ఐపీఎల్ స్పెషల్: ఏ టీంకు ఎంతమంది ఫ్యాన్స్?

ఐపీఎల్‌.. ఇండియన్‌ ప్రీమియర్‌‌ లీగ్‌.. క్రికెట్‌లో సరికొత్త ట్రెండ్‌ సెట్‌ చేసిందని చెప్పొచ్చు. ఐపీఎల్‌ స్టార్ట్‌ అవుతోందంటే క్రికెట్‌ అభిమానులకు పండగే పండగ. ఓ వైపు ఉత్కంఠ.. మరో వైపు ఉత్సాహం.. వాహ్‌ అనిపించే పోరు. ఏ జట్టు గెలుస్తుందా అని చివరి వరకూ ఆసక్తి.. అందరికీ ఇష్టమైన ఐపీఎల్‌ సమరం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతోంది. బీసీసీఐ కూడా త్వరలోనే షెడ్యూల్‌ ప్రకటించనుంది. ఏటా ఈ స‌మ‌రం ప్రారంభానికి ముందు ఐపీఎల్‌ అభిమానుల మ‌ధ్య మొద‌లయ్యే […]

Written By: NARESH, Updated On : September 6, 2020 10:24 am

Ipl 2020

Follow us on

ఐపీఎల్‌.. ఇండియన్‌ ప్రీమియర్‌‌ లీగ్‌.. క్రికెట్‌లో సరికొత్త ట్రెండ్‌ సెట్‌ చేసిందని చెప్పొచ్చు. ఐపీఎల్‌ స్టార్ట్‌ అవుతోందంటే క్రికెట్‌ అభిమానులకు పండగే పండగ. ఓ వైపు ఉత్కంఠ.. మరో వైపు ఉత్సాహం.. వాహ్‌ అనిపించే పోరు. ఏ జట్టు గెలుస్తుందా అని చివరి వరకూ ఆసక్తి.. అందరికీ ఇష్టమైన ఐపీఎల్‌ సమరం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతోంది. బీసీసీఐ కూడా త్వరలోనే షెడ్యూల్‌ ప్రకటించనుంది. ఏటా ఈ స‌మ‌రం ప్రారంభానికి ముందు ఐపీఎల్‌ అభిమానుల మ‌ధ్య మొద‌లయ్యే గొడ‌వ ఒక‌టే. ఏ టీంకు ఎక్కువ మంది అభిమానులున్నారు. ఏ టీంకు ఎక్కువ మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ఈ ప్రశ్నకు క‌చ్చితమైన స‌మాధానం చెప్పడం కొంచెం కష్టమే. ప్రతి టీంకు సోషల్‌ మీడియాలో మాత్రం ఎంత మంది ఫాలోవర్స్‌ ఉన్నారో తెలుసుకోవచ్చు. ఫైనల్‌గా ఈ ఐపీఎల్ 2020 స‌మరంలో ఏ జ‌ట్టు ట్రోఫీని కైవ‌సం చేసుకుంటుందో చూడాలి.

Also Read: ఐపీఎల్ కు గ్రహణం: చెన్నైకు మరో షాక్.. హర్భజన్ ఔట్

రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌: ఫేస్‌బుక్‌లో 4.1 మిలియ‌న్ లైక్‌లు ఉన్నాయి. ట్విట్టర్‌లో 1.1 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 1 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్‌, అలాగే యూట్యూబ్ విష‌యానికి వ‌స్తే 179కే స‌బ్‌ స్ర్కైబ్స్‌ మాత్రమే ఉన్నాయి.

కింగ్ ఎలెవ‌న్ పంజాబ్‌: ఫేస్‌బుక్‌లో 8.4 మిలియ‌న్ లైక్స్‌ ఉన్నాయి. ట్విట్టర్‌‌లో 2 మిలియ‌న్స్‌ ఫాలోవ‌ర్స్, ఇస్టాగ్రామ్‌లో 1.4 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్‌, అలాగే యూట్యూబ్‌లో 153కే స‌బ్‌ స్ర్కైబ‌ర్స్ ఉన్నారు.

ఢిల్లీ క్యాపిట‌ల్స్‌: ఫేస్‌బుక్‌లో 5.4 మిలియ‌న్ లైక్స్‌ ఉండగా.. ట్విట్టర్‌‌లో 1.4 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 1.4 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్‌, యూట్యూబ్‌లో 144కే స‌బ్‌ స్క్రైబ్స్‌ ఉన్నాయి.

కోల్‌కత్తా నైట్ రైడ‌ర్స్: ఫేస్‌బుక్‌లో 16 మిలియ‌న్ లైక్, ట్విట్టర్‌‌లో 4 మిలియ‌న్స్‌ ఫాలోవ‌ర్స్, ఇస్టాగ్రామ్‌లో 1.7 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్‌, యూట్యూబ్‌లో 384కే సబ్‌ స్ర్కైబ్స్‌ ఉన్నాయి.

Also Read: ఐపీఎల్-2020పై నీలినీడలు.. క్రికెటర్లలో భయాందోళన

స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్: ఫేస్‌బుక్‌లో 5.9 మిలియ‌న్స్‌ లైక్స్‌ ఉన్నాయి. ట్విట్టర్‌‌లో 2.9 మిలియ‌న్స్‌ ఫాలోవ‌ర్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో 1.5 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్‌, యూట్యూబ్‌లో 260కే స‌బ్‌ స్ర్కైబర్స్‌ ఉన్నారు. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగుళూర్‌: ఫేస్‌బుక్‌లో 9.2 మిలియ‌న్ లైక్స్‌, ట్విట్టర్‌‌లో 3.6 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్, ఇస్టాగ్రామ్‌లో 4 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్‌, యూట్యూబ్ విష‌యానికి వ‌స్తే 896కే స‌బ్‌ స్క్రైబ‌ర్స్ ఉన్నారు. చెన్నై సూప‌ర్ కింగ్స్‌: ఫేస్‌బుక్‌లో 12 మిలియ‌న్ లైక్స్‌, ట్విట్టర్‌‌లో 5.7 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో 4.7 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్‌, యూట్యూబ్‌లో 734కే స‌బ్‌ స్క్రైబ‌ర్స్ ఉన్నారు. ముంబయి ఇండియ‌న్స్:‌ ఫేస్‌బుక్‌లో 13 మిలియ‌న్ లైక్స్‌, ట్విట్టర్‌‌లో 5.6 మిలియ‌న్స్‌ ఫాలోవ‌ర్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో 4.9 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్‌, యూట్యూబ్‌లో 639కే స‌బ్‌ స్ర్కైబ‌ర్స్ ఉన్నారు.