https://oktelugu.com/

ఐపీఎల్ హీట్: ప్లే ఆఫ్స్‌కు చేరే జట్లేవి..?

దుబాయ్‌ వేదికగా నడుస్తున్న ఐపీఎల్‌ రోజురోజుకూ ఉత్కంఠను తలపిస్తోంది. మ్యాచ్‌లు రసవత్తరంగా నడుస్తున్నాయి. జట్లు గెలుపు కోసం కఠోర శ్రమతో శ్రమిస్తున్నాయి. ఒకప్పుడు ఛాంపియన్లుగా నిలిచిన జట్లు ఇప్పుడు ప్లే ఆఫ్స్‌కు చేరకుండానే వెనుతిరిగాయి. మరోవైపు ఒక్కసారి కూడా ప్లేఆఫ్స్‌ చేరని జట్లు ఈసారి తమ సత్తా చాటుతున్నాయి. మ్యాచ్‌మ్యాచ్‌కు పరిస్థితులు మారుతుండడంతో ఏ జట్టు నాకౌట్‌ దశకు చేరుకుంటుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. తాజాగా ఢిల్లీపై హైదరాబాద్‌ ఊహించిన స్థాయిలో విజయం సాధించింది. ఇప్పుడు సమీకరణాలు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 28, 2020 5:34 pm
    Follow us on

    IPL 2020 playoffs race

    దుబాయ్‌ వేదికగా నడుస్తున్న ఐపీఎల్‌ రోజురోజుకూ ఉత్కంఠను తలపిస్తోంది. మ్యాచ్‌లు రసవత్తరంగా నడుస్తున్నాయి. జట్లు గెలుపు కోసం కఠోర శ్రమతో శ్రమిస్తున్నాయి. ఒకప్పుడు ఛాంపియన్లుగా నిలిచిన జట్లు ఇప్పుడు ప్లే ఆఫ్స్‌కు చేరకుండానే వెనుతిరిగాయి. మరోవైపు ఒక్కసారి కూడా ప్లేఆఫ్స్‌ చేరని జట్లు ఈసారి తమ సత్తా చాటుతున్నాయి. మ్యాచ్‌మ్యాచ్‌కు పరిస్థితులు మారుతుండడంతో ఏ జట్టు నాకౌట్‌ దశకు చేరుకుంటుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. తాజాగా ఢిల్లీపై హైదరాబాద్‌ ఊహించిన స్థాయిలో విజయం సాధించింది. ఇప్పుడు సమీకరణాలు మరింత క్లిష్టంగా మారాయి.

    Also Read: ఐపీఎల్: సన్ రైజర్స్ నిలవాలంటే గెలవాల్సిందే?

    ర్యాంకుల్లో మొదటి రెండు స్థానాల్లో ఉన్న ముంబయి, బెంగళూరు జట్లు బుధవారం తలపడుతున్నాయి. ఈ ఇరు జట్లు కూడా 14 పాయింట్లతో సమంగా ఉన్నాయి. ఏ జట్టు గెలుస్తుందో ఆ జట్టు మొదటిగా ప్లేఆఫ్స్‌కు చేరుకుటుంది. దీంతో ఈ మ్యాచ్‌ ఇరు జట్లకూ ముఖ్యమైనదనే చెప్పాలి. ఈ మ్యాచ్‌లో బెంగళూరు గెలిస్తే హైదరాబాద్‌, ఢిల్లీ చేతిలో ఓడినా పర్వాలేదు. రన్‌రేట్‌ మాత్రం మెరుగ్గా మెయింటెన్‌ చేయాల్సి ఉంటుంది. ముంబయి చేతిలో ఓడితే మాత్రం మిగితా రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తేనే టాప్‌ 2లో అవకాశం ఉంటుంది. ముంబయి కూడా కోహ్లిసేన చేతిలో ఓడితే మళ్లీ హైదరాబాద్‌, ఢిల్లీ జట్లలో ఏదో ఒకదానిపై విజయం సాధించాలి. టేబుల్‌ టాపర్‌‌ కావాలంటే మాత్రం రెండింటిలో గెలవాలి. ఏది ఎలా జరిగినా ముంబై, ఢిల్లీ ఇరు జట్లు కూడా ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం ఖాయమనే చెప్పాలి.

    ఇప్పుడు ఢిల్లీ పరిస్థితి మాత్రం గందరగోళంలో పడింది. 14 పాయింట్లతో టాపర్‌‌గా ఉన్న ఆ జట్టుకు ఇప్పుడు హ్యాట్రిక్‌ ఓటమి ఎదురైంది. కోల్‌కత్తా, హైదరాబాద్‌ చేతిలో ఘోర పరాజయం చవిచూడడంతో రన్‌రేట్‌ పడిపోయింది. ఇప్పుడు మూడో స్థానానికి చేరుకుంది. మిగిలిన రెండు మ్యాచుల్లో గెలిస్తే టాప్‌ 2లో ఉంటుంది. ఆ రెండు మ్యాచ్‌లు కూడా ఒకటి ముంబయి, ఇంకోటి బెంగళూరుతో ఉన్నాయి. ఢిల్లీ ఈ రెండింటా ఓడినా రన్‌రేట్‌తో గట్టెక్కే పరిస్థితి రావచ్చు.

    Also Read: ఆస్ట్రేలియా పర్యటనకు జట్లు: మరో వివాదంలో బీసీసీఐ

    ప్లేఆఫ్స్‌ మరో తీవ్రంగా శ్రమిస్తున్న మరో రెండు జట్లు కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌, కోల్‌కత్తా. ఈ రెండు జట్లు కూడా తర్వాతి మ్యాచ్‌లు రాజస్థాన్‌, చెన్నైతో తలపాల్సి ఉంది. వరుస విజయాలతో జోరుమీదున్న రాహుల్‌ సేన ఈ రెండూ గెలిస్తే 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. కనీసం కోల్‌కతా అయినా ఒక మ్యాచ్‌లో ఓడాలి. ఇక హైదరాబాద్‌, రాజస్థాన్‌ ప్లేఆఫ్స్‌ అవకాశాలు ఇతర జట్లపై ఆధారపడి ఉన్నాయి. చెరో పది పాయింట్లతో 6,7 స్థానాల్లో ఉన్న ఈ రెండు జట్లు కూడా ఇకపై ఆడే ప్రతీ మ్యాచ్‌లోనూ గెలవాల్సి ఉంటుంది. అంతేకాదు పంజాబ్‌, కోల్‌కతా ఓడిపోవాలని కూడా వీరు కోరుకోవాలి. నిన్న ఢిల్లీపై భారీ విజయం సాధించిన హైదరాబాద్‌ షార్జా వేదికగా ముంబయి, బెంగళూరుతో తలపడాల్సి ఉంది. పరిస్థితులు అనుకూలిస్తే నెట్‌ రన్‌రేట్‌ ప్రకారం ఏదో ఒక జట్టు ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవం చేసుకుంటుంది.