BCCI rules players stay restrictions IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చే సీజన్ నుంచి బీసీసీఐ కఠిన నిబంధన విధించేందుకు సిద్ధమైంది. ప్లేయర్లలో మరింత పారదర్శకత పెంచేందుకు రెడీగా ఉంది. బిసిసిఐ ఈ నిబంధన తీసుకురావడానికి ప్రధాన కారణం ఆటగాళ్లే. వాళ్ళు చూపిస్తున్న దూకుడు వల్లే బి సి సి ఐ ఇంతటి నిర్ణయానికి రావాల్సి వచ్చింది.
ఐపీఎల్ జరుగుతున్నప్పుడు ప్లేయర్ల మీద విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని దూరం చేసుకోవడానికి కుటుంబ సభ్యుల సాంగత్యం అవసరం పడుతుంది. గతంలో ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహిస్తున్నప్పుడు ప్లేయర్లు తమ కుటుంబ సభ్యులను తీసుకొచ్చేవారు. ఇందులో కొంతమంది ప్లేయర్లు తమ స్నేహితురాళ్ళను కూడా తీసుకొచ్చేవారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ వారంతా కూడా హోటల్ రూమ్ లోకి గర్ల్ ఫ్రెండ్స్ ను తీసుకెళ్తున్నారు..
భార్యలు, ఇతర కుటుంబ సభ్యులతో ప్లేయర్లు హోటల్ రూమ్ లలో ఉంటే పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. కానీ కొంతమంది ప్లేయర్లు తమ గర్ల్ ఫ్రెండ్స్ తో హోటల్ రూమ్ లలో ఉంటున్నారు.. ముంబై చెట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా, రాజస్థాన్ ప్లేయర్ జైస్వాల్, హైదరాబాద్ ప్లేయర్ కిషన్, పంజాబ్ ప్లేయర్ అర్షదీప్ సింగ్ తమ గర్ల్ ఫ్రెండ్స్ తో ఇష్టానుసారంగా తిరిగేస్తున్నారు.. అయితే క్రికెటర్లు తమ గర్ల్ ఫ్రెండ్స్ తో ఉండడం పట్ల బీసీసీఐకి ఎటువంటి ఇబ్బందులు లేవు. కాకపోతే కొందరు ప్లేయర్ల గర్ల్ ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో ఇన్ ప్లూ యన్సర్స్ గా ఉన్నారు. వారు ప్లేయర్లతో కలిసి ఉన్నప్పుడు సున్నితమైన సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటే అది ఇబ్బందికరంగా మారుతుందని బీసీసీఐ భావిస్తోంది..
“ఆటగాళ్లు సంబంధాలలో ఉండడం పట్ల ఎటువంటి ఇబ్బంది లేదు. దానిని మేము వేరే విధంగా చూడడం లేదు. కాకపోతే సన్నిహితంగా ఉన్నప్పుడు సున్నితమైన సమాచారం బయటకు వెళ్తే ఇబ్బంది అవుతుంది. ఇప్పటివరకు ఇటువంటి పరిణామం ఎదురు కాలేదు కానీ.. భవిష్యత్ కాలంలో ఎదురైతే ఇబ్బంది తప్పదని.. అందువల్లే వచ్చే ఐపిఎల్ సీజన్ నుంచి హోటల్లో కి వారిని తీసుకువచ్చేందుకు అనుమతి నిరాకరించాలని అనుకుంటున్నామని” పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ బీసీసీఐ అధికారి జాతీయ మీడియాతో చెప్పారు.