Mohammed Shami Wife: ఒక మనిషి బతకడానికి గాలి, నీరు, ఆహారం కావాలి. మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి కుటుంబం కావాలి. ఈ కుటుంబం మరింత గొప్పగా ఉండడానికి ఒక సమూహం కావాలి. ఉన్నతమైన జీవితం.. విలాసాలు, సౌకర్యాలు కావాలంటే డబ్బు కచ్చితంగా ఉండాలి. అయితే ఈ డబ్బు ఉచితంగా రాదు. ఉచితంగా వచ్చిన డబ్బు ఎప్పటికీ నిలబడదు.. కానీ ఈ విషయం కొంతమందికి అర్థం కాదు. పైగా డబ్బు సంపాదించడానికి వారు రకరకాల మార్గాలను అన్వేషిస్తుంటారు.. కాకపోతే ఈ అన్వేషించే మార్గాలు సక్రమంగా ఉంటే బాగానే ఉంటుంది. డబ్బు సంపాదన కోసం అడ్డదారులు తొక్కితేనే సమాజం థూ అంటూ కాండ్రించి ఉమ్ముతుంది. ఇప్పుడు ఇదే పరిస్థితి క్రికెటర్ మహమ్మద్ షమీ భార్యకు ఎదురవుతోంది.
మహమ్మద్ షమీ జహాన్ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ ఒక కుమార్తె కూడా ఉంది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. అవి విడాకులకు దారితీసాయి. విడాకులు ఇచ్చే క్రమంలో కోర్టు ఆదేశాల మేరకు షమీ భరణం ఇచ్చాడు. అయితే జహాన్ అంతటితోనే ఆగడం లేదు. ఇప్పుడు ఏకంగా మరొకసారి కోర్టు మెట్లు ఎక్కింది.. ఏకంగా తనకు నెలకు 10 లక్షలు కావాలని డిమాండ్ చేస్తోంది. అంతేకాదు ఈ వ్యవహారాన్ని ఆమె సుప్రీంకోర్టు మెట్ల దాకా తీసుకెళ్ళింది.. అయితే దీనిపై సుప్రీంకోర్టు ఇంతవరకు ఎటువంటి స్పందన తెలియజేయలేదు.
జహాన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఆమె మీద రకరకాల విమర్శలు వినిపిస్తున్నాయి.. మాజీ భర్త సంపాదన మీద ఇంకా ఎందుకు ఆధారపడుతున్నామంటూ షమీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. విడాకులు తీసుకున్న తర్వాత.. అతడు భరణం కూడా చెల్లించాడని.. అవి కూడా సరిపోక నెలకు 10 లక్షలు కావాలని కోరడం సరికాదని షమీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ నిర్వహణ అనేది మనకు వచ్చే ఆదాయ ప్రకారం ఉండాలని.. మాజీ భర్త ఆదాయం మీద ఆధారపడి ఉండకూడదని షమీ అభిమానులు చురకలు అంటిస్తున్నారు. ఇప్పటికైనా షమీని పీక్కు తినడం ఆపివేయాలని ఆమెకు సూచిస్తున్నారు.