Homeక్రీడలుక్రికెట్‌IPL Final 2026: మరి కాసేపట్లో ఐపీఎల్ ఫైనల్.. అహ్మదాబాద్ పిచ్ ఎలా ఉంది.. ఎవరికి...

IPL Final 2026: మరి కాసేపట్లో ఐపీఎల్ ఫైనల్.. అహ్మదాబాద్ పిచ్ ఎలా ఉంది.. ఎవరికి అనుకూలం

IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ ఫైట్ జరగుతుంది. ఐపీఎల్ 2025, 2026 t20 వరల్డ్ కప్ ఫైనల్స్ ఇక్కడ జరిగాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లు ఇక్కడ విజయం సాధించాయి. బ్యాటర్లకు ఈ మైదానం స్వర్గధామంగా ఉంటుంది. అదే సమయంలో ఫాస్ట్ బౌలర్లకు అనువుగా ఉంటుంది. ఈ మైదానంలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్లు 16 సార్లు.. సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు 8 సార్లు విక్టరీలు అందుకున్నాయి. ఈ మైదానం మీద హైయెస్ట్ స్కోర్ 255.. లోయస్ట్ స్కోర్ 66..

మిగతా జట్లతో పోల్చి గనుక చూస్తే గుజరాత్ జట్టుకు చెప్పుకునే స్థాయిలో బ్యాటింగ్ బలం లేదు.. మిడిల్ ఆర్డర్ అత్యంత వీక్. ఈ జట్టుకు ప్రధాన బలం గిల్, సాయి సుదర్శన్.. వీరిద్దరూ ఇప్పటివరకు తిరుగులేని స్థాయిలో ఓపెనింగ్ భాగస్వామ్యాలను నమోదు చేశారు. క్వాలిఫైయర్ 2 మ్యాచ్ లో రాజస్థాన్ జట్టు మీద గిల్, సాయి సుదర్శన్ 167 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు చేశారంటే.. వారిద్దరు ఏ స్థాయిలో బ్యాటింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఈ టోర్నీలో ఆరెంజ్ క్యాప్ విభాగంలో సాయి సుదర్శన్ రెండవ స్థానం, గిల్ మూడో స్థానంలో ఉన్నారు.

బట్లర్ కూడా దూకుడు మీద ఉన్నాడు. ఒకవేళ ఈ ముగ్గురు గనుక విఫలమైతే గుజరాత్ జట్టుకు ఇబ్బంది తప్పదు. క్వాలిఫైయర్ -1 లో బెంగళూరు గిల్, సాయి సుదర్శన్ ను ఔట్ చేసి విజయాన్ని అందుకుంది. ఫైనల్ కూడా ఇదే స్థాయిలో ప్రదర్శన చేయాలని బెంగళూరు జట్టు బలంగా భావిస్తుంది. మిడిల్ ఆర్డర్లో వాషింగ్టన్ సుందర్.. నిశాంత్ సింధు.. తేవాటియ.. హోల్డర్ వంటి ప్లేయర్లు ఉన్నప్పటికీ.. వారి మీద గుజరాత్ జట్టు పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు.

ఇక బెంగళూరు లో భీకరమైన బ్యాటర్లు ఉన్నారు. వెంకటేష్ అయ్యర్.. విరాట్ కోహ్లీ.. సాల్ట్.. కృనాల్ పాండ్యా.. దేవదత్.. రజత్ పాటిదర్ వంటి ప్లేయర్లతో బెంగళూరు బ్యాటింగ్ బీభత్సంగా ఉంది. వీరే కాకుండా డేవిడ్.. షెఫర్డ్.. జితేష్ శర్మ అద్భుతాలు చేయగలరు. బెంగళూరు ప్రారంభంలో వికెట్లు కోల్పోయినప్పటికీ.. వెనకడుగు వేసే సవాల్ లేదు. అంతేకాదు పరుగుల వేగం ఏమాత్రం తగ్గదు. 200 కి మించి పరుగులు చేయడం.. 200 కు మించి లక్ష్యాలను ఫినిష్ చేయడం బెంగళూరు జట్టుకు పెద్ద కష్టం కాదు.

ఫైనల్ ప్రత్యర్థి గుజరాత్ జట్టు కావడంతో బెంగళూరు ఉత్సాహంతో కనిపిస్తోంది. ఇటీవల జరిగిన మ్యాచ్లో గుజరాత్ మీద బెంగళూరు గెలిచింది. అంతకు ముందు జరిగిన లీగ్ మ్యాచ్లో బెంగళూరును 155 పరుగులకే కుప్పకూల్చింది గుజరాత్. అటువంటి మ్యాజిక్ మరోసారి జరిగితే తప్ప బెంగళూరు వెనకడుగు వేసే అవకాశం లేదు.. బెంగళూరు జట్టులోకి సాల్ట్ రంగ ప్రవేశం చేయడం ఖాయం అయిపోయింది.

బౌలింగ్లో గుజరాత్ జట్టు వైవిద్యంగా ఉంది. రబాడ, సిరాజ్, రషీద్ ఖాన్ వంటి వారు ఈ సీజన్లో మెరుగ్గా వికెట్లు తీశారు. బెంగళూరు జట్టులో హేజల్ వుడ్, రసిక్ థార్, భువనేశ్వర్ కుమార్ సుయాస్ మెరుగ్గా కనిపిస్తున్నారు. దీంతో బ్యాటర్ల మధ్య మాత్రమే కాకుండా.. బౌలర్ల మధ్య పోరాటం కూడా జోరుగా సాగే అవకాశం కనిపిస్తోంది. ఈ మ్యాచ్లో విజయం సాధించే అవకాశం బెంగళూరుకు ఎక్కువగా ఉన్నప్పటికీ.. గుజరాత్ జట్టును ఏమాత్రం తీసి పడేయడానికి అవకాశం లేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular