ఉన్నాను.
వాళ్లు ఐపిఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక్కసారి కూడా కప్ కొట్టలేకపోతున్నారు. మీరు చెన్నై తరపున ఐదుసార్లు కప్ కొట్టి చూపించారు కాబట్టి మీరు బెంగుళూర్ టీమ్ కప్ కొట్టడానికి ఏమైనా సలహాలు, సూచనలు ఇచ్చి బెంగుళూర్ ని గెలిపించొచ్చు కదా లేదంటే బెంగుళూర్ టీమ్ వైపు ఆడి ఆ టీమ్ కి కప్ అందించవచ్చు కదా బెంగుళూర్ ఫ్యాన్స్ అయిన మేము చాలా హ్యాపీ గా ఫీల్ అవుతాం అంటూ అడిగాడు. దాంతో అక్కడున్న వాళ్ళందరూ ఒకసారి గా నవ్వారు. ఇక పిల్లాడు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ గా ధోని బెంగళూరు టీం చాలా మంచి టీం ఆ టీంలో ఉన్న ప్లేయర్లందరు కూడా మంచి ప్లేయర్లు అయినప్పటికీ వాళ్ళందరికి టీమ్ లో ఆడే అవకాశం వస్తే ఆ టీం తప్పకుండా కప్పు గెలుస్తుంది.
కానీ కొంతమందికి గాయాల కారణంగా టీమ్ నుంచి వైదొలుగుతారు.ఇక ఇలాంటివి సమయం లో ఉంటే అసలు సమస్య అక్కడే ప్రారంభమవుతుంది ఆ ప్లేయర్ ని రిపీట్ చేసే ప్లేయర్ టీం కి దొరికడు. ఆ టీమ్ అనే కాదు ప్రతి టీమ్ కి అదే ప్రాబ్లమ్ ని ఎదుర్కొంటుంది అంటూ సమాధానం చెప్పాడు. అలాగే మనం అనుకున్న సిచువేశన్స్ మ్యాచ్ లోకి వెళ్లిన తర్వాత ఉండవు. కాబట్టి కప్పు కొట్టడం అనేది కూడా చాలా పెద్ద టాస్క్ అని చెప్పాడు. అలాగే నేను బెంగళూరు టీం వైపు రావాలని మీరు అంటున్నారు ఆ టీమ్ వైపు వచ్చి ఆడితే నా అభిమానులు నన్నేమంటారు…
ప్రస్తుతం నేను చెన్నై టీం తరఫున ఆడుతున్నాను కాబట్టి నా టీం యొక్క ప్రయోజనాల గురించి నా టీమ్ ని ఎలా గెలిపించుకోవాలనే దాని గురించి మాత్రమే ఆలోచిస్తాను అలాగే మిగితా టీమ్ లకి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ప్రస్తుతం ధోనీ ఆ అబ్బాయితో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది…