MS Dhoni Business List: మైదానంలో నిశ్శబ్దంగా ఉంటాడు. వికెట్ల వెనుక వ్యూహాలు రచించి.. వాటిని అంతే వేగంగా అమలు చేస్తుంటాడు. అందువల్లే ధోనిని విజయవంతమైన సారధి అని పిలుస్తుంటారు. టీమ్ ఇండియాకు వన్డే వరల్డ్ కప్, టి20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన చరిత్ర ధోనికి ఉంది.
ధోని కొద్ది సంవత్సరాల క్రితం జాతీయ జట్టు నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై జట్టు తరఫున ఆడుతున్నాడు. 2023 సీజన్లో చెన్నై జట్టును విజేతగా నిలిపాడు ధోని. 2024 సీజన్లో సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఈ ఏడాది సీజన్లో ధోని చెన్నై జట్టుకు తాత్కాలిక సారధిగా వ్యవహరించాడు. ధోని తాత్కాలిక సారధిగా ఉన్నప్పటికీ చెన్నై జట్టు తలరాత పెద్దగా మారలేదు.
ధోని జాతీయ జట్టు నుంచి వీడ్కోలు తీసుకున్నప్పటికీ.. వ్యాపారంలో మాత్రం అతడు తన జోరు తగ్గించడం లేదు. అంతకుమించి అనే స్థాయిలో వివిధ వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టి దర్జాగా సంపాదిస్తున్నాడు. క్రికెట్ మాత్రమే కాకుండా, ఎవరూ గుర్తించని వ్యాపారాలలో ధోని పెట్టుబడి పెట్టాడు. ఓ నివేదిక ప్రకారం ధోని ఏకంగా 1000 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించినట్టు తెలుస్తోంది. చెన్నై జట్టుకు ఆడిన నేపథ్యంలో అతని దృక్పథం మొత్తం మారిపోయిందని తెలుస్తోంది. దాదాపు దాదాపు 17 సంవత్సరాలుగా చెన్నై యాజమాన్యంతో ధోని తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడు.
చెన్నై యాజమాన్యానికి వ్యాపారంలో విశేషమైన అనుభవం ఉండడంతో.. దానిని అందిపుచ్చుకున్న ధోని వ్యాపారవేత్తగా మారిపోయాడు. చెన్నై ఫుట్బాల్ క్లబ్ కో ఓనర్ గా మారిపోయిన ధోని, కార్స్ 24, ఖాతా బుక్, ఈ మోటర్ ఏడి ఫర్ ఎలక్ట్రిక్ సైకిల్స్, తగడ రహో, సెవెన్ ఇన్ లైఫ్ స్టైల్.. ఇలా అనేక రకాల వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టాడు.. మొత్తంగా 1000 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. మిస్టర్ కూల్ అని పేరు తెచ్చుకున్న అతడు.. వ్యాపారంలో కూడా సైలెంట్ గా 1000 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించి, సరికొత్త చరిత్ర సృష్టించాడు.