Aus Vs Eng Ashes: యాషెస్ సిరీస్ ను ఇంగ్లాండ్ జట్టు ఓటమితో మొదలుపెట్టింది. తొలి ఇన్నింగ్స్ లో 40 పరుగుల లీడ్ లభించినప్పటికీ.. దానిని నిలుపుకోవడంలో ఇంగ్లాండ్ జట్టు విఫలమైంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో విఫలమైనప్పటికీ.. రెండవ ఇన్నింగ్స్ లో మాత్రం అదరగొట్టింది. ముఖ్యంగా హెడ్ (123) సెంచరీ తో వీరవిహారం చేశాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 204 పరుగుల విజయ లక్ష్యం చూస్తుండగానే కరిగిపోయింది. తద్వారా తొలి టెస్ట్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది.
ముఖ్యంగా రెండవ రోజు ఆస్ట్రేలియా బౌలర్లు అదిరిపోయే రేంజ్ లో బౌలింగ్ వేశారు. స్టార్క్ తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్లు సొంతం చేసుకోగా.. రెండవ ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు దక్కించుకున్నాడు. మొత్తంగా తొలి టెస్ట్ లో 10 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియా జట్టు సాధించిన విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. 10 వికెట్లు సొంతం చేసుకున్న నేపథ్యంలో స్టార్క్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది.
ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్ సమయంలో స్టార్క్ తన తొలి ఓవర్ ఐదవ బంతికే వికెట్ దక్కించుకున్నాడు. అతడు వేసిన ఐదవ బంతిని ఇంగ్లాండ్ ఓపెనర్ క్రావ్లీ(0) స్ట్రైట్ కవర్ డ్రైవ్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఆ బంతిని స్టార్ట్ ఒక్క చేతి తో అందుకున్నాడు. దీంతో క్రావ్లీ నిరాశతో వెను తిరిగాడు. ఫలితంగా ఒక్క పరుగు కూడా చేయకుండానే ఇంగ్లాండ్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది.
క్యాచ్ అందుకునే క్రమంలో స్టార్క్ కిందపడ్డాడు. అతడి చేయి కూడా మైదానాన్ని తాకినట్టు కనిపించింది. దీంతో స్టార్క్ మోసం చేశాడని.. అంపైర్లు కూడా అతడి తప్పును గుర్తించలేకపోయారని సోషల్ మీడియాలో నెటిజన్లు పేర్కొంటున్నారు. అయితే రిప్లై లో మాత్రం అతడు అందుకున్న తీరు సరైనదేనని.. బంతి నేలకు తగలలేదని.. అతడు బంతిని అత్యంత జాగ్రత్తగా అందుకున్నాడని తేలింది. ఫలితంగా ఇంగ్లాండ్ అభిమానుల ఆరోపణలకు బలం లేకుండా పోయింది.
స్టార్క్ ఈ మ్యాచ్లో 10 వికెట్లు దక్కించుకున్నాడు. హేజిల్ వుడ్, కమిన్స్ లేకుండానే తన బౌలింగ్ ప్రదర్శనతో సత్తా చూపించాడు. ఫలితంగా ఆస్ట్రేలియా జట్టు 40 పరుగుల లోటు ఇన్నింగ్స్ తో కూడా మ్యాచ్ గెలిచింది. అచ్చి వచ్చిన పెర్త్ మైదానంపై జయకేతనం ఎగరవేసింది. ఐదు టెస్టుల సిరీస్ లో 1-0 లీడ్ సాధించింది.
WHAT A RIDICULOUS TAKE! Mitchell Starc sends Zak Crawley off for a pair! #Ashes | #PlayoftheDay | @nrmainsurance pic.twitter.com/1cg8PtLzx4
— cricket.com.au (@cricketcomau) November 22, 2025