Homeక్రీడలుక్రికెట్‌IPL 2026 Final Prize Money: ఐపీఎల్ విన్నర్ కు దక్కే ప్రైజ్ మనీ ఎంతో...

IPL 2026 Final Prize Money: ఐపీఎల్ విన్నర్ కు దక్కే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..

IPL 2026 Final Prize Money: ఐపీఎల్ చివరి దశకు చేరింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్, బెంగళూరు జట్లు పోటీ పడబోతున్నాయి. ఇప్పటికే క్వాలిఫైయర్ దశలో బెంగళూరు గుజరాత్ జట్టును ఓడించింది. ఇటీవల రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో గుజరాత్ విజయం సాధించి ఫైనల్ లాగా వచ్చేసింది.. రెండు జట్లలో హేమాహేమీలైన ప్లేయర్లు ఉండడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం కనిపిస్తోంది.

ఐపీఎల్ లో సాధారణంగా కాసుల ప్రవాహం కొనసాగుతూ ఉంటుంది. ప్రతి మ్యాచ్ కూడా డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అయితే ఫైనల్ పోరులో విజయం సాధించిన జట్టుకు ఏ స్థాయిలో ప్రైజ్ మనీ ఇస్తారనే విషయం అభిమానుల్లో చర్చకు దారితీస్తూ ఉంటుంది. ఐపీఎల్ లో ఛాంపియన్ గా ఆవిర్భవించిన జట్టుకు 20 కోట్లు లభిస్తాయి. రెండవ స్థానంలో మించిన జట్టుకు 13 కోట్లు లభిస్తాయి. మూడో స్థానంలో రాజస్థాన్ జట్టు నిలిచింది కాబట్టి.. ఏడు కోట్లు వస్తాయి.. నాలుగు స్థానంలో ఉన్న హైదరాబాద్ జట్టుకు 6.5 కోట్ల లభిస్తాయి. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ విన్నర్లకు 10 లక్షల చొప్పున లభిస్తాయి. అత్యంత విలువైన ఆటగాడికి 10 నుంచి 15 లక్షల వరకు లభిస్తాయి. ఎమర్జింగ్ ప్లేయర్ కు 20 లక్షల వరకు దక్కుతాయి. సూపర్ స్ట్రైకర్, అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లకు చెరి 10 లక్షల చొప్పున ప్రైజ్ మనీ లభిస్తుంది.

ఐపీఎల్ లో ఈ స్థాయిలో ప్రైజ్ మనీ చెల్లించడం వెనుక ప్రధాన కారణం.. ఆటగాళ్లలో క్రీడా స్ఫూర్తిని పెంచడమే. ఐపీఎల్ బ్రాండ్ వేల్యూ పెరగడం వల్ల బిసిసిఐ ప్రైజ్ మనీ భారీగా పెంచేసింది. టి20 లీగ్ లలో ఏ యాజమాన్యం కూడా ఈ స్థాయిలో ప్రైజ్ మనీ ఇవ్వడం లేదు. కాకపోతే ఐపిఎల్ మార్కెట్ విలువ వేరే విధంగా ఉంటుంది. కార్పొరేట్ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టడం.. ప్రకటన రూపం.. ప్రసార హక్కుల రూపంలో భారీగా సొమ్ము వస్తున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ స్థాయిలో ప్రైజ్ మనీ.. ఆటగాళ్లకు సొమ్ములు చెల్లిస్తోంది.

ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన జట్టు విలువ కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. 2008లో రాజస్థాన్ ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. అప్పటినుంచి మరోసారి ఆ జట్టు ట్రోఫీ అందుకోలేకపోయింది. ఆయనప్పటికీ ఇటీవల ఆ జట్టు చేతులు మారింది. ప్రారంభంలో కొనుగోలు చేసిన యాజమాన్యానికి భారీగా డబ్బులు వచ్చాయి. బెంగళూరు గత ఏడాది ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. దీంతో ఆ జట్టు విలువ పెరిగింది. పాత యాజమాన్యం జట్టును అమ్మింది. భారీగా డబ్బులు రావడంతో పండగ చేసుకుంది. ఐపీఎల్ ప్రారంభంలో జట్లను కొనుగోలు చేసిన యాజమాన్యాలు ఇప్పటికే భారీగా లాభాలు సంపాదించాయి. ఒకవేళ ఆ జట్లను కనుక అమ్ముకుంటే వాటికి భారీగా డబ్బులు వచ్చే అవకాశం ఉంది. అందువల్లే కార్పొరేట్ కంపెనీలు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పెట్టుబడులు పెడుతున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version